MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Sports
  • Cricket
  • Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సిస్టర్‌పై దారుణమైన ట్రోలింగ్.. శ్రేష్ఠ ఘాటు రియాక్షన్.. ఏం జరిగిందంటే?

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సిస్టర్‌పై దారుణమైన ట్రోలింగ్.. శ్రేష్ఠ ఘాటు రియాక్షన్.. ఏం జరిగిందంటే?

Shreyas Iyer: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ ఉత్కంఠ వేళ క్రికెట్ అభిమానుల టాక్సిక్ కల్చర్ మరోసారి బద్ధలైంది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సిస్టర్ శ్రేష్ఠ అయ్యర్‌ను టార్గెట్ చేస్తూ నెటిజన్లు దారుణమైన ట్రోలింగ్‌కు దిగారు. అసలు ఏం జరిగింది? 

3 Min read
Author : Mahesh Rajamoni
Published : May 26 2026, 08:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐపీఎల్ క్రేజ్.. హద్దులు దాటిన టాక్సిక్ ఫ్యాన్ కల్చర్
Image Credit : Instagram/shrestaiyer29 + ANI

ఐపీఎల్ క్రేజ్.. హద్దులు దాటిన టాక్సిక్ ఫ్యాన్ కల్చర్

మన దేశంలో క్రికెట్ అంటే ఒక ఎమోషన్, ఐపీఎల్ అంటే ఒక పండగ. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది నెటిజన్లు, క్రికెట్ లవర్స్ చూపిస్తున్న అతి సోషల్ మీడియాలో హద్దులు దాటుతోంది. గెలిస్తే ఆకాశానికి ఎత్తేయడం, ఓడిపోతే ప్లేయర్ల ఫ్యామిలీ మెంబర్స్‌ని టార్గెట్ చేయడం ఒక దారుణమైన ట్రెండ్‌గా మారిపోయింది.

ఐపీఎల్ 2026 లీగ్ స్టేజ్ ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ (PBKS) కేవలం ఒక్కటంటే ఒక్క పాయింట్ తేడాతో ప్లేఆఫ్స్ రేస్ నుండి తృటిలో తప్పుకుంది. ఈ ఓటమి తెచ్చిన ఫ్రస్ట్రేషన్‌ను కొంతమంది సోకాల్డ్ క్రికెట్ లవర్స్.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సిస్టర్ శ్రేష్ఠ అయ్యర్‌పై చూపించడం మొదలుపెట్టారు. ఆమెను టార్గెట్ చేస్తూ దారుణమైన ట్రోలింగ్, పర్సనల్ అటాక్స్‌కు దిగారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆ ఒక్క రీల్ ఇంత రచ్చకు కారణమా?
Image Credit : ANI

ఆ ఒక్క రీల్ ఇంత రచ్చకు కారణమా?

అసలు ఈ రచ్చ అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే.. ఐపీఎల్ 2026 ఫస్ట్ హాఫ్‌లో పంజాబ్ కింగ్స్ దుమ్ము రేపింది. ఆడిన మొదటి ఏడు మ్యాచ్‌ల్లో ఆరు మ్యాచ్‌లు గెలిచి టేబుల్ టాప్‌లో దూసుకుపోయింది. ఆ టైమ్‌లోనే కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన ఒక మ్యాచ్ వర్షం వల్ల పూర్తిగా రద్దయింది. రూల్స్ ప్రకారం ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు.

ఆ సంతోషంలో శ్రేష్ఠ అయ్యర్ పంజాబ్ కింగ్స్ జెర్సీ వేసుకుని ఒక ఫన్నీ ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేసింది. "మేం పంజాబీలం, మా మనసు చాలా పెద్దది.. అందుకే కేకేఆర్‌కు ఒక పాయింట్ గిఫ్ట్ ఇచ్చాం" అంటూ సరదాగా ఒక వీడియో పోస్ట్ చేసింది. 

అప్పట్లో కేకేఆర్ అభిమానులు సీరియస్ అవ్వడంతో ఆ వీడియోను డిలీట్ కూడా చేసింది. కానీ సీన్ కట్ చేస్తే.. సెకండ్ హాఫ్‌లో పంజాబ్ టీమ్ వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడిపోయి, సరిగ్గా అదే ఒక్క పాయింట్ తేడాతో ప్లేఆఫ్స్ రేస్ నుండి అవుట్ అయిపోయింది. ఇక అంతే.. నెటిజన్లు ఆ పాత వీడియోను మళ్లీ బయటకు తీసి, శ్రేష్ఠను ఘోరంగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.

Related Articles

Related image1
IPL 2026 Eliminator: నో రిజర్వ్ డే.. ఎలిమినేటర్ మ్యాచ్ వర్షంతో రద్దయితే SRH పరిస్థితి ఏంటి?
Related image2
IPL 2026 Qualifier 1: రూ. 46.25 కోట్ల బౌలింగ్ వార్.. ధర్మశాలలో కోహ్లీ vs గిల్.. ఫైనల్ చేరేది ఆ జట్టేనా?
35
ఆఫీస్‌కు ఫోన్లు.. నెటిజన్ల ఓవర్ యాక్షన్
Image Credit : ANI

ఆఫీస్‌కు ఫోన్లు.. నెటిజన్ల ఓవర్ యాక్షన్

ఈ ట్రోలింగ్ కేవలం సోషల్ మీడియా కామెంట్లు, మీమ్స్‌తో ఆగిపోలేదు. ఇన్స్‌స్టాగ్రామ్ దాటి ఆమె పర్సనల్ లైఫ్‌ను, ప్రొఫెషన్‌ను డిస్టర్బ్ చేసే వరకు వెళ్ళింది. కొందరు సైకో నెటిజన్లు ఏకంగా శ్రేష్ఠ పని చేసే ఆఫీస్‌కు ఫోన్ నెంబర్లు పట్టుకుని మరీ కాల్స్ చేయడం స్టార్ట్ చేశారు.

ఆఫీస్ స్టాఫ్‌ను, అక్కడ చదువుకునే స్టూడెంట్స్‌ను, ఆమె ఫ్యామిలీని ఏ టైమ్ పడితే ఆ టైమ్‌లో ఫోన్లు చేసి అసభ్య పదజాలంతో తిడుతూ వేధించడం మొదలుపెట్టారు. ఒక చిన్న సరదా వీడియోకు ఇంతలా పర్సనల్ వేధింపులకు దిగడం టోటల్ క్రికెట్ అభిమానులకు ఒక మచ్చలా మారింది.

45
మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది బ్రో: శ్రేష్ఠ అయ్యర్ ఫైర్
Image Credit : ANI

మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది బ్రో: శ్రేష్ఠ అయ్యర్ ఫైర్

ఈ దారుణమైన వేధింపులపై శ్రేష్ఠ అయ్యర్ అస్సలు తగ్గలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు భాగాల వీడియోను రిలీజ్ చేస్తూ ట్రోలర్ల తాట తీసింది. "మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తోంది. నాపై కోపం ఉంటే నన్ను తిట్టండి, నా అకౌంట్లో కామెంట్ చేయండి. అంతేగానీ నేను పని చేసే ఆఫీస్‌కు ఫోన్లు చేసి, నా కొలీగ్స్‌ని, నా స్టూడెంట్స్‌ని, నా ఫ్యామిలీని తిడుతూ వేధించడం ఏంటి? ఆపండి ఈ సైకోయిజం!" అంటూ ఘాటుగా స్పందించింది.

అలాగే, "నేను చేసిన రీల్ కేవలం ఫన్ కోసం చేసింది మాత్రమే. నా వెనుక ఎలాంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవు. నా తమ్ముడు కూడా ఒక ప్రొఫెషనల్ క్రికెటరే, కాబట్టి నాకు ప్రతి ప్లేయర్ అంటే రెస్పెక్ట్ ఉంది. నా తమ్ముడు గెలిచినా, ఓడినా నేను ఎప్పుడూ అతడికి సపోర్ట్‌గా నిలబడతా" అని బోల్డ్‌గా ఆన్సర్ ఇచ్చింది.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shresta Iyer (@shrestaiyer29)

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shresta Iyer (@shrestaiyer29)

55
ఆకలి, కసితో నెక్స్ట్ చాప్టర్: శ్రేయస్ అయ్యర్
Image Credit : Instagram@realpz

ఆకలి, కసితో నెక్స్ట్ చాప్టర్: శ్రేయస్ అయ్యర్

ఒకవైపు సోదరిపై ఈ రేంజ్ ట్రోలింగ్ జరుగుతుంటే, మరోవైపు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఈ సీజన్ ముగింపుపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. గతేడాది రూ. 26.75 కోట్ల భారీ ధరకు పంజాబ్ టీమ్ అతన్ని కొనుగోలు చేయగా, ఈ సీజన్లో బ్యాటర్‌గా 498 పరుగులు (లక్నోపై ఒక సెంచరీతో సహా) చేసి కెప్టెన్‌గా తన బెస్ట్ ఇచ్చాడు.

ఈ సీజన్ జర్నీని గుర్తు చేసుకుంటూ.. "ప్రతీ పరుగు.. ప్రతీ క్షణం.. ప్రతీ పోరాటం. ఈ అధ్యాయం కృతజ్ఞతతో ముగిసింది. మరింత ఆకలి, కసితో తదుపరి అధ్యాయం 2027లో మొదలవుతుంది" అంటూ లౌడ్‌ అండ్ క్లియర్‌గా హింట్ ఇచ్చాడు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shreyas Iyer (@shreyasiyer96)

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
AUS vs BAN : రెండు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ఖతం.. బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా రివెంజ్ విజయం
Recommended image2
IND vs SL : కొలంబో టెస్టులో గెలిస్తేనే అసలైన మజా ! ఇరు జట్లలో ఊహించని మార్పులు
Recommended image3
WTC: టీమిండియా ముందు 8 టెస్టులు.. ఫైనల్ చేరాలంటే ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?
Related Stories
Recommended image1
IPL 2026 Eliminator: నో రిజర్వ్ డే.. ఎలిమినేటర్ మ్యాచ్ వర్షంతో రద్దయితే SRH పరిస్థితి ఏంటి?
Recommended image2
IPL 2026 Qualifier 1: రూ. 46.25 కోట్ల బౌలింగ్ వార్.. ధర్మశాలలో కోహ్లీ vs గిల్.. ఫైనల్ చేరేది ఆ జట్టేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved