- Home
- Sports
- Cricket
- వికెట్ పడగానే అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్న విరాట్ కోహ్లీ... ఫైన్ వేసిన రిఫరీ! అన్యాయం అంటూ...
వికెట్ పడగానే అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్న విరాట్ కోహ్లీ... ఫైన్ వేసిన రిఫరీ! అన్యాయం అంటూ...
ఐపీఎల్ 2023 సీజన్‌లో థ్రిల్లింగ్ మ్యాచుల పరంపర కొనసాగుతోంది. అలాగే ఆవేశాలు, అతి వేషాలు వేసి ఆటగాళ్లు, ఫైన్ కట్టడం కూడా కొనసాగుతోంది. మొన్నా మధ్య హెల్మెట్ పడేసి సెలబ్రేట్ చేసుకున్నందుకు ఆవేశ్ ఖాన్ ఫైన్ కట్టగా గ్రౌండ్‌లో గొడవ పడి నితీశ్ రాణా, హృతీక్ షోకీన్ జరిమానా కట్టారు. ఇప్పుడు ఈ లిస్టులో కోహ్లీ కూడా చేరాడు...

Image credit: PTI
బెంగళూరు వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతి ప్రవర్తన కారణంగా విరాట్ కోహ్లీ మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఐపీఎల్ మేనేజ్‌మెంట్. దీనికి కారణం ఓ వికెట్ పడినప్పుడు విరాట్ కోహ్లీ చేసుకున్న సెలబ్రేషన్ అతిగా ఉందని రిఫరీ భావించడమే...
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 3 పరుగులకే అవుట్ అయినా డివాన్ కాన్వే 83, అజింకా రహానే 37, శివమ్ దూబే 52 పరుగులు చేసి అదరగొట్టారు...
గతంలో ఆర్‌సీబీకి ఆడి అట్టర్ ఫ్లాప్ అయిన శివమ్ దూబే, ఆర్‌సీబీ బౌలర్లను చితక్కొడుతూ 27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 52 పరుగులు చేసి వేన్ పార్నెల్ బౌలింగ్‌లో బౌండరీ లైన్ దగ్గర మహ్మద్ సిరాజ్ పట్టిన క్యాచ్‌కి అవుట్ అయ్యాడు. సిరాజ్ కాస్త అటు ఇటు కదిలి ఉంటే, ఆ షాట్ సిక్సర్‌గా మారి ఉండేది...
Image credit: PTI
విరాట్ కోహ్లీ బౌలింగ్ వేయలేదు, అలాగని క్యాచ్ పట్టలేదు. కనీసం ఆర్‌సీబీ కెప్టెన్ కూడా కాదు. అయినా ఆర్‌సీబీలో ఉన్నప్పుడు ఎలా ఆడేవాడో గుర్తు వచ్చిందో ఏమో కానీ మరో సైడ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ.. గట్టిగా అరుస్తూ గాల్లోకి చేతులు ఆడిస్తూ అగ్రెసివ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు...
Image credit: PTI
ఎప్పటిలాగే విరాట్ కోహ్లీ నోటి నుంచి ఎప్పుడూ వచ్చే బూతు పదం కూడా వచ్చింది. ఈ సెలబ్రేషన్స్ ఎవ్వరినీ డిస్టర్బ్ చేయకపోయినా టీవీల్లో కనిపించడంతో అతని మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నాడు రిఫరీ. కోహ్లీ కూడా రిఫరీ ముందు అతిగా ప్రవర్తించానని అంగీకరించాడు..
వికెట్ పడినందుకు సెలబ్రేట్ చేసుకుంటే ఫైన్ వేయడం అన్యాయమని అంటున్నారు అభిమానులు. అరిస్తేనే ఫైన్ వేసేటట్టు అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన తర్వాత ఇలాగే అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. మరి అప్పుడు ఎందుకు ఫైన్ వేయలేదని ప్రశ్నిస్తున్నారు.
Image credit: PTI
ఐపీఎల్ 2023 సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, మొదటి 4 మ్యాచుల్లో 3 హాఫ్ సెంచరీలు బాదాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాటు నుంచి సెంచరీ, కనీసం హాఫ్ సెంచరీ వస్తుందని ఆశించారు ఫ్యాన్స్. అయితే వారి ఆశ నెరవేరలేదు...
Image credit: PTI
4 బంతుల్లో ఓ ఫోర్ బాదిన విరాట్ కోహ్లీ, ఆకాశ్ సింగ్ బౌలింగ్‌లో వికెట్లపైకి ఆడుకుని క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మహిపాల్ లోమ్రోర్ కూడా డకౌట్ కావడంతో 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఫాఫ్ డుప్లిసిస్ 62, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 76 పరుగులు చేసి మూడో వికెట్‌కి 99 పరుగుల భాగస్వామ్యం జోడించారు.
Image credit: PTI
అయితే ఈ ఇద్దరూ అవుటైన తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసి 8 పరుగుల తేడాతో పోరాడి ఓడింది.