MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2025, GT vs PBKS:గ్లెన్ మ్యాక్స్ వెల్ చెత్త రికార్డు.. శ్రేయాస్ అయ్యర్ కారణమా?

IPL 2025, GT vs PBKS:గ్లెన్ మ్యాక్స్ వెల్ చెత్త రికార్డు.. శ్రేయాస్ అయ్యర్ కారణమా?

IPL 2025, GT vs PBKS: ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 243 ప‌రుగుల భారీ స్కోర్ చేసి గుజ‌రాత్ పై సూప‌ర్ విక్ట‌రీ అందుకుంది. అయితే, ఈ మ్యాచ్ లో గ్లెన్ మ్యాక్స్ వెల్ మ‌రో చిత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 26 2025, 01:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12

IPL 2025, GT vs PBKS:GT vs PBKS: గ్లెన్ మ్యాక్స్ వెల్ విధ్వంసం సృష్టిస్తాడు అనుకుంటే తుస్సు మ‌న్నాడు. ఒక్క ప‌రుగు కూడా చేయ‌కుండానే పెవిలియ‌న్ కు చేరాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2025 5వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మ‌ధ్య థ్రిల్లింగ్ మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తన విధ్వంసక బ్యాటింగ్ తో హాట్ టాపిక్ అవుతుండ‌గా, తను తన సొంత సహచరుడు గ్లెన్ మాక్స్‌వెల్ కు మాత్రం విల‌న్ అయ్యాడు. అయ్య‌ర్ కార‌ణంగా ఈ ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ ఐపీఎల్‌లో అత్యధిక డకౌట్‌లు అయిన ప్లేయ‌ర్ గా చెత్త రికార్డు సాధించాడు.

గ్లెన్ మాక్స్వెల్ 0 పరుగుల‌కే పెవిలియ‌న్ కు చేరాడు 

టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కు ఆరంభం అద్భుతంగా ఉంది. అరంగేట్ర ఆటగాడు ప్రియాంష్ ఆర్య కేవలం 23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 97  ప‌రుగుల అద్భుమైన నాక్ ఆడాడు. 16 పరుగుల వద్ద ఉమర్జాయ్ వికెట్ ప‌డిపోవ‌డంతో  అందరూ మాక్స్‌వెల్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు, కానీ సాయి సుదర్శన్ మొదటి బంతికే గ్లెన్ మ్య‌క్స్ వెల్ ను అవుట్ చేశాడు. 

22

మ్యాచ్ వెల్ కు శ్రేయాస్ అయ్యర్ విలన్ గా ఎలా మారాడు? 

సుదర్శన్ వేసిన బంతికి గ్లెన్ మాక్స్‌వెల్ రివర్స్ స్వీప్ ఆడటానికి ప్రయత్నించాడు కానీ బంతి బ్యాట్‌కు బదులుగా ప్యాడ్‌ను తాకింది. దీంతో అంపైర్ అవుట్ ప్ర‌క‌టించాడు. ఆ త‌ర్వాత మ్యాక్స్ వెల్ శ్రేయాస్ అయ్యర్ నుండి స‌మీక్ష తీసుకోవానికి స‌ల‌హా కోరగా దానికి నో చెప్పాడు. రివ్యూ తీసుకోక‌పోవ‌డంతో అవుట్ గా క్రీజు వదిలాడు. కానీ, రిప్లేలో బంతి స్టంప్స్‌ను తాక‌లేద‌నీ, మాక్స్‌వెల్ నాటౌట్‌గా అని వెల్ల‌డైంది. కానీ, స‌మీక్ష తీసుకోకుండానే పెవిలియన్ కు చేరాడు. 

గ్లెన్ మాక్స్‌వెల్ చెత్త రికార్డు

మ్యాక్స్ వెల్ రోహిత్ శ‌ర్మ‌ను అధిగ‌మించాడు.  ఐపీఎల్ చరిత్రలో గ్లెన్ మాక్స్‌వెల్ పేరిట ఒక చెత్త‌రికార్డు నమోదైంది. ఐపీఎల్ లో అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన ప్లేయ‌ర్ గా నిలిచాడు.  మ్యాక్స్ వెల్ 130 ఇన్నింగ్స్‌లలో 19 సార్లు సున్నాకే అవుట్ అయ్యాడు. రెండో స్థానంలో ఉన్న రోహిత్ శ‌ర్మ 253 ఇన్నింగ్స్‌లలో 18 సార్లు డకౌట్ అయ్యాడు.  

ఐపీఎల్ లో అత్యధిక డకౌట్లు

19 - గ్లెన్ మ్యాక్స్ వెల్
18 - రోహిత్ శర్మ
18 - దినేశ్ కార్తీక్
16 - పీయూష్ చావ్లా
16 - సునీల్ నరైన్

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Sanju Samson House : సంజూ శాంసన్ రాజభవనం లాంటి ఇల్లు చూశారా? దీని విలువెంతో తెలుసా?
Recommended image2
ICC T20 Rankings : వరల్డ్ కప్ ముగిసినా పాక్ ను వదలనంటున్న ఇషాన్, ఆ ఒక్కటీ లాగేసుకున్నాడుగా..!
Recommended image3
సూర్యకుమార్ ఔట్, అతడికే కెప్టెన్సీ పగ్గాలు.. టీ20 టీమ్ ప్రకటన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved