రజత్ పాటిదార్ కు RCB కెప్టెన్సీ.. అసలు కారణం ఇదే
Royal Challengers Bengaluru: ఐపీఎల్ 2025 సీజన్ కోసం విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తన కొత్త కెప్టెన్ గా రజత్ పాటిదార్ ను ప్రకటించింది. అసలు ఈ యంగ్ ప్లేయర్ ను ఆర్సీబీ కెప్టెన్ గా ఎందుకు చేసిందో తెలుసా?

Virat Kohli-Rajat Patidar
Royal Challengers Bengaluru: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తన అభిమానులకు ఒక సూపర్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ కెప్టెన్‌గా డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రజత్ పాటిదార్‌ను నియమించింది.
31 ఏళ్ల రజత్ పాటిదార్ 2021 నుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రజత్ పాటిదార్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ 11 కోట్ల రూపాయలకు అతన్ని రిటైన్ చేసుకుంది.
IPL RCB
రజత్ పాటిదార్ కు ఆర్సీబీ కెప్టెన్సీ దక్కడానికి ప్రధాన కారణమేంటి?
ఐపీఎల్ 2025 వేలం తర్వాత ఆర్సీబీ కెప్టెన్ గా మరోసారి విరాట్ కోహ్లీ తిరిగివస్తారని వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు ఆర్సీబీ కొత్త కెప్టెన్ గా రజత్ పాటిదార్ వచ్చాడు. దేశవాళీ క్రికెట్ లో మధ్యప్రదేశ్ జట్టుకు రజత్ పాటిదార్ కెప్టెన్‌గా ఉన్నాడు. రజత్ పాటిదార్ కు కెప్టెన్సీలో చాలా అనుభవం ఉంది.
ఇటీవల తన కెప్టెన్సీలో రజత్ పాటిదార్ మధ్యప్రదేశ్‌ను సయ్యద్ ముష్తాక్ అలీ T20 ట్రోఫీ ఫైనల్‌కు నడిపించాడు. సయ్యద్ ముష్తాక్ అలీ T20 ట్రోఫీ టోర్నమెంట్ 2024 సీజన్‌లో రజత్ పాటిదార్ విధ్వంసం సృష్టించాడు. డిసెంబర్ 2024లో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్‌గా ఉండాలనే కోరికను రజత్ పాటిదార్ తెలిపాడు. ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు.
IPL RCB
సయ్యద్ ముష్తాక్ అలీ T20 ట్రోఫీలో తుఫాను సృష్టించిన రజత్ పాటిదార్
రజత్ పాటిదార్ కు ఆర్సీబీ కెప్టెన్సీ దక్కడానికి ప్రధాన కారణం దేశవాళీ క్రికెట్ లో అతని తుఫాను ఇన్నింగ్స్ లు ప్రధాన కారణం. 2024 సయ్యద్ ముష్తాక్ అలీ T20 ట్రోఫీ టోర్నమెంట్‌లో రజత్ పాటిదార్ 10 మ్యాచ్‌ల్లో 61.14 సగటుతో 428 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
ఈ టోర్నమెంట్‌లో రజత్ పాటిదార్ 186.09 స్ట్రైక్ రేట్‌తో 31 సిక్సర్లు, 32 ఫోర్లు బాదాడు. రజత్ పాటిదార్ దూకుడు బ్యాటింగ్, ప్రశాంతమైన కెప్టెన్సీ కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 సీజన్ కోసం అతన్ని కెప్టెన్ గా ఎంపిక చేసింది.
IPL RCB
రజత్ పాటిదార్ క్రికెట్ రికార్డులు ఏమిటి?
రజత్ పాటిదార్ తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 27 మ్యాచ్‌లు ఆడాడు. ఈ 27 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 34.74 సగటుతో 799 పరుగులు చేశాడు. రజత్ పాటిదార్ తన ఐపీఎల్ కెరీర్‌లో ఒక సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు సాధించాడు.
ఇక రజత్ పాటిదార్ 68 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 4738 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 64 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 2211 పరుగులు చేశాడు. తన లిస్ట్-ఏ కెరీర్‌లో రజత్ పాటిదార్ 4 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు బాదాడు. రజత్ పాటిదార్ మొత్తం 75 టీ20 మ్యాచ్‌ల్లో 2463 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
IPL RCB
ఐపీఎల్ 2025 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు
రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, దేవదత్ పడికల్, స్వస్తిక్ చికారా, లియామ్ లివింగ్‌స్టోన్, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, జాకబ్ బెథెల్, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, మనోజ్ భనగే, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, రసిక్ సలాం, యష్ దయాల్, సుయాష్ శర్మ, నువాన్ తుషార, లుంగి ఎంగిడీ, అభినందన్ సింగ్, మోహిత్ రాఠి.