- Home
- Sports
- Cricket
- పర్ఫెక్టుగా ప్లాన్ చేసుకున్నాం, కానీ అతని వల్లే ఓడిపోయాం... ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్...
పర్ఫెక్టుగా ప్లాన్ చేసుకున్నాం, కానీ అతని వల్లే ఓడిపోయాం... ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్...
ఐపీఎల్ 2023 సీజన్‌ని ఘన విజయంతో మొదలెట్టిన ఆర్‌సీబీ, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడింది. ఇక ఎప్పటిలాగే ఆర్‌సీబీ కథ ఇంతే అనుకుంటున్న సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఓడించి కమ్‌బ్యాక్ ఇచ్చిన ఆర్‌సీబీ, సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో మళ్లీ ఓడింది...

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 227 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 219 పరుగులకు పరిమితమైంది ఆర్‌సీబీ. చెన్నైపై ఎప్పుడూ 150+ టార్గెట్ చేధించలేకపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆఖరి ఓవర్ వరకూ సీఎస్‌కేని భయపెట్టింది.
Image credit: PTI
చివరి 3 ఓవర్లలో ఆర్‌సీబీ విజయానికి 35 పరుగులే కావాల్సి వచ్చాయి. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 31 పరుగులు బాదాడు రింకూ సింగ్. 3 ఓవర్లలో 35 కొట్టడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. అయితే సీఎస్‌కే బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆర్‌సీబీకి పరుగులు రాకుండా చేశారు..
Image credit: PTI
ఆఖరి ఓవర్‌లో ఆర్‌సీబీ విజయానికి 19 పరుగులు కావాల్సి వచ్చాయి.. 6 బంతుల్లో 3 సిక్సర్లు కొడితే చాలు. అయితే మతీశ పథిరాణా కేవలం 10 పరుగులే ఇవ్వడంతో ఆర్‌సీబీ 8 పరుగుల తేడాతో ఓడింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ 36 బంతుల్లో 76, ఫాఫ్ డుప్లిసిస్ 33 బంతుల్లో 62 పరుగులు చేసి మూడో వికెట్‌కి 126 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించినా విజయం మాత్రం అందించలేకపోయారు..
Image credit: PTI
‘ఓడిపోయినా కూడా మేం ఆడిన విధానం చాలా సంతృప్తినిచ్చింది. మ్యాచ్‌ని ఫినిష్ చేయడానికి ఏమేం చేయాలో అన్నీ పక్కాగా అమలు చేశాం. ఆఖరి 5 ఓవర్లలో దినేశ్ కార్తీక్ ఉండి ఉంటే మ్యాచ్ ఈజీగా ఫినిష్ అయ్యేది, ఇలాంటి మ్యాచులు ఎలా ఫినిష్ చేయాలో అతనికి బాగా తెలుసు..
Image credit: PTI
అయితే చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆఖరి 4 ఓవర్లలో సీఎస్‌కే చేసిన బౌలింగ్ అసాధారణం. మ్యాచ్ మా చేతుల్లోకి వచ్చేసిందని అనుకుంటుండగా వాళ్లు కమ్‌బ్యాక్ ఇచ్చారు. మిడిల్ ఓవర్లలో మా స్పిన్నర్లు పరుగులను నియంత్రించడంలో ఫెయిల్ అయ్యారు...’ అంటూ కామెంట్ చేశాడు ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్..
Image credit: PTI
‘ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ మ్యాచ్‌ని 18 ఓవర్లలోపే ముగిస్తారని అనిపించింది. వాళ్ల పార్టనర్‌షిప్ బ్రేక్ అయ్యాక మళ్లీ మాకు కమ్‌బ్యాక్ చేసే అవకాశం వచ్చింది. మా మళింగా (పథిరాణా) బాగా బౌలింగ్ చేశాడు...’ అంటూ కామెంట్ చేశాడు సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ..