MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2025: ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమి.. హార్దిక్ కు షాకిచ్చిన గిల్ సేన !

IPL 2025: ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమి.. హార్దిక్ కు షాకిచ్చిన గిల్ సేన !

IPL 2025 GT vs MI: బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతూ శుభ్ మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్ కు షాకిస్తూ ఐపీఎల్ 2025లో తొలి విజయాన్ని అందుకుంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 29 2025, 11:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
IPL 2025: Mumbai Indians suffer second consecutive defeat.. Shubman Gill shocks Hardik Pandya

IPL 2025: Mumbai Indians suffer second consecutive defeat.. Shubman Gill shocks Hardik Pandya

IPL 2025 GT vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమిని ఎదుర్కొంది. ఐపీఎల్ 2025 9వ మ్యాచ్ లో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్ తలపడ్డాయి.

ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్‌కు మంచి ఆరంభం లభించలేదు. ఎందుకంటే ఆ టీమ్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసింది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత, ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ చేతిలో కూడా ఓడిపోయింది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ జట్టు హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై జట్టును 36 పరుగుల తేడాతో ఓడించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
IPL 2025: Mumbai Indians suffer second consecutive defeat.. Shubman Gill shocks Hardik Pandya

IPL 2025: Mumbai Indians suffer second consecutive defeat.. Shubman Gill shocks Hardik Pandya

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ముంబైపై గుజరాత్ కు ఇది వరుసగా రెండో విజయం. గత సంవత్సరం కూడా ఇదే మైదానంలో హార్దిక్ జట్టును 6 పరుగుల తేడాతో ఓడించింది. అహ్మదాబాద్‌లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇది వీరిద్దరి మధ్య జరిగిన నాల్గవ మ్యాచ్ కాగా, గుజరాత్ అన్ని మ్యాచ్‌లలో గెలిచింది.

34
IPL 2025: Mumbai Indians suffer second consecutive defeat.. Shubman Gill shocks Hardik Pandya

IPL 2025: Mumbai Indians suffer second consecutive defeat.. Shubman Gill shocks Hardik Pandya

సాయి సుదర్శన్ అర్ధ సెంచరీతో గుజరాత్ టైటాన్స్ మంచి స్కోర్ చేసింది. సుదర్శన్ 41 బంతుల్లో 63 పరుగుల తన ఇన్నింగ్స్ లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. అతనితో పాటు కెప్టెన్ శుభమాన్ గిల్ 38 పరుగులు చేశాడు. జోస్ బట్లర్ 39 పరుగుల వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై తరఫున హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహమాన్, సత్యనారాయణ రాజు ఒక్కొక్కరు ఒక్కో వికెట్ తీసుకున్నారు.

44
IPL 2025: Mumbai Indians suffer second consecutive defeat.. Shubman Gill shocks Hardik Pandya

IPL 2025: Mumbai Indians suffer second consecutive defeat.. Shubman Gill shocks Hardik Pandya

భారీ టార్గెట్ చేధించే క్రమంలో ముంబై జట్టుకు ఎక్కడా కూడా మంచి టర్న్ లభించలేదు. ఆరంభంలోనే రోహిత్ వికెట్ ను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు కోల్పోయింది. రన్ రేటు పెరుగుతుండటంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది.

తిలక్ వర్మ 39 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 48 పరుగుల ఇన్నింగ్స్ లతో ముంబై ఇండియన్స్ 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేసింది. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 2, ప్రసిద్ధ్ క్రిష్ణ 2 వికెట్లు తీసుకున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Recommended image2
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image3
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved