MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • యశస్వి జైస్వాల్‌కి లక్కీ ఛాన్స్... రుతురాజ్ గైక్వాడ్ ప్లేస్‌లో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి...

యశస్వి జైస్వాల్‌కి లక్కీ ఛాన్స్... రుతురాజ్ గైక్వాడ్ ప్లేస్‌లో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి...

ఐపీఎల్ 2023 సీజన్‌లో అదరగొట్టిన యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కి లక్కీ ఛాన్స్ దక్కింది. దేశవాళీ టోర్నీల్లో మంచి ప్రదర్శన ఇస్తూ ఐపీఎల్‌ 2023లో 14 మ్యాచుల్లో 625 పరుగులు చేసిన జైస్వాల్‌‌ని వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 28 2023, 03:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Image credit: PTI

Image credit: PTI

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ఎంపిక చేసిన జట్టులో రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ రూపంలో ఇద్దరు ఓపెనర్లు ఉన్నారు. రిజర్వు ఓపెనర్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ని డబ్ల్యూటీసీ ఫైనల్‌కి ఎంపిక చేసింది బీసీసీఐ...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అయితే ఇప్పటికే చాలాసార్లు టీమిండియాకి ఎంపిక చేయబడినా, రిజర్వు బెంచ్‌లోనే కూర్చున్నాడు రుతురాజ్ గైక్వాడ్. అందుకేనేమో సరిగ్గా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కి ముందు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు...

37

జూన్ 2- 3 తేదీతో రుతురాజ్ గైక్వాడ్ వివాహం జరగనుంది. జూన్ 7న లండన్‌లో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరగనుంది. పెళ్లి కాగానే భార్యని వదిలిపెట్టి లండన్‌ వెళ్లినా, అక్కడ రిజర్వు బెంచ్‌లో కూర్చోవాల్సిందేనని గ్రహించిన గైక్వాడ్, టీమిండియా నుంచి సెలవు కోరుకున్నాడు..

47

దీంతో రుతురాజ్ గైక్వాడ్ ప్లేస్‌లో యశస్వి జైస్వాల్‌ని లండన్‌కి పంపించాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఇప్పటికే బాంబే జింఖానా గ్రౌండ్‌లో యశస్వి జైస్వాల్, రెడ్ బాల్‌తో ప్రాక్టీస్ చేయడం కనిపించింది. ఆదివారం రాత్రి యశస్వి జైస్వాల్, లండన్ ఫ్లైట్ ఎక్కబోతున్నాడు...

 

57

రంజీ ట్రోఫీలో 45 సగటుతో 404 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, ఓ సెంచరీ, మరో హాఫ్ సెంచరీ బాదాడు. ఐపీఎల్‌లో ఓ సెంచరీతో పాటు 5 హాఫ్ సెంచరీలు బాది, ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు..

67

అయితే  కీ ప్లేయర్లు గాయం కారణంగా తప్పుకుంటేనే యశస్వి జైస్వాల్‌కి తుది జట్టులో చోటు దక్కుతుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కాకపోయినా ఆ తర్వాతైనా ఈ 21 ఏళ్ల యంగ్ గన్‌కి టీమిండియాలో చోటు దక్కడం ఖాయం...

77

ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్‌ కోసం ఇక్కడే ఉండిపోయిన శుబ్‌మన్ గిల్, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, అజింకా రహానే కూడా ఆదివారం రాత్రి లేదా సోమవారం లండన్‌కి బయలుదేరి వెళ్లబోతున్నారు. ఈ నలుగురు కూడా టీమిండియాకి కీ ప్లేయర్లుగా ఉండబోతున్నారు. 

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
Hardik Pandya: ధోనీతో పాండ్యా సీక్రెట్ మీటింగ్? ముంబైకి షాకిచ్చి చెన్నైలోకి హార్దిక్ మాస్ ఎంట్రీ !
Recommended image2
Abhishek Sharma: 25 సిక్సర్లు, 15 ఫోర్లు.. 91 బంతుల్లో డబుల్ సెంచరీ కొట్టన అభిషేక్ శర్మ
Recommended image3
Cricketers Retirement : రహానే ట్రైలర్ మాత్రమే, సినిమా మిగిలే ఉంది.. రిటైర్మెంట్ కు సిద్దమైన టాప్ 5 క్రికెటర్లు వీళ్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved