MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2025 : లక్నో బౌలర్లతో సరిగమలు పలికించిన 20 ఏళ్ల కుర్రాడు... ఎవరీ విప్రాజ్ నిగమ్?

IPL 2025 : లక్నో బౌలర్లతో సరిగమలు పలికించిన 20 ఏళ్ల కుర్రాడు... ఎవరీ విప్రాజ్ నిగమ్?

డిల్లీ క్యాపిటల్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య విశాఖపట్నంలో తొలి ఐపిఎల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. మైదానమే చిన్నబోయేలా డిల్లీ బ్యాటర్ విప్రాజ్ నిగమ్ సుడిగాలి ఇన్నింగ్స్ సాగింది. ఇంతకూ ఈ విప్రాజ్ ఎవరో తెలుసా? 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Mar 25 2025, 01:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
IPL 2025 DC vs LSG

IPL 2025 DC vs LSG

IPL 2025 DC vs LSG : విప్రాజ్ నిగమ్ ...  ఇప్పుడు ఆ ఆల్ రౌండర్ పేరు మారుమోగిపోతోంది. అతడి ఆటను చూసి క్రికెట్ ప్రియులు మైమరచిపోయారు... గెలుపు ఆశలు చచ్చి.పోయిన డిల్లీ క్యాపిటల్స్ అభిమానుల్లో కొత్త జోష్ నింపాడు ఈ 20 ఏళ్ల కుర్రాడు. విశాఖపట్నం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ ను డిల్లీ మట్టికరిపించడంలో విప్రాజ్ ది కీలక పాత్ర. అటు బ్యాట్, ఇటు బాల్ తో అదరగొట్టి డిల్లీ కేపిటల్స్ కు ఐపిఎల్ 2025 లో డిల్లీకి మొదటి విజయాన్ని అందించాడు. 

విప్రాజ్ నిగమ్ లక్నో బౌలర్లలో సరిగమలు పలికించాడు... బౌలర్ ఎవరైనా కానీ నా టార్గెట్ బౌండరీ బాదడమే అన్నట్లుగా ఆడాడు. టకటకా వికెట్లు పడుతున్న సమయంలో బ్యాటింగ్ కు దిగిన అతడు ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా పరుగుల వరద పారించాడు. దీంతో గెలుపు అసాధ్యం అనుకున్న డిల్లీ విజయం సాధించింది... గెలిచితీరుతుందని అనుకున్న లక్నో ఓటమిపాలయ్యింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Vipraj Nigam

Vipraj Nigam

ఎవరీ విప్రాజ్ ,నిగమ్? 

విశాఖపట్నం మైదానమే చిన్నబోయేలా బౌండరీలు బాది విప్రాజ్ నిగమ్ తన సత్తాను పరిచయం చేసాడు. చివర్లో బ్యాటింగ్ కు దిగిన ఇతడు కేవలం 15 బంతుల్లోనే 39 పరుగులు చేసాడు... ఇందులో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి... అంటే బౌండరీతోనే 32 పరుగులు బౌండరీలతో వచ్చినవే. దీన్నిబట్టే నిగమ్ బ్యాటింగ్ ఎంత విధ్వంసకరంగా సాగిందో అర్ధం చేసుకోవచ్చు. 

డిల్లీ క్యాపిటల్ తరపున ఐపిఎల్ 2025 లో ఆరంగేట్రం చేసాడు విప్రాజ్ నిగమ్. మొదటి మ్యాచ్ లోనే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడి ఆటనుచూసి ప్రత్యర్థి బౌలర్లే భయపడిపోయారు... అంత విధ్వంసకరంగా సాగింది.  అసలు గెలుపుపైనే నమ్మకంలేని స్థాయినుండి మరో 3 బంతులు మిగిలుండగానే డిల్లీ విజయం సాధించిందంటే అది విప్రాజ్ మెరుపు ఇన్నింగ్సే వల్లే సాధ్యమయ్యింది. 

డిల్లీ విజయంలో కీలకంగా వ్యవహరించి విప్రాజ్ ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఆల్ రౌండర్.  ఇతడు మంచి స్పిన్నర్, మంచి హిట్టర్. అటు బ్యాట్, ఇటు బాల్ తో మ్యాజిక్ చేయగల విప్రాజ్ ను డిల్లీ కేవలం రూ.50 లక్షలకు సొంతం చేసుకుంది. 

ఇతడు సయ్యద్ మస్తాన్ అలీ ట్రోఫీ 2024-25  లో అద్భుతంగా రాణించి డిల్లీ యాజమాన్యం కంట్లో పడ్డాడు. ఇతడు కేవలం 7 ఎకానమీతో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. అతడికి బ్యాటింగ్ అవకాశాలు ఎక్కువగా రాలేదు... ఆడిన ఒక్క మ్యాచ్ లోనూ ఎనిమిది బంతుల్లో 27 పరుగులు చేసాడు.   

33
Vipraj Nigam

Vipraj Nigam

అశుతోష్ తో కలిసి విప్రాన్ నిగమ్ విధ్వంసం :

డిల్లీ ఇన్నింగ్స్ 12 ఓవర్లో స్టబ్స్ ఔటవడంతో విప్రాజ్ నిగమ్ క్రీజులోకి వచ్చాడు. అతడిపై ఏమాత్రం అంచనాలు లేవు... టీం కూడా గెలుపుకు చాలాదూరంలో నిలిచింది. ఇలాంటి సమయంలో బరిలోకి దిగిన విప్రాన్ కు తనను తాను నిరూపించుకునే అవకాశం వచ్చింది. దీన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. 

క్రీజులో కుదురుకున్నాక తన విశ్వరూపం చూపించాడు. రవి బిష్ణోయ్ వేసిన 13వ ఓవర్లో ఓ సిక్స్, రెండు ఫోర్లు బాదాడు విప్రాజ్. ఆ తర్వాత షహబాజ్ పనిపట్టాడు... ఇతడి ఓవర్లో ఓ ఫోర్, ఓ సిక్సర్ బాదాడు. ప్రిన్స్ యాదవ్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. ఇలా కేవలం 15 బంతులే ఆడిన అతడు రెండు సిక్సులు, ఐదు ఫోర్లతో ఏకంగా 39 పరుగులు చేసాడు. 

ఇలా దూకుడుగా ఆడే ప్రయత్నంలో దిగ్వేష్ రథి బౌలింగ్ లో సిద్దార్థ్ కు క్యాచ్ ఇచ్చాడు. అయితే అప్పటికే లక్నోకు చేయాల్సిన డ్యామేజ్ చేసాడు. విప్రాజ్ ఔటైనా అశుతోష్ చివరివరకు క్రీజులో నిలిచి డిల్లీకి విజయాన్ని అందించాడు. మరో 3 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది డిల్లీ క్యాపిటల్స్. 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved