- Home
- Sports
- Cricket
- IPL Auction 2022: ఆ విషయంలో ఆస్ట్రేలియా టాప్... జింబాబ్వే, నేపాల్, యూఎస్‌కే, స్కాట్లాండ్ నుంచి..
IPL Auction 2022: ఆ విషయంలో ఆస్ట్రేలియా టాప్... జింబాబ్వే, నేపాల్, యూఎస్‌కే, స్కాట్లాండ్ నుంచి..
ఐపీఎల్ వంటి మెగా క్రికెట్ లీగ్‌లో ఆడే అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తారు చాలా దేశాల క్రికెటర్లు. అసోసియేట్ దేశాల క్రికెటర్లకు ఐపీఎల్‌లో ఆడే అవకాశం వస్తే, అది నిజంగా చాలా పెద్ద అదృష్టమే. ఈసారి కూడా ఐపీఎల్ మెగా వేలంలో కొందరు అసోసియేట్ దేశాల క్రికెటర్లు పాల్గొనబోతున్నారు...

ఐపీఎల్ 2022 మెగా వేలం కోసం మొత్తంగా 1218 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేయించుకోగా, వీరిలో 590 మంది షార్ట్ లిస్ట్ చేశాయి ఫ్రాంఛైజీలు. ఇందులో 370 మంది భారత క్రికెటర్లు కాగా, 220 మంది విదేశీ ప్లేయర్లు...
ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో అత్యధికంగా ఆస్ట్రేలియా నుంచి 47 మంది ప్లేయర్లు పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత వెస్టిండీస్ నుంచి 34 మంది, సౌతాఫ్రికా నుంచి 33 మంది, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ దేశాల నుంచి 24 మంది ప్లేయర్లు వేలంలో పాల్గొనబోతున్నారు...
శ్రీలంక నుంచి 23 మంది, ఆఫ్ఘనిస్తాన్ నుంచి 17 మంది ప్లేయర్లు ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొనబోతుంటే బంగ్లాదేశ్ నుంచి ఐదుగురు క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు...
గత ఐపీఎల్‌లో పాల్గొన్న షకీబ్ అల్ హసన్, ముస్తాఫిజుర్ రహ్మాన్‌లతో పాటు తస్కిన్ అహ్మద్, లిటన్ దాస్, షార్టిఫుల్ ఇస్లాం... ఐపీఎల్ 2022 మెగా వేలంలో పాల్గొనబోతున్నారు...
నమీబియా నుంచి డేవిడ్ వీస్, రూబెన్ ట్రెంపెల్మన్, జేజే స్మిత్... ఐపీఎల్ 2022 వేలంలో షార్ట్ లిస్ట్ అయ్యారు. జింబాబ్వే నుంచి పేసర్ ముజర్బానీ ఒక్కడే... ఐపీఎల్ 2022 మెగా వేలంలో పాల్గొనబోతున్నాడు...
నేపాల్ కెప్టెన్ సందీప్ లామిచానే ఒక్కడికి ఐపీఎల్ 2022 మెగా వేలం షార్ట్ లిస్టులో చోటు దక్కగా స్కాట్లాండ్ నుంచి ఇద్దరు, యూఎస్‌కే నుంచి ఒక్కో ప్లేయర్ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు...
ఐపీఎల్‌లో బేస్ ప్రైజ్ రూ.2 కోట్లతో 48 ప్లేయర్లు వేలంలో పాల్గొనబోతుంటే, రూ.కోటిన్నర బేస్ ప్రైజ్‌తో 20 మంది, రూ.కోటి బేస్ ప్రైజ్‌తో 34 మంది ప్లేయర్లు మెగా వేలంలో పాల్గొనబోతున్నారు...