MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2026: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్య.. హార్దిక్ పాండ్యాను ఎందుకు తొలగించారు?

IPL 2026: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్య.. హార్దిక్ పాండ్యాను ఎందుకు తొలగించారు?

Mumbai Indians : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. లక్నోతో మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా దూరం పెట్టింది. సూర్యకుమార్‌కు కెప్టెన్సీని అప్పగించింది. అసలేం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 04 2026, 10:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్: అసలు ఏం జరిగింది?
Image Credit : ANI

ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్: అసలు ఏం జరిగింది?

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న 47వ మ్యాచ్‌లో పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. టాస్ వేయడానికి ముంబై ఇండియన్స్ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వస్తాడని అంతా భావించారు. కానీ, అందరినీ ఆశ్చర్యపరుస్తూ సూర్యకుమార్ యాదవ్ టాస్ కోసం మైదానంలోకి వచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా మరో చర్చ మొదలైంది. హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తొలగించారా? లేక చెత్త ఫామ్ వల్ల పక్కన పెట్టారా? అనే అనుమానాలు అభిమానులలో కలిగాయి. దీనిపై టాస్ సమయంలోనే సూర్య క్లారిటీ ఇచ్చాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
హార్దిక్ ఎందుకు లేడు? కారణం ఇదే
Image Credit : Getty

హార్దిక్ ఎందుకు లేడు? కారణం ఇదే

హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో ఎందుకు ఆడటం లేదనే విషయంపై సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. "హార్దిక్ ఈ రోజు అనారోగ్యంగా ఉన్నాడు. అందుకే అతని స్థానంలో నేను కెప్టెన్సీ చేస్తున్నాను" అని చెప్పాడు. అయితే, జట్టు వర్గాల సమాచారం ప్రకారం హార్దిక్ బ్యాక్ స్పామ్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది. మ్యాచ్ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందే ఈ సమస్య తలెత్తడంతో మేనేజ్మెంట్ అతనికి విశ్రాంతినిచ్చి, సూర్యకు బాధ్యతలు అప్పగించింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబైకి ఇది అత్యంత కీలకమైన మ్యాచ్ కావడం గమనార్హం.

Related Articles

Related image1
Mumbai Indians : హార్దిక్ పాండ్యా కథ క్లోజ్.. ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ గా తెలుగు కుర్రాడు
Related image2
Credit Card : క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసే ముందు ఈ సీక్రెట్స్ తెలుసుకోకపోతే భారీ నష్టమే!
35
రోహిత్ శర్మ రీఎంట్రీ.. అభిమానులు ఫుల్ జోష్
Image Credit : X

రోహిత్ శర్మ రీఎంట్రీ.. అభిమానులు ఫుల్ జోష్

హార్దిక్ లేని లోటును భర్తీ చేస్తూ, ముంబై అభిమానులకు ఒక బిగ్ గుడ్ న్యూస్ అందింది. గత నెల రోజులుగా గాయం కారణంగా ఆటకు దూరమైన 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌తో తిరిగి జట్టులోకి వచ్చాడు. రోహిత్ రాకతో వాంఖడే స్టేడియం హోరెత్తిపోయింది. అయితే, రోహిత్ నేరుగా ప్లేయింగ్ ఎలెవన్‌లో కాకుండా 'ఇంపాక్ట్ ప్లేయర్' జాబితాలో ఉన్నాడు. సూర్య టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో, సెకండ్ ఇన్నింగ్స్‌లో రోహిత్ బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు.

45
హార్దిక్ ఫామ్ పై విమర్శల వర్షం
Image Credit : ANI

హార్దిక్ ఫామ్ పై విమర్శల వర్షం

హార్దిక్ గాయం వల్ల తప్పుకున్నా, అతని ప్రస్తుత ఫామ్ పై మాజీ క్రికెటర్లు గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. మాజీ ఆటగాడు సదాగోపన్ రమేష్ మాట్లాడుతూ.. "హార్దిక్ ఒక కెప్టెన్‌గా ముందుండి నడపలేకపోతున్నాడు. కష్ట సమయాల్లో ఇతరులను ముందు పంపి తను వెనక దాక్కుంటున్నాడు" అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌ల్లో హార్దిక్ కేవలం 146 పరుగులు చేసి, 4 వికెట్లు మాత్రమే తీశాడు. అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్, బౌలింగ్ ఎకానమీ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం జట్టుకు పెద్ద మైనస్ అయింది.

55
ముంబై ఇండియన్స్ జట్టులో సంచలన మార్పులు
Image Credit : Getty

ముంబై ఇండియన్స్ జట్టులో సంచలన మార్పులు

హార్దిక్ అందుబాటులో లేకపోవడంతో ముంబై ఇండియన్స్ జట్టులో భారీ మార్పులే చేసింది. యువ ఆటగాడు రాజ్ అంగద్ బావాను తుది జట్టులోకి తీసుకున్నారు. అలాగే స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ స్థానంలో కోబిన్ బాష్ జట్టులోకి వచ్చాడు. ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఏకంగా 24 మంది ఆటగాళ్లను మార్చి రికార్డు సృష్టించింది. కేవలం రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ముంబైకి, లక్నోపై విజయం సాధించడం ఇప్పుడు తప్పనిసరిగా మారింది. సూర్య కెప్టెన్సీలో ముంబై మళ్లీ గెలుపు బాట పడుతుందో లేదో చూడాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vaibhav Sooryavanshi : ఐపీఎల్‌లో హిస్టరీ క్రియేట్ చేసిన 15 ఏళ్ల కుర్రాడు.. గేల్ రికార్డ్ ఇక అవుట్!
Recommended image2
IPL 2026: ఈ సీజన్ తర్వాత ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్స్ వీరే !
Recommended image3
IPL 2026 Playoff Race: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లొల్లి.. మూడు బెర్తులు కన్ఫర్మ్.. ఆ నాలుగో స్థానం ఎవరిది?
Related Stories
Recommended image1
Mumbai Indians : హార్దిక్ పాండ్యా కథ క్లోజ్.. ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ గా తెలుగు కుర్రాడు
Recommended image2
Credit Card : క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసే ముందు ఈ సీక్రెట్స్ తెలుసుకోకపోతే భారీ నష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved