IPL 2025: ఐపీఎల్ ఫైనల్ వేదికలు అక్కడికే ఎందుకు మార్చారు?
IPL 2025 Final Venue: ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ వేదికలను బీసీసీఐ ప్రకటించింది. ఫైనల్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు ముల్లన్‌పూర్‌లో జరుగుతాయి.
15

Image Credit : Getty
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ వేదికలు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మే 20న ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ వేదికలను ప్రకటించింది. లీగ్ దశ మే 25న ముగుస్తుంది, ప్లేఆఫ్స్ మే 27న క్వాలిఫైయర్ 1తో ప్రారంభమవుతాయి. ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 వరుసగా మే 31, జూన్ 1 తేదీల్లో జరుగుతాయి. ఐపీఎల్ 2025 ఫైనల్ జూన్ 3న జరుగుతుంది.
25
Image Credit : Getty
అహ్మదాబాద్‌లో ఐపీఎల్ 2025 ఫైనల్
జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గ్రాండ్ ఫైనల్ జరుగుతుందని బీసీసీఐ ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఉత్కంఠభరితమైన క్వాలిఫైయర్ 2, గ్రాండ్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇస్తుంది.
35
Image Credit : Twitter
ముల్లన్‌పూర్‌లో ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 1
ఐపీఎల్ 2025 ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లు న్యూ చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో జరుగుతాయి. మే 29న టాప్-2 జట్ల మధ్య క్వాలిఫైయర్ 1, మే 30న ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది.
45
Image Credit : Getty
కోల్‌కతాను ఎందుకు తొలగించారు?
జూన్ 3న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో గ్రాండ్ ఫైనల్ నిర్వహించాలని కోల్‌కతా ప్రజలు డిమాండ్ చేశారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కొత్త వేదికలను నిర్ణయించినట్లు బీసీసీఐ తెలిపింది. జూన్ 3న కోల్‌కతాలో వర్షం పడే అవకాశం ఉంది. అక్కడి వాతావరణం పరిస్థితుల క్రమంలోనే వేదికలను మార్చారు.
55
Image Credit : ANI
ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన జట్లు
గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ అధికారికంగా ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. నాలుగో ప్లేఆఫ్ స్థానం కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోటీ ఉంది.
Latest Videos