MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2026 Qualifier 1: రూ. 46.25 కోట్ల బౌలింగ్ వార్.. ధర్మశాలలో కోహ్లీ vs గిల్.. ఫైనల్ చేరేది ఆ జట్టేనా?

IPL 2026 Qualifier 1: రూ. 46.25 కోట్ల బౌలింగ్ వార్.. ధర్మశాలలో కోహ్లీ vs గిల్.. ఫైనల్ చేరేది ఆ జట్టేనా?

IPL 2026 Qualifier 1: ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 1లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ధర్మశాల పిచ్‌పై బ్యాటర్లు మాత్రమే కాదు.. రూ. 46.25 కోట్ల బౌలర్ల మధ్య అసలైన యుద్ధం జరగనుంది. మరి గెలిచేది ఎవరు? 

3 Min read
Author : Mahesh Rajamoni
Published : May 26 2026, 06:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 1: ధర్మశాలలో ఆర్‌సీబీ vs గుజరాత్ క్రేజీ ఫైట్
Image Credit : IPL MEDIA

ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 1: ధర్మశాలలో ఆర్‌సీబీ vs గుజరాత్ క్రేజీ ఫైట్

ఐపీఎల్ 2026 ఫైనల్ రేసుకు టైమ్ వచ్చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి ఫైనల్ చేరాలంటే గుజరాత్ టైటాన్స్ (GT) దాటాలి. లీగ్ స్టేజ్‌లో మోస్ట్ కన్సిస్టెంట్ ప్రదర్శన ఇచ్చిన ఈ రెండు టాప్ టీమ్స్.. మంగళవారం ధర్మశాలలోని అందమైన హెచ్‌పీసీఏ స్టేడియంలో జరిగే క్వాలిఫైయర్ 1 పోరులో తలపడుతున్నాయి.

ఈ సీజన్‌లో ఇక్కడ జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 200 ప్లస్ స్కోర్లు సాధించాయి. పైగా రెండు సార్లు ఆ భారీ స్కోర్లు ఈజీగా ఛేజ్ అయ్యాయి కూడా. ఈ రెండు టీమ్స్‌లోనూ మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించే బ్యాటర్లు ఉన్నప్పటికీ, ఇక్కడ మ్యాచ్ ఫలితాన్ని తేల్చేది మాత్రం బౌలర్లే అని చెప్పాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పవర్‌ప్లే కొట్టిన వాళ్లదే మ్యాచ్.. సైమన్ డౌల్ ఏమన్నారంటే?
Image Credit : ANI

పవర్‌ప్లే కొట్టిన వాళ్లదే మ్యాచ్.. సైమన్ డౌల్ ఏమన్నారంటే?

ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ గురించి న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో పవర్‌ప్లేని ఎవరు రూల్ చేస్తే వాళ్లదే మ్యాచ్ అని అన్నారు. 

“జీటీ, ఆర్‌సీబీ రెండు టీమ్స్ లోనూ సాలిడ్ బ్యాటింగ్ లైనప్, క్వాలిటీ బౌలింగ్ అటాక్ ఉన్నాయి. మ్యాచ్ మాత్రం నెక్ టు నెక్ సాగడం ఖాయం. రెండు టీమ్స్ సూపర్ ఫామ్‌లో ఉన్నాయి. విన్నింగ్ మొమెంటంతో ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టాయి. ఒక ఓవర్ లో మ్యాచ్ టర్న్ చేసే విన్నర్స్ ఇరు జట్లలోనూ ఉన్నారు. ఒకవైపు విరాట్ కోహ్లీ, మరోవైపు శుభ్‌మన్ గిల్.. ఇద్దరూ రెడ్ హాట్ ఫామ్‌లో ఉన్నారు. ఓపెనర్లు గనుక ఫస్ట్ 6 ఓవర్లలో వికెట్లు పడకుండా చూసుకుంటూ 60 నుంచి 70 రన్స్ బోర్డుపై పెడితే, అపోజిషన్ టీమ్ వెంటనే ప్రెజర్‌లోకి వెళ్తుంది. ఇలాంటి బిగ్ గేమ్స్‌లో స్టార్టింగ్ మొమెంటం చాలా ముఖ్యం" అని డౌల్ అన్నారు.

36
రూ. 46.25 కోట్ల బౌలింగ్ బ్యాటిల్.. నువ్వా నేనా !
Image Credit : ANI

రూ. 46.25 కోట్ల బౌలింగ్ బ్యాటిల్.. నువ్వా నేనా !

ఈ మ్యాచ్‌లో అసలైన ట్విస్ట్ ఏంటంటే.. ఇరు జట్లలోని నలుగురు కీ బౌలర్ల ఐపీఎల్ వేలం ధర అక్షరాలా రూ. 46.25 కోట్లు. ఆర్‌సీబీ దగ్గర జోష్ హేజిల్‌వుడ్ (రూ. 12.50 కోట్లు), భువనేశ్వర్ కుమార్ (రూ. 10.75 కోట్లు) ఉంటే.. గుజరాత్ టైటాన్స్ టీమ్‌లో కాగిసో రబడా (రూ. 10.75 కోట్లు), మహ్మద్ సిరాజ్ (రూ. 12.25 కోట్లు) ఉన్నారు. ప్రస్తుతం భువనేశ్వర్, రబడా ఇద్దరూ చెరో 24 వికెట్లతో ఈ సీజన్ జాయింట్ హైయెస్ట్ వికెట్ టేకర్స్‌గా టాప్‌లో దూసుకుపోతున్నారు.

సిరాజ్ కూడా 17 వికెట్లతో 8వ ప్లేస్‌లో ఉన్నాడు. హేజిల్‌వుడ్ టాప్ 20లో లేకపోయినా, ఎప్పుడైనా ఒంటిచేత్తో వికెట్ల పండగ చేసుకోగలడు. వీళ్లే కాకుండా ఆర్‌సీబీకి చెందిన రసిఖ్ దార్ (14 వికెట్లు), జీటీకి చెందిన జేసన్ హోల్డర్ (13 వికెట్లు) కూడా స్టార్ బ్యాటింగ్ లైన్అప్‌ను దెబ్బతీయడానికి రెడీగా ఉన్నారు.

46
ధర్మశాల పిచ్ రిపోర్ట్.. గుజరాత్‌కే ఎడ్జ్ ఉందన్న ఇర్ఫాన్ పఠాన్
Image Credit : ANI

ధర్మశాల పిచ్ రిపోర్ట్.. గుజరాత్‌కే ఎడ్జ్ ఉందన్న ఇర్ఫాన్ పఠాన్

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కే గెలిచే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశారు. ధర్మశాల కండిషన్స్, గుజరాత్ పేస్ అటాక్ బలాన్ని చూస్తుంటే వాళ్లకే ఎడ్జ్ కనిపిస్తోందని అన్నారు.

"ధర్మశాల పిచ్ ఫాస్ట్ బౌలర్లకు బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ మంచి స్వింగ్, బౌన్స్ లభిస్తాయి. గుజరాత్ పేస్ అటాక్‌లో క్వాలిటీ, కన్సిస్టెన్సీ ఉన్నాయి కాబట్టి వాళ్లకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. అహ్మదాబాద్‌లోని ఫ్లాట్ ట్రాక్‌లపైనే వాళ్ల పేసర్లు అదరగొట్టారు. ఇక ఇక్కడ బాల్ మూవ్ అవుతూ, బౌన్స్ అవుతుంటే వాళ్లు మరింత డేంజరస్‌గా మారుతారు. కండిషన్స్‌కు ఎవరు త్వరగా అడాప్ట్ అవుతారనేది ఇంపార్టెంట్. కానీ, బౌలింగ్ బలాన్ని బట్టి చూస్తే గుజరాత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది" అని జియోహాట్‌స్టార్ చర్చలో పఠాన్ చెప్పారు.

56
కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అదరగొడుతున్న గిల్
Image Credit : ANI

కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అదరగొడుతున్న గిల్

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సీజన్‌లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా గిల్ మెచ్యూరిటీ లెవెల్స్ వేరే లెవెల్‌లో ఉన్నాయన్నారు. "గిల్ ఈ సీజన్‌లో చాలా అద్భుతంగా కెప్టెన్సీ చేశాడు. బ్యాటింగ్‌లోనూ గ్రోత్ కనిపించింది. ఆర్‌సీబీ లాంటి టీమ్‌ను ఫేస్ చేసే ఛాలెంజ్‌ను అతడు కచ్చితంగా ఎంజాయ్ చేస్తాడు. పేస్ బౌలింగ్‌కు ఎగైనెస్ట్‌గా గిల్ ఆఫ్ సైడ్ ప్లే టాప్ క్లాస్‌గా ఉంటుంది. క్రీజు వెలుపలికి వచ్చి, పొజిషన్ తీసుకుని షాట్లు కొడతాడు. సెట్ అయ్యాడంటే అటాకింగ్ మోడ్‌లోకి వెళ్తాడు. స్పిన్‌కు ఎగైనెస్ట్‌గా స్లాగ్ స్వీప్స్‌తో భారీ షాట్లు ఆడగలడు" అని పఠాన్ అన్నారు.

66
వరల్డ్ కప్ సెలక్షన్ కసి.. గిల్‌కు కలిసొచ్చే పిచ్
Image Credit : ANI

వరల్డ్ కప్ సెలక్షన్ కసి.. గిల్‌కు కలిసొచ్చే పిచ్

టీ20 వరల్డ్ కప్ 2026 కోసం ఇండియన్ టీమ్‌లో ప్లేస్ కోల్పోయిన గిల్, ఈ ఐపీఎల్‌లోకి ఒక కసితో అడుగుపెట్టాడని పఠాన్ గుర్తు చేశారు. నేషనల్ టీమ్‌లోకి మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వడమే టార్గెట్‌గా గిల్ ఆడుతున్నాడని అన్నారు. "తన స్ట్రైక్ రేట్ పెంచుకోవాలనే క్లియర్ గోల్‌తో గిల్ ఈ సీజన్ ఆడుతున్నాడు. టీమిండియాలో చోటు కోల్పోయాడు కాబట్టి మళ్లీ ఆ ప్లేస్ సాధించాలనే పట్టుదల అతని మైండ్‌లో రన్ అవుతోంది. గుజరాత్‌కు ఐపీఎల్ ట్రోఫీ అందించడం కూడా అతని బిగ్ టార్గెట్. క్వాలిఫైయర్ 1లో ఆర్‌సీబీతో మ్యాచ్‌ను గిల్ బాగా ఎంజాయ్ చేస్తాడు. ధర్మశాల పిచ్ అతని బ్యాటింగ్ స్టైల్‌కు పక్కాగా సూట్ అవుతుంది" అని ఇర్ఫాన్ పఠాన్ అన్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
Recommended image2
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image3
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Related Stories
Recommended image1
Hardik Pandya: సీఎస్‌కే లోకి హార్దిక్ పాండ్యా? ఐపీఎల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ట్రేడింగ్‌కు స్కెచ్ !
Recommended image2
Ram Charan: బుమ్రాకు క్షమాపణలు చెప్పిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved