- Home
- Sports
- Cricket
- ఆమ్లేట్లు వేసుకోవడానికి రెండు గుడ్లు చాలు! చెప్పి మరీ కొట్టిన సంజూ శాంసన్... క్రిస్ గేల్ తర్వాత...
ఆమ్లేట్లు వేసుకోవడానికి రెండు గుడ్లు చాలు! చెప్పి మరీ కొట్టిన సంజూ శాంసన్... క్రిస్ గేల్ తర్వాత...
ఐపీఎల్ 2022లో పెద్దగా అంచనాలు లేకుండా సీజన్‌ని ప్రారంభించి, ఫైనల్ చేరింది రాజస్థాన్ రాయల్స్. 2008 తర్వాత మొట్టమొదటి సారి రాజస్థాన్ రాయల్స్‌ని ఫైనల్ చేర్చిన ఘనత సంజూ శాంసన్‌కే దక్కుతుంది...

sanju samson
షేన్ వార్న్ తర్వాత షేన్ వాట్సన్, రాహుల్ ద్రావిడ్, స్టీవ్ స్మిత్, అజింకా రహానే వంటి అంతర్జాతీయ దిగ్గజ ఆటగాళ్లు రాజస్థాన్ రాయల్స్‌కి కెప్టెన్లుగా వ్యవహరించినా ఆ టీమ్‌ని ఫైనల్‌కి చేర్చలేకపోయారు. కెప్టెన్‌గా మొదటి సీజన్‌లోనే సంజూకి ఈ క్రెడిట్ దక్కింది...
(PTI Photo)(PTI04_05_2023_000334B)
డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గెలిచి, టేబుల్ టాప్ ప్లేస్‌కి దూసుకెళ్లింది రాజస్థాన్ రాయల్స్. ఈ మ్యాచ్‌కి ముందు నాలుగు మ్యాచుల్లో రెండు సార్లు డకౌట్ అయిన సంజూ శాంసన్, కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు..
sanju samson
‘ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు గుడ్లు (డకౌట్స్) వచ్చాయి. నాకు ఆమ్లేట్లు వేసుకోవడానికి అవి సరిపోతాయి. ఇక పరుగులు చేయాల్సిన సమయం వచ్చింది..’ అంటూ కామెంట్ చేసి నవ్వేశాడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్...
Image credit: PTI
ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున అదరగొడుతున్న ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ కలిసి 2 ఓవర్లు బ్యాటింగ్ చేసినా 1 పరుగే చేశారు. జైస్వాల్ 7 బంతులాడి 1 పరుగు చేసి అవుట్ అయితే, జోస్ బట్లర్ డకౌట్ అయ్యాడు. ఐపీఎల్ కెరీర్‌లో బట్లర్‌కి ఇది రెండో డకౌట్..
(PTI Photo)(PTI04_08_2023_000185B)
32 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 60 పరుగులు చేసిన సంజూ శాంసన్, గుజరాత్ టైటాన్స్ ప్రధాన స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. ఐపీఎల్ చరిత్రలో రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో మూడు అంత కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన రెండో బ్యాటర్ సంజూ శాంసన్..
Sanju and Gayle
ఇంతకుముందు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సర్లు బాదాడు. సంజూ శాంసన్ 3 సిక్సర్లతో గేల్ తర్వాతి స్థానంలో నిలిచాడు. మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ కూడా రషీద్ బౌలింగ్‌లో ఈ ఫీట్ సాధించలేకపోయారు..
Sanju and Hardik
సంజూ శాంసన్ అవుటైనా సిమ్రాన్ హెట్మయర్ 26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 56 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్‌కి ఘన విజయం అందించాడు. రవిచంద్రన్ అశ్విన్ 3 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేసి లక్నోపై ధోనీ చేసిన ఫీట్‌ని రిపీట్ చేశాడు..