MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • CSK vs RCB: 16 ఏళ్ల త‌ర్వాత చెన్నై కంచుకోట‌లో ఆర్సీబీ జెండా !

CSK vs RCB: 16 ఏళ్ల త‌ర్వాత చెన్నై కంచుకోట‌లో ఆర్సీబీ జెండా !

IPL 2025 CSK vs RCB: హాజిల్‌వుడ్, ర‌జ‌త్ పాటిదార్ అద్భుతమైన ఆట‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్‌ను 50 పరుగుల తేడాతో ఓడించింది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 28 2025, 11:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

IPL 2025 CSK vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో విరాట్ కోహ్లీ టీమ్ రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరు వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది. త‌మ తొలి మ్యాచ్ లో  డిఫెండింగ్ ఛాంపియన్  కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్) ను ఓడించిన త‌ర్వాత ఇప్పుడు ఆర్సీబీ 5 సార్లు ఐపీఎల్ విజేత అయిన చెన్నై సూప‌ర్ కింగ్స్ ను ఓడించింది. దాదాపు 16 ఏళ్ల త‌ర్వాత చెన్నై కంచుకోట‌లో ఆర్సీబీ త‌న జెండాను పాతింది. ఈ విజ‌యంతో ఐపీఎల్ 2025 పాయింట్ల ప‌ట్టిక‌లో ఆర్సీబీ టాప్ లోకి వ‌చ్చింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
CSK vs RCB

CSK vs RCB

ఐపీఎల్ 2025 8వ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ జ‌ట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)-ఎంఎస్ ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లు చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగంలో అద‌ర‌గొట్టింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆర్సీబీ సాధించలేని విజయాన్ని రజత్ పాటిదార్ సాధించాడు. పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ 6155 రోజుల త‌ర్వాత చెపాక్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ను 50 పరుగుల తేడాతో ఓడించింది. 

34

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయిన త‌ర్వాత మొద‌ట బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీకి మంచి ఆరంభం ల‌భించింది. ఆర్సీబీ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ వచ్చిన వెంటనే ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నై బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు. అతను 32 పరుగులే చేసినా ఉన్నంత సేపు ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే, స్టార్ విరాట్ కోహ్లీ కూడా 31 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు.

మూడో స్థానంలో వచ్చిన దేవదత్ పడిక్కల్ 14 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్ల‌తో 27 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగో స్థానంలో వచ్చిన రజత్ పాటిదార్ జట్టుకు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. 32 బంతుల్లో 51 పరుగులు త‌న ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. చివ‌ర‌లో టిమ్ డేవిడ్ హ్యాట్రిక్ సిక్స‌ర్ల‌తో ఆర్సీబీ 196 పరుగులు చేసింది. 

44
Rajat Patidar

Rajat Patidar

భారీ స్కోర్ తో బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్ కు మంచి ఆరంభం ల‌భించ‌లేదు. ఆ త‌ర్వాత కూడా ఏ బ్యాట‌ర్ నుంచి కూడా సూప‌ర్ ఇన్నింగ్స్ లు రాలేదు. వ‌రుస వికెట్లు కోల్పోవ‌డంతో పాటు ప‌రుగులు చేయ‌డం త‌గ్గిపోవ‌డంతో కావాల్సిన ర‌న్ రేటు పెరిగిపోయింది. దీంతో 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 146 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. 

చెన్నై ఇన్నింగ్స్ లో ర‌చిన్ ర‌వీంద్ర 41 ప‌రుగులు చేశాడు. చివ‌రలో ధోని 30 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో హాజిల్ వుడ్ 3 వికెట్లు, య‌ష్ ద‌యాల్ 2, లివింగ్ స్టోన్ 2, భువ‌నేశ్వ‌ర్ కుమార్ 1 వికెట్ తీసుకున్నారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image3
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved