- Home
- Sports
- Cricket
- ఒక్క మ్యాచ్‌లో ఫెయిల్ అయినంత మాత్రాన... పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్‌లకు సౌరవ్ గంగూలీ సపోర్ట్...
ఒక్క మ్యాచ్‌లో ఫెయిల్ అయినంత మాత్రాన... పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్‌లకు సౌరవ్ గంగూలీ సపోర్ట్...
ఐపీఎల్ 2023 సీజన్‌లో కెప్టెన్ రిషబ్ పంత్ లేకుండా బరిలో దిగుతోంది ఢిల్లీ క్యాపిటల్స్. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది ఢిల్లీ టీమ్. భానీ ఆశలు పెట్టుకున్న పృథ్వీ షా, సర్ఫారాజ్ ఖాన్ కూడా ఫెయిల్ అయ్యారు...

Image credit: PTI
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ కారణంగా మొదటి 4.2 ఓవర్లలో 41 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. 9 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసిన పృథ్వీ షా, మార్క్ వుడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...
Image: PTI
ఆ తర్వాతి బంతికే మిచెల్ మార్ష్‌ని క్లీన్ బౌల్డ్ చేసి డకౌట్ చేసిన మార్క్ వుడ్, 9 బంతుల్లో ఓ ఫోర్ బాది 4 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్‌ని కూడా పెవిలియన్ చేర్చాడు. ఐపీఎల్‌లో బాగా బ్యాటింగ్ చేసి, వికెట్ కీపింగ్‌తో సెలక్టర్లను ఇంప్రెస్ చేద్దామనుకున్న సర్ఫరాజ్ ఖాన్ ప్లాన్.. తొలి మ్యాచ్‌లో అయితే సక్సెస్ కాలేదు..
(PTI Photo/Vijay Verma)(PTI04_01_2023_000294B)
20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, తొలి మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మార్క్ వుడ్ 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
‘అక్షర్ పటేల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో కూడా అతని బ్యాటింగ్ బాగుంది. తనకి బ్యాటింగ్ ప్రమోషన్ ఇవ్వడం గురించి ఆలోచిస్తున్నాం. మిడిల్ ఆర్డర్‌లో కైల్ మేయర్స్, నికోలస్ పూరన్, ఆండ్రూ రస్సెల్ వంటి వెస్టిండీస్ హిట్టర్లు అదరగొడుతున్నారు..
పృథ్వీ షాకి ఫాస్ట్ బౌలింగ్ వీక్‌నెస్ ఉందనే మాట నిజం కాదు. ప్రతీ ఒక్క బ్యాటర్ కూడా అప్పుడప్పుడూ ఇలా అవుట్ అవుతారు. ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లో పృథ్వీ షా ఇంతకుముందు చాలా పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్ ఎలా ఆడతాడో అందరికీ తెలుసు..
(PTI Photo/Vijay Verma)(PTI04_01_2023_000294B)
ఒక్క బంతిని అంచనా వేయడంలో జరిగిన పొరపాటుతో వికెట్ కోల్పోవాల్సి ఉంటుంది. ఆ ఒక్క బంతి, ఈ ఒక్క మ్యాచ్ క్రికెటర్ల సత్తాని తక్కువ చేయదు. మార్క్ వుడ్ చక్కగా బౌలింగ్ చేశాడు. సర్ఫరాజ్ ఖాన్‌లో చాలా టాలెంట్ ఉంది. రంజీ ట్రోఫీలో అతను ఎలా ఆడతాడో అందరికీ తెలుసు...
Image credit: PTI
ఐపీఎల్‌లో కూడా సర్ఫరాజ్ ఖాన్ పరుగులు చేశాడు. విజయ్ హాజారే ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్ వికెట్ కీపింగ్ చేశాడు. అతను ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. అప్పుడే అతన్ని తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. రిషబ్ పంత్ అందుబాటులో లేడు. అతని ప్లేస్‌లో వికెట్ కీపర్ చేయగల బ్యాటర్ దొరకడం చాలా కష్టం..
Image credit: PTI
లక్నో సూపర్ జెయింట్స్‌కి కెఎల్ రాహుల్, నికోలస్ పూరన్ ఉన్నారు. చెన్నైకి ధోనీ, ఆర్‌సీబీకి దినేశ్ కార్తీక్ ఉన్నారు. మా టీమ్‌కి అలాంటి ఆప్షన్ లేదు. నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు రాహుల్ ద్రావిడ్‌తో వికెట్ కీపింగ్ చేయించా. ఇలా బ్యాటర్, వికెట్ కీపింగ్ చేస్తే కీపింగ్ కోసమే మరో ప్లేయర్‌ని ఆడించాల్సిన అవసరం ఉండదు..’ అంటూ కామెంట్ చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ..