- Home
- Sports
- Cricket
- గంగూలీతో చేతులు కలపని విరాట్ కోహ్లీ! రికీ పాంటింగ్ ప్రయత్నించినా... కళ్లు ఉరిమి చూస్తూ...
గంగూలీతో చేతులు కలపని విరాట్ కోహ్లీ! రికీ పాంటింగ్ ప్రయత్నించినా... కళ్లు ఉరిమి చూస్తూ...
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య ఉన్న వైరం తారా స్థాయికి చేరింది. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్‌సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఇద్దరూ చాలా రోజుల తర్వాత ఎదురుపడ్డారు..

కోహ్లీ మీద కోపంతోనే రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇచ్చామని, సౌరవ్ గంగూలీకీ అతనంటే నచ్చకపోవడం వల్లే విరాట్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించామని స్టింగ్ ఆపరేషన్‌లో మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ చేసిన కామెంట్లు పెను చిచ్చు రేపాయి...
Virat Kohli-Sourav Ganguly
ఈ స్టింగ్ ఆపరేషన్‌కి ముందే బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి సౌరవ్ గంగూలీని తప్పించింది బోర్డు. గంగూలీని తప్పించడానికి విరాట్ కోహ్లీతో అతను వ్యవహరించిన విధానమే కారణమని వార్తలు వచ్చాయి. స్టింగ్ ఆపరేషన్ వైరల్ కావడంతో చేతన్ శర్మ కూడా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి రాజీనామా చేశాడు.
Image credit: PTI
బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న సౌరవ్ గంగూలీ, మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. ఆర్‌సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్‌గా కాకుండా దీన్ని సౌరవ్ గంగూలీ వర్సెస్ విరాట్ కోహ్లీ మ్యాచ్‌గా చూశారు చాలామంది..
kohli ganguly
అనుకున్నట్టుగానే ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ తర్వాత అగ్రెసివ్‌గా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. అంతకుముందు మూడు మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలు చేసినప్పుడు విరాట్ కోహ్లీ ఇలా సెలబ్రేట్ చేసుకోలేదు. ఈ సెలబ్రేషన్స్‌కి కారణం సౌరవ్ గంగూలీ క్రీజులో ఉండడమే..
Virat Kohli Sourav Ganguly
అలాగే బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సౌరవ్ గంగూలీ వైపు ఉరిమి చూసిన విరాట్ కోహ్లీ, మ్యాచ్ ముగిసిన అనంతరం సౌరవ్ గంగూలీతో చేతులు కలపడానికి కూడా ఇష్టపడలేదు. గంగూలీకి ముందే ఉన్న రికీ పాంటింగ్ ఈ విషయాన్ని గమనించాడు..
(PTI Photo/Shailendra Bhojak)(PTI04_02_2023_000356B)
విరాట్ కోహ్లీని ఆపి, సౌరవ్ గంగూలీతో చేతులు కలపాల్సిందిగా కోరాడు. అయితే అప్పటికే అతనితో చేతులు కలపడం ఇష్టం లేదన్నట్టుగా విరాట్ కోహ్లీ పక్కకు వెళ్లిపోవడం, సౌరవ్ గంగూలీ కూడా పట్టించుకోకుండా ముందుకి వెళ్లిపోవడం టీవీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది..
(PTI Photo/Shailendra Bhojak)(PTI04_10_2023_000179B)
అసలు ఇదంతా అనిల్ కుంబ్లే హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో మొదలైందనేది చాలామంది వాదన. హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేని ఆ పదవి నుంచి తప్పిస్తేనే తాను కెప్టెన్‌గా కొనసాగుతానని డిమాండ్ చేశాడు అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ... అప్పటి క్రికెట్ అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్న సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, కోహ్లీకి నచ్చచెప్పాలని ప్రయత్నించినా అతను వినలేదు...
ఓ రకంగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో గెలిస్తే అనిల్ కుంబ్లే హెడ్ కోచ్‌గా కొనసాగుతాడేమోనని కావాలని టీమిండియా ఓడిపోయిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే అప్పుడు భీకరమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీని తప్పించేందుకు సాహసించని గంగూలీ, బీసీసీఐ బాస్‌గా అయ్యాక చక్రం తిప్పాడు. కోహ్లీ పేలవ ఫామ్‌లో మూడేళ్లు సెంచరీ చేయలేకపోవడం కూడా గంగూలీకి బాగా హెల్ప్ అయ్యిందని ఫ్యాన్స్ వాదన..