IPL 2025 : WD,0,WD,WD,WD,1NB,4,6,1,1,1 ... ఇదేం ఓవర్రా సామీ..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టీ20 లో క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూచూడని వింతలు విడ్డూరాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అరుణ్ జైట్లీ స్టేడియంలో డిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఇలాంటి విచిత్రమే జరిగింది. అదేంటో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
Indian Premier League 2025
DC vs RR Indian Premier League 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో ఆసక్తికర మ్యాచ్ కు డిల్లీ స్టేడియం వేదికయ్యింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆతిథ్య డిల్లీ క్యాపిటల్స్ అద్భుతంగా ఆడుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన డిల్లీ టీం నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఇలా రాజస్ధాన్ ముందు 189 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచగలిగింది.
డిల్లీ బ్యాటింగ్ ఆసక్తికరంగా ముగిసింది. చివర్లో రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ బంతిపై పట్టు కోల్పోయాడు. దీంతో ఒకే ఓవర్లో పదకొండు బంతులు వేయాల్సి వచ్చింది... ఇందులో ఐదు వైడ్లు, ఒక నోబాల్ ఉన్నారు. సందీప్ వేసిన చివరి ఓవర్ WD,0,WD,WD,WD,1NB,4,6,1,1,1 గా సాగింది. ఇలా మొత్తం 11 బంతుల్లో ఏకంగా 19 పరుగులు వచ్చాయి. ఇలా లాస్ట్ ఓవర్ మరీ ఎక్స్ పెన్సివ్ గా మారడంతో రాజస్థాన్ ముందు కాస్త పెద్ద లక్ష్యమే ఉంది.
Abhishek Porel
డిల్లీ బ్యాటింగ్ సాగిందిలా :
సొంత మైదానంలో ఆడుతున్న డిల్లీకి మంచి ఆరంభం లభించింది. యువ ఓపెనర్ అభిషేక్ పొరేల్ రెండో ఓవర్లో విధ్వంసం చేసాడు... 4,4,6,4,4,1 తో ఏకంగా 23 పరుగులు రాబట్టాడు. అయితే ఆ తర్వాత వరుసగా వికెట్లు పడటంతో రాజస్థాన్ బ్యాటింగ్ కాస్త స్లో అయ్యింది. అభిషేక్ కేవలం 37 బంతుల్లో 49 పరుగులు చేసాడు.
గత మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన కరణ్ నాయర్ డకౌట్ అయ్యాడు... అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. మెక్ గర్క్ కూడా కేవలం 9 పరుగులే చేసాడు. ఇక రాహుల్ 32 బంతుల్లో 38 పరుగులతో సందర్భోచితంగా ఆడాడు. చివర్లో స్టబ్స్ 18 బంతుల్లో 34 పరుగులు రాణించాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు... కేవలం 18 బంతుల్లోనే 34 పరుగులతో చెలరేగాడు.
మొత్తంగా డిల్లీ బ్యాటింగ్ ఆరంభం, ఫినిషింగ్ అదిరింది. మొదట్లో ఓపెనర్ పొరేల్.. చివర్లో అక్షర్, స్టబ్స్ పరుగులు రాబట్టారు. మధ్యలో స్కోరు కాస్త స్లో అయ్యింది. అయినా డిల్లీ సొంత మైదానంలో మంచి స్కోరు సాధించింది. మరి రాజస్థాన్ ఈ లక్ష్యాన్ని చేధిస్తుందో లేదో చూడాలి.
DC vs RR
రాజస్థాన్ బౌలింగ్ :
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోప్రా ఆర్చర్ అద్భుతంగా బౌలింగ్ చేసాడు. 4 ఓవర్లేసిన అతడు 32 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. సందీప్ శర్మ ఆరంభంలో బాగా బౌలింగ్ చేసిన చివర్లో తడబడ్డాడు... అతడు 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చాడు. తీక్షణ 4 ఓవర్లలో 40 పరుగులు, హసరంగ 4 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చి ఒక్కో వికెట్ పడగొట్టారు. తుషార్ దేశ్ పాండే 3 ఓవర్లలో 38 పరుగులు, రియాన్ పరాగ్ 1 ఓవర్లో 6 పరుగులు చేసాడు.