ఐపీఎల్ 2025: కేకేఆర్ కు షాక్.. ముగ్గురు స్టార్ ప్లేయర్స్ కి గాయం !
IPL 2025 - KKR : ఐపీఎల్ 2025 సీజన్ త్వరలోనే మొదలవ్వనుంది. అయితే, ఐపీఎల్ కొత్త సీజన్ కు ముందు కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కు బిగ్ షాక్ తగిలింది. జట్టులో ముగ్గురు కీలక ఆటగాళ్లు గాయపడ్డడారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ టోర్నమెంట్ మార్చి 21 నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఐపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2025 ఐపీఎల్ సీజన్ కోసం చాలా జట్లు ఇప్పటికే సన్నద్ధమవుతున్నాయి. ఓపెనింగ్ ఎవరు, మిడిల్ ఆర్డర్ లో ఎవరు ఆడాలి అనే జాబితాను సిద్ధం చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే, ప్రస్తుత ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఐపీఎల్ 2025 సీజన్ కి ముందు కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. జట్టులోని ముగ్గురు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్ట్జే లు గాయపడ్డారు.
రింకు సింగ్
కేకేఆర్ జట్టులో నమ్మకమైన బ్యాట్స్ మెన్, ఐపీఎల్ 2025 కోసం జట్టులో ఉంచుకున్న మొదటి ఆటగాడు, భారత టీ20 స్టార్ రింకు సింగ్ ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టీ20కి ముందు గాయపడ్డాడు. భారత జట్టు ఆడబోయే తదుపరి రెండు టీ20ల నుంచి అతను ఇప్పటికే తప్పుకున్నాడు. అతని ఫిట్ నెస్ రిపోర్ట్ కోసం జట్టు ఎదురుచూస్తోంది. అతను ఎక్కువ కాలం లేకపోతే కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ లో పెద్ద లోటు ఏర్పడుతుంది. రాబోయే సీజన్ లో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ టీమ్ కేకేఆర్ రింగ్ సింగ్ పై భారీ అంచనాలే పెట్టుకుంది.
వెంకటేష్ అయ్యర్
2021 నుంచి కేకేఆర్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న వెంకటేష్ అయ్యర్ ను ఐపీఎల్ మెగా వేలంలో కేకేఆర్ 23.75 కోట్లకు కొనుగోలు చేసింది. రంజీ ట్రోఫీ సమయంలో వెంకటేష్ అయ్యర్ గాయపడ్డాడు. అతని గాయం తీవ్రంగా ఉందని చెబుతున్నారు. దీంతో కేకేఆర్ జట్టు ఆందోళన చెందుతోంది. భారీ ధరకు అతన్ని దక్కించుకున్న టీమ్ మరోసారి అతన్ని నుంచి రాబోయే సీజన్ లో సూపర్ ఇన్నింగ్స్ లను ఆశిస్తోంది. అయితే, అతను గాయపడటంతో షారుఖ్ టీమ్ ఆందోళన చెందుతోంది.
అన్రిచ్ నోర్ట్జే
దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్ట్జే కేకేఆర్ బౌలింగ్ లో కీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికా టీ20 లీగ్ సమయంలో అతను గాయపడ్డాడు. ఈ గాయం కారణంగా అతను దక్షిణాఫ్రికా టీ20 లీగ్, ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలిగాడు. దీంతో అతను ఐపీఎల్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసే నోర్ట్జే లేకపోతే కేకేఆర్ కు పెద్ద దెబ్బ అని చెప్పాలి.
ఐపీఎల్ 2025 కోసం కేకేఆర్ టీమ్
కోల్ కతా నైట్ రైడర్స్ రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితా:
రింకూ సింగ్: రూ. 13 కోట్లు
వరుణ్ చక్రవర్తి: రూ. 12 కోట్లు
సునీల్ నరైన్: రూ. 12 కోట్లు
ఆండ్రీ రస్సెల్: రూ. 12 కోట్లు
హర్షిత్ రానా: రూ. 4 కోట్లు
రమణదీప్ సింగ్: రూ. 4 కోట్లు
వేలంలో జట్టులోకి వచ్చిన వారి జాబితా:
వెంకటేష్ అయ్యర్: 23.75 కోట్లు
క్వింటన్ డి కాక్: 3.60 కోట్లు
రహ్మానుల్లా గుర్బాజ్: 2 కోట్లు
అన్రిచ్ నోర్ట్జే: 6.5 కోట్లు
అంగ్క్రిష్ రఘువంశీ: 3 కోట్లు
వైభవ్ అరోరా: 1.80 కోట్లు
మయాంక్ మార్కండే: 30 లక్షలు
రోవ్‌మన్ పావెల్: 1.50 కోట్లు
మనీష్ పాండే: 75 లక్షలు
స్పెన్సర్ జాన్సన్: 2.80 కోట్లు
లువ్నిత్ సిసోడియా: 30 లక్షల
అజింక్య రహానే: 1.5 కోట్లు
అనుకుల్ రాయ్: 40 లక్షలు
మొయిన్ అలీ: 2 కోట్లు
ఉమ్రాన్ మాలిక్: 75 లక్షల