MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2025 DC vs LSG : అశుతోష్ ఏం ఆడాడు గురూ... విజయంపై ఆశలే లేని డిల్లీని గెలిపించేసాడు

IPL 2025 DC vs LSG : అశుతోష్ ఏం ఆడాడు గురూ... విజయంపై ఆశలే లేని డిల్లీని గెలిపించేసాడు

ఏం ఆడాడు గురూ... విశాఖపట్నంలో అశుతోష్ శర్మ ధనాధన్ ఇన్నింగ్ ను చూసిన ప్రతిఒక్కరి నోటినుండి వచ్చే మాట ఇదే. అసలు గెలుపుపై ఆశలే వదిలేసుకున్న డిల్లీలో తన వీరోచిత పోరాటంతో గెలించాడు అశుతోష్. 

Arun Kumar P | Updated : Mar 25 2025, 12:01 AM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
13
Ashutosh Sharma

Ashutosh Sharma

IPL 2025 DC vs LSG : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో ఆసక్తికరమైన మ్యాచ్ కు విశాఖపట్నం వేదికయ్యింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో విజయం డిల్లీ క్యాపిటల్ ను వరించింది. భారీ స్కోరు చేసికూడా లక్నో సూపర్ జెయింట్ ఓటమిపాలయ్యింది. ఓవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం లెక్కచేయకుండా ధనాధన్ ఇన్నింగ్ ఆడిన అశుతోష్ డిల్లీని విజయతీరాలకు చేర్చాడు.  ఇంకో మూడు బంతులు మిగిలి ఉండగానే డిసి లక్ష్యాన్ని చేధించింది. 
 
 210 పరుగుల భారీ లక్ష్యచేధనలో డిల్లీ అద్భుతమే చేసిందని చెప్పాలి. ఈ జట్టు టాప్ ఆర్డర్ విఫలమైనా లోయర్ ఆర్డర్ అద్భుతంగా పోరాడి విజయాన్ని అందించింది. లక్నో బ్యాటింగ్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అశోతోష్ హాప్ సెంచరీ గురించి. కేవలం 33 బంతుల్లోనే అతడు 66 పరుగులు (5 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసాడు. 

ఇక విపిన్ నిగమ్ సుడిగాలి ఇన్నింగ్స్ కూడా డిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించింది.  అతడు కేవలం 15 బంతుల్లోనే 39 పరుగులు బాదాడు.  అందులో 5 ఫోర్లు, 2 సిక్సర్లు అంటే 32 పరుగులు కేవలం బౌండరీలతోనే వచ్చాయంటే అతడి విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. 

డిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా దూకుడుగానే ఆడాడు.   11 బంతుల్లో 22 పరుగులు చేసాడు. ఓపెనర్ డుప్లెసిస్ 18 బంతుల్లో 29, స్టబ్స్ 22 బంతుల్లో 34 పరుగులతో డిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఓ సమయంలో డిల్లీ గెలుపు అసాధ్యం అనుకున్నారంతా.... కానీ అశుతోష్, స్టబ్స్, విప్రాజ్ నిగమ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసారు. 
 

23
DC vs LSG

DC vs LSG

లక్నో ఇన్నింగ్స్ సాగిందిలా : 

టాస్ గెలిచిన డిల్లీ మొదట బౌలింగ్ ఎంచుకోవడంతో డిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది.  ఓపెనర్ మాక్రమ్ తొందరగానే ఔటయినా మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ అద్భుతంగా ఆడాడు. అతడు కేవలం 36 బంతుల్లోనే 72 పరుగులు (6 ఫోర్లు, 6 సిక్సర్లు) చేసాడు. అతడికి పూరన్ కూడా తోడయ్యాడు. పూరన్ 30 బంతుల్లోనే 75 పరుగులు (6 ఫోర్లు, 7 సిక్సర్లు) చేసాడు. ఇద్దరి మధ్య మంచి భాగస్వామ్యం నమోదయ్యింది. చివర్లో డేవిడ్ మిల్లర్ 19 బంతుల్లో 27 పరుగులు చేసాడు. 

లక్నో ఇన్నింగ్స్ లో కేవలం నలుగురు ఆటగాళ్లు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు.   మార్ష్, పూరన్ హాఫ్ సెంచరీలు చేస్తే మిల్లర్, మాక్రమ్ గౌరవప్రదమైన రెండంకెల స్కోరు సాధించారు. ఇలా లక్నో జట్టులో రాణించిన ఆటగాళ్లంతా విదేశీయులే కావడం విశేషం. తొలి ఇన్నింగ్స్ లో లక్నో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. 

33
DC vs LSG

DC vs LSG

చుక్కలు చూసిన బౌలర్లు : 

ఒకే మ్యాచ్ లో మొత్తం 400+ పరుగులు వచ్చాయంటే బౌలర్ల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.  అటు విజయం సాధించిన డిల్లీ బౌలర్లు గానీ... ఓటమిపాలైన లక్నో బౌలర్లుగానీ మ్యాచ్ పై పెద్దగా ప్రభావం చూపించలేదు. హేమాహేమీ బౌలర్లు సైతం భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 

మొదట డిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ 4 ఓవర్లేసి 42 పరుగులు ఇచ్చాడు. కానీ అతడికి మూడు వికెట్లు దక్కాయి.  ఇక కెప్టెన్ అక్షర్ 3 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కానీ వికెట్లు పడగొట్టలేకపోయాడు.  విపిన్ నిగమ్ 2 ఓవర్లలో 35, ముఖేష్ కుమార్ 2 ఓవర్లలో 22, మోహిత్ శర్మ 4 ఓవర్లలో 42, స్టబ్స్ 1 ఓవర్లో 28 పరుగులు సమర్పించారు. కుల్దీప్ యాదవ్ ఒక్కరే పొదుపుగా బౌలింగ్ చేసాడు... అతడు 4 ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 

లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.  సిద్దార్థ్ 4 ఓవర్లేసి 39 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. దిగ్వేశ్ రథి 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి 2 వికెట్లు, రవి బిష్ణోయ్ 4 ఓవర్లలో 53 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టారు. ప్రిన్స్ యాదవ్ 4 ఓవర్లలో 47 పరుగులు, షహబాజ్ అహ్మద్ 1.3 ఓవర్లలో 22 పరుగులు సమర్పించుకున్నాడు.  

Arun Kumar P
About the Author
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు. Read More...
క్రికెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రీడలు
 
Recommended Stories
Top Stories