- Home
- Sports
- Cricket
- IPL : టీ20 క్రికెట్‌లో 600 సిక్సర్లు.. ఇదెక్కడి బాదుడు సామి ! డేంజరస్ బ్యాట్స్‌మన్ !
IPL : టీ20 క్రికెట్‌లో 600 సిక్సర్లు.. ఇదెక్కడి బాదుడు సామి ! డేంజరస్ బ్యాట్స్‌మన్ !
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో పరుగుల సునామీ మొదలైంది. సిక్సర్ల వర్షం కురుస్తోంది. బౌలర్లను బ్యాటర్లు దంచికొడుతూ రికార్డుల మోత మోగిస్తున్నారు. అలాంటి గొప్ప సిక్సర్ల రికార్డులు సాధించిన ఐపీఎల్ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

Rohit Sharma. (Photo- IPL)
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) కి మంచి ఆరంభం లభించలేదు. భారీ స్కోర్ సాధించినప్పటికీ తొలి మ్యాచ్‌లోనే ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) చేతిలో ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. మెగా వేలంలో లక్నో టీమ్ రిషబ్ పంత్‌ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది.
ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ప్లేయర్ గా ఉన్న రిషబ్ పంత్ తో లక్నో టీమ్ మొదటి మ్యాచ్ కు ఎలాంటి ప్రయోజనమూ కలగలేదు. ఈ మ్యాచ్ లో 6 బంతులు ఆడిన రిషబ్ పంత్ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ కు చేరాడు. అలాగే, కీలకమైన సమయంలో మోహిత్ శర్మ స్టంపింగ్‌ను మిస్ అయ్యాడు. దీంతో లక్నో టీమ్ కు ఓటమి తప్పలేదు.
ఇదే కొట్టుడు సామి.. స్టేడియం దద్దరిల్లిపోయింది !
ఈ మ్యాచ్‌లో లక్నో స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 30 బంతుల్లో 75 పరుగులతో ఢిల్లీ బౌలింగ్ ను దంచికొట్టాడు. నికోలస్ పురాన్ సునామీ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. అతనికి తోడుగా మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 72 పరుగుల దుమ్మేరేపే ఇన్నింగ్స్ తో లక్నో టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 209 పరుగులు చేసింది. అయితే, భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ టీమ్ కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి.
కానీ, ఎప్పుడైతే అశుతోష్ శర్మ, విప్రజ్ క్రీజులోకి వచ్చారో అప్పుడే మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. లక్నో టీమ్ గెలుపు సంబరాలు చేసుకుంటుంది అనుకునే లోపే అశుతోష్ శర్మ 31 బంతుల్లో 66 అజేయ పరుగులు, విప్రజ్ నిగమ్ 15 బంతుల్లో 39 పరుగులు పవర్ ఫుల్ హిట్టింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో 9 వికెట్లకు 211 పరుగులతో మ్యాచ్ ను గెలుచుకుంది.
Image Credit: Twitter/Lucknow Super Giants
మరో రికార్డు సాధించిన నికోలస్ పూరన్
ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ స్టార్ నికోలస్ పురాన్ 7 సిక్సర్లు బాది మరో మైలురాయిని అందుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 600 సిక్సర్లు పూర్తి చేసిన నాల్గవ బ్యాట్స్‌మన్ గా ఘనత సాధించాడు. టీ20 క్రికెట్ లో 600లకు పైగా సిక్సర్లు బాదిన ప్లేయర్ల లిస్టులో పురాన్ కంటే ముందు క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్ లు చేరారు.
టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ 10 ప్లేయర్లు:
క్రిస్ గేల్ (వెస్టిండీస్)- 463 మ్యాచ్‌లు- 1056 సిక్సర్లు
కీరాన్ పొలార్డ్ (వెస్టిండీస్)- 695 మ్యాచ్‌లు- 908 సిక్సర్లు
ఆండ్రీ రస్సెల్ (వెస్టిండీస్)- 539 మ్యాచ్‌లు- 733 సిక్సర్లు
నికోలస్ పూరన్ (వెస్టిండీస్)- 385 మ్యాచ్‌లు- 606 సిక్సర్లు
అలెక్స్ హేల్స్ (ఇంగ్లాండ్)- 494 మ్యాచ్‌లు- 552 సిక్సర్లు
కాలిన్ మున్రో (న్యూజిలాండ్)- 434 మ్యాచ్‌లు- 550 సిక్సర్లు
గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా)- 459 మ్యాచ్‌లు- 529 సిక్సర్లు
రోహిత్ శర్మ (భారతదేశం)- 449 మ్యాచ్‌లు- 525 సిక్సర్లు
జోస్ బట్లర్ (ఇంగ్లాండ్)- 434 మ్యాచ్‌లు- 515 సిక్సర్లు
డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా)- 520 మ్యాచ్‌లు- 504 సిక్సర్లు