IPL 2025: కొత్త జెర్సీతో ఆర్సీబీ.. కెప్టెన్ పై కోహ్లీ కామెంట్స్ వైరల్ !
IPL 2025 RCB: ఐపీఎల్ 2025 ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త జెర్సీని ఆవిష్కరించింది.

IPL 2025 RCB New Jersey Unveiled Virat Kohli Praises Rajat Patidar in telugu
IPL 2025 RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌ను కొత్త కెప్టెన్ నేతృత్వంలో ప్రారంభించనుంది. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి వెళ్లిన ఫాఫ్ డు ప్లెసిస్ నుండి రజత్ పాటిదార్ కు ఆర్సీబీ కెప్టెన్సీ అప్పగించింది. మొత్తంగా ఐపీఎల్ లో రజత్ పాటిదార్ RCBకి 8వ కెప్టెన్.
2021లో రజత్ బెంగళూరు ఫ్రాంచైజీలో చేరినప్పటి నుండి మూడు సీజన్లు ఆడాడు. ఇండోర్‌లో జన్మించిన 31 ఏళ్ల బ్యాటర్ లువ్నిత్ సిసోడియా స్థానంలో 2022 సీజన్ మధ్యలో RCBలోకి తిరిగి వచ్చాడు. అతను 2021లో కేవలం నాలుగు మ్యాచ్ లను మాత్రమే ఆడాడు.
IPL 2025 RCB New Jersey Unveiled Virat Kohli Praises Rajat Patidar in telugu
ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలానికి ముందు ఆర్సీబీ రజత్ పటీదార్, యష్ దయాళ్, విరాట్ కోహ్లీలను రిటైన్ చేసుకుది. IPL 2025లో RCB తన తొలి మ్యాచ్‌ను మార్చి 22న ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ ( KKR ) తో ఆడనుంది. ఈ సీజన్‌లో ఇది తొలి మ్యాచ్ అవుతుంది. RCB తన తొలి హోమ్ మ్యాచ్‌ను ఏప్రిల్ 2న గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది.
ఇప్పటికే ఆర్సీబీ జట్టు ఆటగాళ్లందరూ సాయంత్రం 4 గంటలకు ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆ తర్వాత మ్యూజిక్ ప్రోగ్రాం జరిగింది.
IPL 2025 RCB New Jersey Unveiled Virat Kohli Praises Rajat Patidar in telugu
ప్రముఖ గాయకులు అలోక్, సంజిత్ హెగ్డే, ఐశ్వర్య రంగరాజన్, హనుమాన్‌కింద్ సహా పలువురు సంగీత ప్రదర్శనలు ఇచ్చారు.
ప్రోగ్రాం మొత్తం పునీత్ రాజ్‌కుమార్ పాటలు, ఫోటోలతో స్టేడియం మార్మోగిపోయింది.
IPL 2025 RCB New Jersey Unveiled Virat Kohli Praises Rajat Patidar in telugu
కార్యక్రమం అంతటా, పునీత్ రాజ్ కుమార్ చిత్రాలు, పాటలు స్టేడియంలో ప్రతిధ్వనించాయి. నృత్యకారులు కన్నడ జెండాను పట్టుకుని, కన్నడ పాటలు పాడుతూ అభిమానులను అలరించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు గుమిగూడి RCB...RCB అని అరుస్తూ తమ అభిమాన జట్టును ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. 'రాజత్ పటిదార్ ఆర్సీబీకి లాంగ్ టర్మ్ లీడర్' అని అన్నాడు.
IPL 2025 RCB New Jersey Unveiled Virat Kohli Praises Rajat Patidar in telugu
ఆర్సీబీని నడిపించడానికి రజత్‌కు పెద్ద బాధ్యత ఉందనీ, ఛాంపియన్‌గా ఉండటానికి అతనికి అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు.
రాజత్ కూడా ఈ సందర్భంగా మాట్లాడాడు. కోహ్లీ, డివిలియర్స్ లాంటి లెజెండ్స్ ఆర్సీబీకి ఆడారని అన్నాడు. ఇప్పుడు అదే జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.