- Home
- Sports
- Cricket
- అతన్ని ఇంకా ఎందుకు ఆడిస్తున్నావ్? నీ టీమ్‌లో ప్లేయర్లు లేరా... నితీశ్ రాణాపై యూసఫ్ పఠాన్ ఫైర్...
అతన్ని ఇంకా ఎందుకు ఆడిస్తున్నావ్? నీ టీమ్‌లో ప్లేయర్లు లేరా... నితీశ్ రాణాపై యూసఫ్ పఠాన్ ఫైర్...
ఐపీఎల్ 2023 సీజన్‌లో కేకేఆర్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న నితీశ్ రాణా, టీమ్‌ని బాగానే నడిపిస్తున్నాడు. గత సీజన్‌లో ఫెయిల్ అయిన వెంకటేశ్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి ఈసారి అదరగొడుతూ కేకేఆర్‌ని రేసులో నిలబెడుతున్నారు...

Image credit: PTI
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ సూపర్ సెంచరీతో చెలరేగగా మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయారు. ఆండ్రే రస్సెల్ 11 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేయగా సెన్సేషనల్ రింకూ సింగ్ 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
Image credit: PTI
185 పరుగుల భారీ స్కోరు చేసినా దాన్ని నిలబెట్టుకోలేకపోయింది కేకేఆర్. ఉమేశ్ యాదవ్ 2 ఓవర్లలో 19 పరుగులు, సుయాశ్ శర్మ 4 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి పర్వాలేదనిపించినా మిగిలిన బౌలర్లు తేలిపోయారు. ముఖ్యంగా భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన లూకీ ఫర్గూసన్, ఈ సీజన్‌లో వరుసగా ఫెయిల్ అవుతున్నాడు...
‘నితీశ్ రాణా స్ట్రాటెజీ నాకు కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. లూకీ ఫర్గూసన్‌ని ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎందుకు సెలక్ట్ చేసినట్టు. అతను అద్భుతమైన బౌలర్. అలాంటి బౌలర్‌ని సెలక్ట్ చేసినప్పుడు తనతో ఓపెనింగ్ స్పెల్ వేయించాలి...
ఓపెనింగ్ స్పెల్స్ వేయనప్పుడు అతన్ని ఆడించడం దేనికి? లూకీ ఫర్గూసన్‌ని ఆరంభంలో బౌలింగ్ చేయించి, అతను ఎక్కువగా పరుగులు ఇస్తుంటే, వేరే బౌలర్‌ని తీసుకొస్తే బాగుండేది. కానీ నితీశ్ రాణా స్ట్రాటేజీలో అటాకింగ్ ఫార్ములా మిస్ అయ్యింది...
Image credit: PTI
శార్దూల్ ఠాకూర్, లూకీ ఫర్గూసన్, ఉమేశ్ యాదవ్ ముగ్గురూ ముగ్గురే. గత సీజన్‌లో ఉమేశ్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొదటి ఓవర్లలోనే వికెట్లు తీశాడు. అయితే ఇప్పుడు అతనిపై చాలా ప్రెషర్ పడుతోంది. ఉమేశ్‌కి వికెట్ తీసే మరో బౌలింగ్ పార్టనర్ కావాలి...
Image credit: PTI
లూకీ ఫర్గూసన్ వికెట్లు తీయలేకపోతే టిమ్ సౌథీని టీమ్‌లోకి తీసుకురావడమే బెటర్. అలాగే రిజర్వు బెంచ్‌లో ఉన్న కుర్రాళ్లను కూడా ప్రయత్నించి చూడాలి...’ అంటూ కామెంట్ చేశాడు కేకేఆర్ మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్..