- Home
- Sports
- Cricket
- Abhishek Sharma : పవర్ హిట్టింగ్ కాదు... అభిషేక్ లో ఆ టాలెంట్ అద్భుతం : కేన్ విలియమ్సన్
Abhishek Sharma : పవర్ హిట్టింగ్ కాదు... అభిషేక్ లో ఆ టాలెంట్ అద్భుతం : కేన్ విలియమ్సన్
Indian Premier League 2025 : సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ గురించి ఆ టీం మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అతడి పవర్ హిట్టింగ్ కాదు మరో టాలెంట్ వల్లే రాణిస్తున్నాడని అన్నాడు... కేన్ మామ గమనించిన అభిషేక్ ట్యాలెంట్ ఏంటో తెలుసా?

Abhishek Sharma
Abishek Sharma : సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మపై మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆసక్తికర కామెంట్స్ చేసాడు. అతడు కేవలం ధనాధన్ షాట్లు ఆడటమే కాదు మైదానంలో ఏ మూలకైనా బంతిని బాదగలడు... అదును చూసుకుని ఫీల్డింగ్ గ్యాప్ లో షాట్లు ఆడగలడని విలియమ్సన్ అన్నాడు. అభిషేక్ చివరి నిమిషంలో షాట్లు మార్చగలడు... ఫుల్ పవర్‌తో బంతిని బాది గ్రౌండ్ నలువైపుల నుండి పరుగులు రాబట్టగలడంటూ అభిషేక్ గురించి చాలా గొప్పగా చెప్పాడు కేన్ మామ.
అభిషేక్ శర్మకు మంచి బ్యాట్ స్వింగ్ ఉంది... బంతిని టైమింగ్ చేయడంలో ఆయన దిట్ట అని విలియమ్సన్ పేర్కొన్నాడు. అతనికి పవర్ ఉంది... కానీ దాన్ని బలవంతంగా ఉపయోగించడని అన్నారు. బంతిని టైమింగ్ చేస్తూ గ్రౌండ్ నలువైపులా ఆడతాడు... ఇది చాలా గొప్ప విషయమన్నారు. అభిషేక్ స్టైల్ ఎస్ఆర్‌హెచ్ లోనే మరో విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ను పోలి ఉంటుందని కాంప్లిమెంట్ ఇచ్చాడు న్యూజిలాండ్ క్రికెటర్ విలియమ్సన్.
అభిషేక్ శర్మ బలంగా కొట్టకపోయినా ఆప్షన్స్ మార్చుకుని గ్రౌండ్ అంతటా స్కోర్ చేయగలడని... పరిస్థితులకు తగ్గట్లు చివరి నిమిషంలో షాట్ మార్చుకుంటాడని అన్నారు. ఇలా చాలా కొద్దిమందికి మాత్రమే సాధ్యమవుతుంది... అందులో అభిషేక్ ఒకడని విలియమ్సన్ పేర్కొన్నాడు.
Abhishek Sharma
ఐపిఎల్ లో అభిషేక్ శర్మ విధ్వంసం
అభిషేక్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్‌లో 16 ఇన్నింగ్స్‌లలో 484 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 204.21గా ఉంది. ట్రావిస్ హెడ్‌తో కలిసి అతను ఆడిన ఓపెనింగ్ భాగస్వామ్యం టోర్నమెంట్‌లో హైలైట్‌గా నిలిచింది. ఐపిఎల్ అతడి ప్రదర్శన టీమిండియా తలుపులు తట్టింది... ఎస్ఆర్‌హెచ్ తరపున ఆడిన సుడిగాలి ఇన్నింగ్స్ ఇండియాకు ఆడాలన్న కోరికను నెరవేర్చింది. అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా తన ఫామ్‌ను కొనసాగించాడు. 17 టీ20ల్లో 33.43 సగటుతో,193.84 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు... రెండు సెంచరీలు కూడా కొట్టాడు.
ఐపీఎల్ 2019కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్) నుంచి ఎస్ఆర్‌హెచ్ అతన్ని కొనుగోలు చేసినప్పుడే అభిషేక్ టాలెంట్ కనిపించిందని విలియమ్సన్ గుర్తు చేసుకున్నాడు. అప్పటికి అతను మూడు ఐపీఎల్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ అతని టాలెంట్ మాత్రం అద్భుతమన్నాడు.
"కొన్నిసార్లు ఐపీఎల్‌లో ఒక యంగ్ ప్లేయర్ కోసం ఎక్కువ కాలం వెయిట్ చేయడం కష్టం. కానీ ఇప్పుడు అభిషేక్ ప్రపంచంలోనే డేంజరస్ టీ20 బ్యాటర్లలో ఒకడిగా ఎదుగుతున్నాడు.యువరాజ్ సింగ్ దగ్గర ఇలా చాలామంది కుర్రాళ్ళు ఉన్నారు" అని అన్నాడు.
"అతను చాలా సరదాగా ఉంటాడు. హ్యాపీగా గేమ్ ఆడతాడు. సూపర్ స్టార్ ఆటగాళ్లలో ఉండే కాన్ఫిడెన్స్ అతనిలో ఉంది. మంచి ట్రైనర్ యువరాజ్ వద్ద శిక్షణ పొందాడు. యువరాజ్ కూడా బంతిని వీలైనంత దూరం కొట్టడానికి ప్రయత్నించేవాడు. అభిషేక్ కూడా ఇలాగే చేస్తాడు' అని విలియమ్సన్ పేర్కోన్నాడు.
Abhishek Sharma
అభిషేక్ లో టీ20 స్పెషలిస్టే కాదు... టెస్ట్ ప్లేయర్ కూడా : విలియమ్సన్
అభిషేక్ శర్మ ప్రస్తుతం టీ20 స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందాడు... కానీ అతను టెస్ట్ క్రికెట్‌కు తగ్గట్లుగా తన ఆటను మార్చుకోగలడని విలియమ్సన్ అన్నారు. అతడు అన్ని ఫార్మాట్లలో రాణిస్తాడని అంటున్నాడు. "అతడు బలం బంతిని బాదడం అనేది వైట్-బాల్ క్రికెట్‌కు ఉపయోగపడుతుంది. కానీ అతనికి మంచి టెక్నిక్ కూడా ఉంది. అది టెస్టులకు ఉపయోగపడుతుంది" అని విలియమ్సన్ ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో తో విలియమ్సన్ చెప్పాడు.
"అతను ఒకే రూట్‌లో వెళ్తాడని నేను అనుకోను. ఇండియా తరఫున టెస్ట్ క్రికెట్ ఆడాలని అతను అనుకుంటున్నాడని నాకు తెలుసు. అది చాలా గొప్ప విషయం. అతను తన ఆటను మార్చుకోగలడు. అతను బలంగా ఆడడు. బంతిని చూసి ఆడతాడు. అతని ఆటలో చాలా కోణాలు ఉన్నాయి... చాలా మెచ్యూర్ అయ్యాడు. అతనికి సహజంగానే బంతిని బాదే టాలెంట్ ఉంది. బంతిని అన్ని వైపులా కొట్టగలడు. ప్రపంచంలోని బెస్ట్ బౌలర్లను ఎదుర్కోవడం అంటే ధైర్యం కావాలి. అది అతడిలో ఉంది" అంటూ అభిషేక్ ను కొనియాడాడు విలియమ్సన్.
"అతను చాలా బాగా ఆడుతున్నాడు. తన ఆటను మెరుగుపరుచుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ప్రపంచంలో ఏ ప్లేయర్ అయినా అంతే. బాగా ఆడటానికి ట్రై చేయాలి. కొంచెం పెద్దయ్యాక నీకు ఒక రోల్ వస్తుంది. అప్పుడు ఎక్స్‌పీరియన్స్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న అభిషేక్ శర్మ నిర్ణయాలు తీసుకోవడంలో మెచ్యూరిటీ కనిపిస్తోంది'' అని విలియమ్సన్ అన్నాడు.