- Home
- Sports
- Cricket
- ఐపీఎల్ 2023: ఫోటోషూట్‌కి డుమ్మా కొట్టిన ముంబై... ఆ ఒక్క కారణంతోనే అక్కడికి వెళ్లని రోహిత్, సూర్య...
ఐపీఎల్ 2023: ఫోటోషూట్‌కి డుమ్మా కొట్టిన ముంబై... ఆ ఒక్క కారణంతోనే అక్కడికి వెళ్లని రోహిత్, సూర్య...
ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభానికి ముందు ఫోటోషూట్ నిర్వహించింది మేనేజ్‌మెంట్. అయితే 10 ఫ్రాంఛైజీలు ఉంటే 9 మంది కెప్టెన్లు మాత్రమే ఈ ఫోటోషూట్‌కి వచ్చారు. ఐదు సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ టీమ్ నుంచి ఎవ్వరూ రాకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది...

ఐపీఎల్ 2023 ఫోటోషూట్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ లేకపోవడంతో సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వైరల్ అయ్యాయి. రోహిత్ తనకి ఇష్టమైన వడాపావ్ తింటూ ఉండవచ్చని కొందరు ట్రోల్ చేస్తే, మరికొందరు ఈ ఫోటో తీసింది అతనేనంటూ మీమ్స్ వైరల్ చేశారు...
వాస్తవానికి ముంబై ఇండియన్స్ నుంచి ఏ ప్లేయర్ కూడా ఈ ఫోటోషూట్‌కి రాకపోవడానికి మూడు కారణాలు ఉన్నాయట. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, కాస్త జ్వరంతో బాధపడుతూ టీమ్‌కి దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత కొన్ని యాడ్స్‌లో నటించిన రోహిత్, అస్వస్థతకు గురయ్యాడు. మొదటి మ్యాచ్ సమయానికి రోహిత్ పూర్తిగా కోలుకుంటాడని టీమ్ తెలియచేసింది...
ముంబై ఇండియన్స్ టీమ్‌కి అధికారికంగా వైస్ కెప్టెన్ లేడు. ఇంతకుముందు రోహిత్ శర్మ గాయపడిన మ్యాచుల్లో కిరన్ పోలార్డ్ కెప్టెన్‌గా వ్యవహరించేవాడు. ఐపీఎల్ 2023 సీజన్‌కి మినీ వేలానికి పోలార్డ్‌ని విడుదల చేసింది ముంబై ఇండియన్స్. వేరే టీమ్ తరుపున ఆడడం ఇష్టం లేని అతను, ఐపీఎల్ నుంచి తప్పుకుంటూ రిటైర్మెంట్ ప్రకటించాడు. వెంటనే అతన్ని బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది ముంబై ఇండియన్స్...
Image credit: PTI
ఐపీఎల్ 2023 సీజన్‌కి వైస్ కెప్టెన్‌ని ఇంకా ప్రకటించలేదు ముంబై ఇండియన్స్. అధికారికంగా ప్రకటించకపోయినా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. రోహిత్ జ్వరంతో బాధపడుతుంటే సూర్యకుమార్ యాదవ్‌ని ఫోటోషూట్‌కి పంపించవచ్చుగా.. అతన్ని కూడా ఎందుకు పంపలేదు?
Image credit: PTI
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్, మూడు మ్యాచుల్లో డకౌట్ అయ్యాడు. ఈ డకౌట్లతో సూర్య కాన్ఫిడెన్స్ కాస్త తగ్గింది. ఈ సమయంలో కేవలం ఫోటో షూట్ కోసం అతన్ని అహ్మదాబాద్ వరకూ పంపించడం అనవసరం అని భావించిందట టీమ్ మేనేజ్‌మెంట్...
గత సీజన్‌లో 14 మ్యాచుల్లో 10 మ్యాచుల్లో ఓడింది ముంబై ఇండియన్స్. సూర్యకుమార్ యాదవ్ గాయంతో 8 మ్యాచులే ఆడాడు. ఈ సీజన్‌లో అలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా జాగ్రత్త పడుతోంది ముంబై...
ముంబై ఇండియన్స్, ఐపీఎల్ 2023 సీజన్‌లో తొలి మ్యాచ్ బెంగళూరులో ఆడుతోంది. ఫోటోషూట్ కోసం బెంగళూరు నుంచి అహ్మదాబాద్ దాకా వెళ్లడం, మళ్లీ వెనక్కి రావడం ఎందుకని ముంబై మేనేజ్‌మెంట్ భావించి... ఈ ఈవెంట్‌కి దూరంగా ఉందట...