- Home
- Sports
- Cricket
- అవుట్ అయ్యాక నవ్వుతావా? నేను పంజాబ్ కింగ్స్ కోచ్‌ని అయ్యి ఉంటేనా... యూసఫ్ పఠాన్ కామెంట్...
అవుట్ అయ్యాక నవ్వుతావా? నేను పంజాబ్ కింగ్స్ కోచ్‌ని అయ్యి ఉంటేనా... యూసఫ్ పఠాన్ కామెంట్...
ఐపీఎల్ 2023 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కథ ముగిసింది. వరుసగా మూడో సీజన్‌లో కొత్త కెప్టెన్‌ని తీసుకొచ్చిన పంజాబ్ కింగ్స్, 14 మ్యాచుల్లో 6 విజయాలు అందుకుని ప్రస్తుతం 8వ స్థానంలో నిలిచింది. ఢిల్లీ ఆఖరి మ్యాచులో గెలిస్తే పంజాబ్ 9వ స్థానానికి పడిపోవచ్చు...

PTI Photo/Manvender Vashist Lav) (PTI05_03_2023_000448B)
ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో 15 పరుగుల తేడాతో ఓడిన పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది...
PTI Photo/Shahbaz Khan)(PTI05_17_2023_000244B)
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 48 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో 94 పరుగులు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్, సెంచరీ మిస్ చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 9 పరుగులు చేసి నవ్‌దీప్ సైనీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...
Liam Livingstone
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాక నవ్వుతూ పెవిలియన్ చేరిన లియామ్ లివింగ్‌స్టోన్, రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో 13 బంతులు వేస్ట్ చేసి 9 పరుగులే చేసి అవుటయ్యాక కూడా చిరునవ్వులు చిందించాడు...
‘నేను పంజాబ్ కింగ్స్ కోచ్ కానీ లేదా కెప్టెన్, మెంటర్ కానీ అయితే లియామ్ లివింగ్‌స్టోన్‌ని తిరిగి టీమ్‌లోకి తీసుకోను. కొంచెం కూడా సీరియస్ లేకుండా చెత్త షాట్ ఆడేందుకు ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాక నవ్వుతావా... ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్...
Image credit: PTI
‘అవును. నేను యూసఫ్ పఠాన్ కామెంట్‌తో అంగీకరిస్తున్నా. అవుట్ అవ్వడం తప్పు కాదు, కానీ అతను ఆడిన షాట్ ఎంత నిర్లక్ష్యంగా ఉందో చూడొచ్చు. పైగా అవుట్ అయ్యాక నవ్వుతున్నాడు. అతనికి ఏ మాత్రం సీరియెస్‌నెస్ ఉన్నట్టు లేదు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్..
liam livingston
ఐపీఎల్ 2023 సీజన్‌లో 9 మ్యాచుల్లో 34.88 సగటుతో 279 పరుగులు చేశాడు లియామ్ లివింగ్‌స్టోన్. గాయం కారణంగా ఆరంభంలో ఐదు మ్యాచులకు దూరంగా ఉన్న లియామ్ లివింగ్‌స్టోన్, ఈ సీజన్‌లో 2 హాఫ్ సెంచరీలు చేశాడు..