MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Sports
  • Cricket
  • IPL Choice 2025: IPL 2025లో అభిమానుల ఆదరణ ఎవరికి ఉంటుంది

IPL Choice 2025: IPL 2025లో అభిమానుల ఆదరణ ఎవరికి ఉంటుంది

IPLChoice 2025: 1xBet నిర్వహించిన సర్వే ప్రకారం IPL 2025లో అభిమానుల మద్దతు ఎవరికి ఉంటుందనే విషయంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోనీ వంటి ఆటగాళ్లతో పాటు ఏ ఏ జట్లకు అభిమానులు ఓటు వేశారో ఇప్పుడు తెలుసుకుందాం. 

9 Min read
Mahesh Rajamoni
Published : Feb 21 2025, 06:57 PM IST | Updated : Feb 21 2025, 07:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
11
Asianet Image

IPL Choice 2025 1xBet research: కొత్త IPL 2025 సీజన్ ప్రారంభానికి ముందు, IPL 2025లో పాల్గొనే ఆటగాళ్ళు అలాగే జట్లలో ప్రధాన అభిమానుల ప్రియమైన ఆటగాళ్లను తెలుసుకోవడానికి, అంతర్జాతీయ బ్రాండ్ 1xBet పరిశోధన నిర్వహించింది. ఈ అధ్యయనంలో సుమారు 3,500 మంది ప్రతిస్పందకులు పాల్గొన్నారు. ఇందులో పాల్గొనేవారిని కొత్త IPL 2025 సీజన్‌లో తాము మద్దతు ఇచ్చే ఆటగాళ్ళను, జట్లను ఎంచుకోవాలని కోరారు. అభ్యర్థులను నిర్ణయించడంతో పాటు, ప్రతిస్పందకులు తమకు నచ్చినవారికి మద్దతు ఇవ్వడానికి గల కీలక అంశాలను సూచించాల్సిన అవసరం ఉంటుంది. ఈ పరిశోధన తమ ఎంపికను అత్యంత గణనీయంగా నిర్ణయించే ఓట్ల సేకరణ అలాగే వయస్సు వర్గాలపై, స్థానిక గణాంకాలను కూడా అందిస్తుంది. 

IPL 2025 ప్రారంభానికి కేవలం ఒక నెల ముందు ఈ సర్వే నిర్వహించడం వలన సీజన్ ముందు అభిమానుల మానసిక స్థితిని ఈ ఫలితాలు చాలా ఖచ్చితంగా ప్రతిబింబిస్తాయి.
 
IPL 2025 లో అత్యధిక అభిమానుల మద్దతు ఉన్న ఆటగాళ్ళు
భారత క్రికెట్ అభిమానుల సర్వే ప్రకారం కొత్త సీజన్‌లో గరిష్ట మద్దతు పొందే 13 మంది అగ్రశ్రేణి ఆటగాళ్ళు ఉన్నారు: 
1.    విరాట్ కోహ్లీ (27,4%) 
2.    రోహిత్ శర్మ (12,4%), ఎంఎస్ ధోనీ (12,4%)
3.    అభిషేక్ శర్మ(11,1%)
4.    జస్‌ప్రీత్ బుమ్రా (4,3%)
5.    యశస్వి జైస్వాల్ (4,2%)
6.    హార్దిక్ పాండ్యా (4,0%)
7.    రిషబ్ పంత్ (2,9%)
8.    కేఎల్ రాహుల్ (2,5%)
9.    హెన్రిచ్ క్లాసీన్, సూర్యకుమార్ యాదవ్ (2,4%)
10.    సంజు సామ్సన్, శుభ్‌మన్ గిల్ (2,3%)
 
భారత క్రికెట్‌లో GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడే విరాట్ కోహ్లీ తన సన్నిహిత ప్రత్యర్థి కంటే రెండు రెట్లు ఎక్కువ ఆధిక్యంతో అభిమానుల మద్దతు రేటింగుల ప్రకారం  మొదటి స్థానంలో నిలిచాడు. దాదాపు ప్రతి మూడవ ప్రతిస్పందకులు మాజీ జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్‌కు ఓటు వేయడంతో 27.4% మద్దతు లభించగా, అతను IPL 2024 టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చాలా తరచుగా, అభిమానులు సమగ్రమైన నైపుణ్యాన్ని, అనుపమానమైన బలమైన ఆట తీరును, అలాగే అతని ఆకర్షణను, గెలవాలనే అతని మనస్తత్వాన్ని గుర్తించారు. విరాట్ "ద లెజెండ్" కోహ్లీ ఆట అనేది నిజమైన కళ, అలాగే అతను రాబోయే తరాలకు స్పూర్తిదాయకం. విరాట్ కోహ్లీకి 25-34 సంవత్సరాల వయస్సు గల ప్రతిస్పందకులు (46.8%) భారీగా ఓటు వేయగా, రెండవ స్థానంలో 20-24 (33.1%)వయస్సు గల వ్యక్తులు నిలిచారు. అదే సమయంలో, 60+ (0.62%) వయస్సు గల పెద్దవయస్సు వారు గుర్తించిన ఏకైక ఆటగాడు అతడే కావడం విశేషం. ఇండియా అంతటా విరాట్ కోహ్లీ ప్రజాదరణను పొందినప్పటికీ, అతను కర్ణాటక (12%), ఆంధ్రప్రదేశ్ (11.3%), ఉత్తర ప్రదేశ్ (11%), తెలంగాణ (9.7%) మరియు మహారాష్ట్ర (7.2%) అభిమానుల నుండి అత్యధిక ఓట్లను పొందాడు. 

ముంబై ఇండియన్స్‌కు చెందిన రోహిత్ శర్మ పోల్ ముగిసే వరకు రెండవ స్థానంలో ఉన్నాడు, కానీ చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ ఎంఎస్ ధోని చివరికి అతనిని చేరుకున్నాడు. ఈ జంట 12.4% మద్దతుతో రెండవ స్థానాన్ని ఉమ్మడిగా పంచుకున్నారు. 

ఆధునిక క్రికెట్‌లో రోహిత్ శర్మ అంటే చక్కదనం, శక్తి అలాగే నాయకత్వానికి ప్రతీక. ప్రత్యర్థి ఇన్నింగ్స్‌లను ఛేదించి భారీ పరుగులు సాధించడంలో అతని ప్రత్యేక ప్రతిభకు తార్కాణంగా అభిమానులు అతనిని హిట్‌మ్యాన్ అని పిలుస్తారు. ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లపై సమర్థవంతంగా ఆడగల సామర్థ్యం అతన్ని ప్రపంచంలోని అత్యుత్తమ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా చేసింది. అతను వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించారు, ఈ ఘనతను అతి కొద్దిమంది మాత్రమే సాధించగలరు. రోహిత్ శర్మ చూపే ప్రశాంతత, వ్యూహాత్మక ఆలోచన అతన్ని అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా చేయగా, అతని నాయకత్వంలో, ముంబై ఇండియన్స్ ఐదు IPL ట్రోఫీలను గెలుచుకుంది, అలాగే జాతీయ జట్టు T20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. టెస్ట్, ODI, T20తో సహా అన్ని ఫార్మాట్లలో ఆధిపత్యం చవహించే ఈ ఆటగాడు, ఛాంపియన్ మనస్తత్వం గలవాడు. అలాగే, భారతీయ అంతర్జాతీయ విజయానికి చిహ్నం. 25-34 సంవత్సరాల వయస్సు గల ప్రధాన ప్రేక్షకులు (48.9%) ఈ ఆటగాడిని ఎక్కువగా గుర్తించగా, 20-24 సంవత్సరాల వయస్సు గల యువత అతనికి కొంత తక్కువగా ఓటు వేశారు (29.4%). రోహిత్ శర్మకు మహారాష్ట్ర (12.9%), తరువాత కర్ణాటక (9%), ఉత్తర ప్రదేశ్ (9%), ఆంధ్రప్రదేశ్ (8.6%), బీహార్ (8.2%), తెలంగాణ (7.3%)లలో అత్యధికంగా అభిమానుల మద్దతు ఉంది.
 
మహేంద్ర సింగ్ ధోనీ కేవలం ఆటగాడు మాత్రమే కాదు, అతను క్రికెట్‌లో ఒక తరానికి చిహ్నం అని చెప్పాలి. అభిమానులతో తలా (నాయకుడు) అనిపించుకునే ధోనీ, ప్రశాంతత, ఆటలో చూపే తెలివితేటలు, అద్భుతమైన నాయకత్వం, అలాగే మరపురాని ముగింపులతో ఎన్నో ఘనతలను అందుకున్నాడు. ఎంఎస్ ధోనీని క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్‌గా పరిగణిస్తారు, ఇందుకు కారణం అతని నాయకత్వంలో టీమ్ ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్ అనేక ట్రోఫీలను గెలుచుకున్నాయి. ఎంఎస్ ధోనీ అంటే ఆటలో అత్యంత క్లిష్టమైన సమయంలో కూడా సిక్స్ కొట్టగల లెజెండరీ ఫినిషర్. ఈ క్రీడాకారుడు IPLలో తన చివరి సీజన్ ఆడుతున్నారనే నేపథ్యంలో మైదానంలో అతను కనపడిన ప్రతిసారీ మరింత భావోద్వేగాన్ని జోడిస్తుంది. ప్రేక్షకులలో అత్యంత చురుకైన రెండు వర్గాలు అతనికి ఓటు వేశారు: 25-34 సంవత్సరాల వయసు (45.25%), 20-24 సంవత్సరాలు (35.75%). ఎంఎస్ ధోనీకి ఆంధ్రప్రదేశ్‌లో (16%) అత్యంత భారీ సంఖ్యలో అభిమానులు ఉండగా, ఉత్తరప్రదేశ్ (11.8%) మరియు తెలంగాణ (10.9%) ప్రాంతాలలో విరాట్ కోహ్లీ కంటే కొంచెం ఎక్కువగా ఉన్నారు. 

ధృడమైన క్రికెట్‌లో కొత్త స్టార్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన అభిషేక్ శర్మ 10% కంటే ఎక్కువ స్కోరు చేసిన మరో ఆటగాడిగా నిలిచాడు. అతను భారత క్రికెట్‌కు భవిష్యత్తు అవుతాడని అభిమానులు నమ్ముతున్నారు. ఆటలో అతని అవిశ్రాంతమైన దూకుడు, సాంకేతిక నైపుణ్యం అలాగే సంభ్రమాశ్చర్యకరమైన ప్రదర్శనల కారణంగా అతను ఎంపికయ్యాడు. అద్భుతమైన సాంకేతికతను, నిర్భయతను అద్భుతంగా కలిపి మైదానంలో అతను ప్రదర్శించే ఆటతీరు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆట ఆరంభం నుండే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టివేయగల అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్లలో అభిషేక్ శర్మ ఒకరు. అతను చిన్నవాడయినా, ఎంతో ధైర్యవంతుడు. అలాగే ఇప్పటికే అత్యుత్తమ ఆటగాడితో సమానంగా ఆడుతుండడంతో, IPL 2025 అతని బ్రేక్అవుట్ సీజన్ కావచ్చనే అంచనాలున్నాయి. ఈ క్రీడాకారుడు అంతర్జాతీయ మ్యాచ్‌లలో కూడా అద్భుతంగా రాణిస్తుండగా, ఇంగ్లాండ్‌పై అతను సాధించిన 135 (54) స్కోర్, భారత T20I చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు. అభిషేక్ శర్మకు 25-34 ఏళ్ల వయస్సులో (57.8%) ఉన్న ప్రేక్షకుల సంఖ్య భారీగా ఉంది. అదే సమయంలో, 45-59 ఏళ్ల వయస్సులో ఉన్న ప్రేక్షకులలో ఈ యువ క్రికెటర్‌కు 2.5 శాతం అభిమానులు ఉండటం ఆసక్తికరం. అభిషేక్ శర్మకు తెలంగాణ (13.7%), మహారాష్ట్ర (12%), ఆంధ్రప్రదేశ్ (10.6%) నుండి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు.

ర్యాంకింగ్స్‌లో తర్వాతి స్థానంలో దాదాపు 4% స్వల్ప తేడాతో ముగ్గురు ఆటగాళ్ళు ఉన్నారు - జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా (ఇద్దరూ ముంబై ఇండియన్స్ నుండి), అలాగే యశస్వి జైస్వాల్ (రాజస్థాన్ రాయల్స్). 

జస్‌ప్రీత్ బుమ్రా కేవలం ఒక టాప్ బౌలర్ మాత్రమే కాదు, ఆధునిక క్రికెట్‌లో ఆటను నిర్వచించిన లివింగ్ లెజెండ్. అతని ఖచ్చితత్వం, అజేయమైన వ్యక్తిత్వం, కొన్ని బంతుల్లో మ్యాచ్ గమనాన్ని మార్చగల సామర్థ్యాల కారణంగా అభిమానులు అతన్ని విలువైన ఆటగాడిగా భావిస్తారు. అతని ట్రేడ్‌మార్క్ అయిన పాదం మీదకు వేసే యార్కర్లు, డెత్ ఓవర్లలో చూపే నైపుణ్యం అలాగే స్థిరత్వం అనేవి అతన్ని ఇండియాకు ప్రధాన బౌలింగ్ ఆయుధంగా చేస్తాయి. బుమ్రా 25-34 సంవత్సరాల వయస్సు గల వారి నుండి 63% ఓట్లను పొందగా, అతని అభిమానులు అత్యధికంగా కర్ణాటక (12%), మహారాష్ట్ర (11%), ఉత్తర ప్రదేశ్ (11%) మరియు పశ్చిమ బెంగాల్ (9.2%)లలో నివసిస్తున్నారు. 

ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను అతని నైపుణ్యం, బహుముఖ ప్రజ్ఞ కోసం ప్రతిస్పందకులు ఎంచుకున్నారు. అతను నిజంగా గేమ్-ఛేంజర్, అలాగే బ్యాటింగ్ ఇంకా బౌలింగ్ రెండింటిలోనూ జట్టును కాపాడగల సత్తా ఉన్నవాడు. 2025లో, అతను మళ్ళీ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా నిరూపించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. హార్దిక్ పాండ్యా 25-34 ఏళ్ళ గ్రూపులో దాదాపు 60% ఓట్లను పొందగా, ఉత్తర ప్రదేశ్ (14.5%), ఆంధ్రప్రదేశ్ (12.7%), పశ్చిమ బెంగాల్ (12.7%), మహారాష్ట్ర (10%) మరియు రాజస్థాన్ (10%) నుండి అతనికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. 

యశస్వి జైస్వాల్ క్రమశిక్షణ, ధృడమైన ఆట తీరు ఇంకా అనుకూలతను మిళితం చేసే నవతరం ఆటగాడు. అభిమానులు అతన్ని భారత జట్టుకు భవిష్యత్తు నాయకుడిగా చూస్తారు, అందుకే IPL 2025 అతడి కెరీర్‌లోో సరికొత్త పురోగతి సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. యశస్వి జైస్వాల్‌కు ఆంధ్రప్రదేశ్ (20%), తరువాత రాజస్థాన్ (15%) మరియు ఉత్తర ప్రదేశ్ (15%) నుండి భారీ అభిమానుల మద్దతు లభించింది. తార్కికంగా చూస్తే, ఈ యువ క్రికెటర్‌కు ప్రధాన ప్రేక్షకులు (52.7%) 25-34 ఏళ్ళ వయసు శ్రేణికి చెందినవారు. 

ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ కు మారిన రిషబ్ పంత్‌ దాదాపు 3 శాతం మద్దతుతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. దీనికి విరుద్ధంగా, లక్నో సూపర్ జెయింట్స్‌ జట్టుకు రెండేళ్ల పాటు కెప్టెన్ గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జర్సీని ధరించనున్నారు. కేఎల్ రాహుల్ కు 2.5% ఓట్లు వచ్చాయి. 

ఘోర ప్రమాదం తర్వాత, రిషబ్ పంత్ తిరిగి మైదానంలోకి రావడమే కాకుండా అగ్రస్థానానికి కూడా చేరుకున్నాడు. ఇటీవలి వేలంలో, అతను IPL చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ అతని కోసం ₹27.00 కోట్లు చెల్లించింది! ఇప్పుడు, కొత్త కెప్టెన్ ఈ సవాలును ఎలా ఎదుర్కొంటాడో చూడటానికి అభిమానులు సీజన్ ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పంత్‌కు పశ్చిమ బెంగాల్ ప్రాంతం నుండి అత్యధిక మద్దతు లభించింది (12%), ఇతనికి 25-34 ఏళ్ల వయస్సు గల (60%) గణనీయమైన ప్రేక్షకులు ఉన్నారు. 

కేఎల్ రాహుల్ ఒక ప్రత్యేకమైన శైలి కలిగిన టెక్నికల్ బ్యాట్స్‌మ్యాన్. అతను తన సొగసుగా ఉంటూనే, ప్రభావవంతంగా ఉండే షాట్లకు ప్రసిద్ధి చెందాడు. ఒత్తిడిలో కూడా అతను చూపే ప్రశాంతతను అభిమానులు ఆరాధిస్తారు, అలాగే అతను కొత్త జట్టులోకి మారడం వలన తన సామర్థ్యాన్ని మరింతగా చూపడానికి సహాయపడుతుందని నమ్ముతున్నారు, ఎందుకంటే అతనికి ఇప్పుడు తనను తాను వ్యక్తపరచుకోవడానికి ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. రాహుల్ 25-34 (43.5%), 20-24 (24%) వయస్సు వర్గాలలో ప్రజాదరణను పొందగా, ఇతర క్రీడాకారుల మాదిరిగా కాకుండా, 45-59 సంవత్సరాల వయస్సు గల ప్రేక్షకులలో అతనికి 4.4%తో అధిక వాటా ఉంది. 

ప్రతిస్పందకుల నుండి దాదాపు అదే స్థాయి మద్దతు పొందిన తదుపరి ఆటగాళ్ళుగా, 1xBet బ్రాండ్ అంబాసిడర్ హెన్రిచ్ క్లాసీన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), సూర్యకుమార్ యాదవ్ (ముంబై ఇండియన్స్) 2.4% ఓట్లతో ఉండగా, వీరికి సమీపంలో సంజు సామ్సన్ (రాజస్థాన్ రాయల్స్), శుభ్‌మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్) 2.3% ఓట్లతో నిలిచారు. 

ఈ నలుగురిలో, అంతర్జాతీయ క్రికెట్‌లో మెరిసిపోతున్న దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్‌ను హైలైట్ చేయడం సరైన విషయమని చెప్పుకోవాలి. IPLతో పాటు, విజయవంతమైన తన కెరీర్‌లో, ఈ క్రికెటర్ SA20 (డర్బన్స్ సూపర్ జెయింట్స్), కరీబియన్ ప్రీమియర్ లీగ్ (గయానా అమెజాన్ వారియర్స్) అలాగే మేజర్ లీగ్ క్రికెట్ (సియాటిల్ ఓర్కాస్) వంటి అనేక ప్రసిద్ధ లీగ్‌లలో ఆడగలిగాడు. దక్షిణాఫ్రికా జాతీయ జట్టులో భాగంగా, ఈ ప్లేయర్ 2024 పురుషుల T20 ప్రపంచ కప్‌లో భాగం అయ్యాడు. 

ప్రస్తుతం, హెన్రిచ్ క్లాసీన్ ఆధునిక క్రికెట్‌లో అత్యంత ప్రమాదకరమైన హిట్టర్లలో ఒకడిగా ఉన్నాడు. అతని శక్తివంతమైన షాట్‌లు కొన్ని నిమిషాల్లోనే మ్యాచ్ గతిని మార్చేయగలవు. అతను స్పిన్-బౌలింగ్‌లో మాస్టర్ కావడంతో, అతను స్పిన్నర్ షాట్లలో అత్యంత క్లిష్టమైన వైవిధ్యాలను సమర్థవంతంగా ఎదుర్కోగలడు. అదే సమయంలో, ఈ ఆటగాడు బాధ్యతకు భయపడకుండా తరచుగా నాయకత్వ లక్షణాలను, వివేకాన్ని ప్రదర్శిస్తూ జట్టును క్లిష్ట పరిస్థితుల నుండి బయటకు తీసుకువస్తున్నాడు. హెన్రిచ్ క్లాసీన్‌కు గల ఈ లక్షణాలను అభిమానులతో పాటు అంతర్జాతీయ బ్రాండ్ 1xBet కూడా అభినందిస్తోంది, అందుకే ఈ ఆటగాడిని కంపెనీ తన అంబాసిడర్‌గా చేసుకుంది.

IPL 2025లో అత్యధిక అభిమానుల మద్దతు ఉన్న టాప్ 5 జట్లు

తమ అభిమాన క్రికెట్ ఆటగాడితో పాటు, 1xBet పరిశోధనలో పాల్గొన్నవారు ప్రత్యేక ఉత్సాహాన్ని చూపి తాము అభిమానించే జట్లను పేర్కొన్నారు:
 
1.    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (28,5%)
2.    ముంబై ఇండియన్స్ (21,6%)
3.    చెన్నై సూపర్ కింగ్స్ (20,4%)
4.    సన్‌రైజర్స్ హైదరాబాద్ (10,3%)
5.    కోల్‌కతా నైట్ రైడర్స్ (6,4%)

ఆధునిక భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీని కలిగి ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 28.5% తో అగ్రస్థానంలో నిలిచింది. గత ఐదు IPL సీజన్‌లలో ఈ జట్టు నాలుగు సార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకోగా, ఈ సీజన్‌ చివరకు మొదటి టైటిల్‌ను ఖచ్చితంగా గెలుచుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. RCBకి భారీ అభిమానుల సంఖ్యతో పాటు, బలమైన స్వంత మద్దతు ఉంది. ఈ జట్టును నిజంగానే అభిమానులు ఆరాధిస్తారు, ఇందుకు కారణం ఇది లక్షలాది మంది అభిమానులకు మరపురాని భావోద్వేగాలను ఇస్తుంది. 

ఐదుసార్లు IPL విజేతలుగా నిలిచిన ముంబై ఇండియన్స్ 21.6% ఫలితంతో రెండవ స్థానంలో నిలిచింది. లెజెండరీ రోహిత్ శర్మతో సహా ఈ జట్టు నుండి నలుగురు ఆటగాళ్ళు అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెటర్ల ర్యాంకింగ్‌లో ఉన్నారు, అందుకే జట్టుకు అధిక ప్రజాదరణ ఉంటుందని ఎక్కువగా అంచనా వేయబడింది. బలమైన జట్టును, వ్యూహాన్ని, అలాగే అనేక మంది లెజెండరీ ఆటగాళ్లను కలిగి ఉన్న జట్టు యొక్క గొప్ప చరిత్రను అభిమానులు గమనిస్తూ ఉంటారు. వాళ్లు ఆరవ టైటిల్‌ను తమ అభిమాన జట్టు గెలుచుకుంటుందని నమ్మకంగా ఉన్నారు. 

టాప్ 3లో చెన్నై సూపర్ కింగ్స్ (20.4%) నిలవగా, ఈ జట్టులో మరొక లెజెండ్ ఎంఎస్ ధోనీ ఉన్నారు. గత నాలుగు IPL సీజన్‌లలో, ఈ జట్టు 2021 అలాగే 2023లో రెండుసార్లు విజేతగా నిలిచింది, ఇంకా ఈ సంవత్సరం IPLలో కూడా విజయం సాధించవచ్చనే అంచనాలున్నాయి. ఫలితాలలో స్థిరత్వం, విజయం సాధించే మనస్తత్వం ఇంకా యువ ఆటగాళ్ల అవకాశాలను అభిమానులు గమనిస్తూ ఉంటారు. అయితే, వారి ప్రజాదరణకు ప్రధాన కారణం ఎంఎస్ ధోనీ, అతని పట్ల గల అపారమైన ఆరాధన. ఇది అంకితభావం గల అభిమానులచే ఏర్పడింది. 

10.3%తో నాల్గవ స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉంది. గత ఏడాది, ఈ జట్టు తన మూడవ టైటిల్‌కు ఒక అడుగు దూరంలో నిలవగా, ఫైనల్‌లో కేవలం ఒక పాయింట్ మాత్రమే కోల్పోయింది. టాప్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్, జట్టులో యువతను, అనుభవాలను సమతుల్యం పాటించడం, బలమైన ఆటతీరను చూపడం, బాగా ఆలోచించే వ్యూహాలతో IPL 2025లో జట్టును విజయపథంలో నడిపిస్తాయని అభిమానులు విశ్వసిస్తున్నారు. 
 
ప్రస్తుత విజేతలైన కోల్‌కతా నైట్ రైడర్స్, టాప్ ఐదు ర్యాంకింగ్‌లలో చివరి స్థానంలో ఉన్నారు. వాళ్లకు బలమైన జట్టు ఉండగా, స్పష్టమైన వ్యూహం ఇంకా అద్భుతమైన అభిమానుల మద్దతు ఉంది. జట్టు యజమాని బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నైట్ రైడర్స్‌ ని ప్రాణప్రదంగా చూసుకుంటారు, ఇది మైదానంలోని ప్రేక్షకులలో, సోషల్ మీడియాలో అభిమానుల మద్దతు ద్వారా అనుభూతి చెందవచ్చు. 


IPLలో అత్యంత ఎదురుచూస్తున్న టాప్ 3 మ్యాచ్‌లు 

సర్వే ఫలితాల ప్రకారం, సీజన్ ప్రారంభం కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్న మ్యాచ్‌లను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మద్దతుదారులు చెబుతున్నారు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్, ముఖ్యంగా వారు ఫైనల్‌లో తలపడతారని, 27.5% మంది ప్రతిస్పందకులు భావిస్తున్నారు. ముంబై క్రికెట్ అభిమానులు కూడా మరీ ఎక్కువగా వెనుకబడలేదు, 20% వాటాతో రెండవ స్థానంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరాటం ఉండగా, అలాగే 6.87% వాటాతో మూడవ స్థానంలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ నిలిచింది. 

1xBet గురించి 

1xBet అనేది బెట్టింగ్ పరిశ్రమలో 18 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బుక్‌మేకర్. ఈ బ్రాండ్ కస్టమర్లు 70 భాషలలో అందుబాటులో ఉన్న కంపెనీ వెబ్‌సైట్ మరియు యాప్‌లలో వేలకొద్దీ క్రీడా ఈవెంట్‌లపై పందెం వేయవచ్చు. 1xBet అధికారిక భాగస్వామి జాబితాలో FC బార్సిలోనా, పారిస్ సెయింట్-జర్మైన్, LOSC Lille, LaLiga, Serie A, డర్బన్స్ సూపర్ జెయింట్స్, ఇతర ప్రఖ్యాత క్రీడా బ్రాండ్‌లు, సంస్థలు ఉన్నాయి. ఇండియాలా ఈ కంపెనీకి ప్రముఖ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లతో పాటు, హెన్రిచ్ క్లాసీన్, నటీమణి ఊర్వశి రౌతేలా రాయబారులుగా ఉన్నారు. ఈ కంపెనీ అనేకమార్లు IGA, SBC, G2E ఆసియా, EGR Nordics అవార్డుల వంటి ప్రతిష్టాత్మక ప్రొఫెషనల్ అవార్డులకు నామినీగాను, గ్రహీతగాను నిలిచింది.

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
క్రికెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఎం.ఎస్. ధోని
రోహిత్ శర్మ
శుభ్‌మన్ గిల్
విరాట్ కోహ్లీ
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved