- Home
- Sports
- Cricket
- లేక లేక ఒక్క మ్యాచ్‌లో బాగా ఆడాడు! అంతలోనే గాయంతో... సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మరో షాక్...
లేక లేక ఒక్క మ్యాచ్‌లో బాగా ఆడాడు! అంతలోనే గాయంతో... సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మరో షాక్...
ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఊహించని షాక్ తగిలింది. ఆరెంజ్ ఆర్మీ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, గాయంతో మిగిలిన సీజన్ మొత్తానికి దూరమయ్యాడు....

ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి 6 మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు వాషింగ్టన్ సుందర్. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 3 వికెట్లు తీసి సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. అయితే తొడ కండరాలు పట్టుకోవడంతో మిగిలిన సీజన్ మొత్తానికి దూరమయ్యాడు సుందర్...
‘వాషింగ్టన్ సుందర్, హర్మ్‌స్ట్రింగ్ గాయంతో ఐపీఎల్ 2023 సీజన్‌లో మిగిలిన మ్యాచులకు దూరమయ్యాడు. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా...’ అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది సన్‌రైజర్స్ హైదరాబాద్...
SRH vs DC
ఐపీఎల్ 2023 సీజన్‌లో బౌలింగ్‌లోనే కాదు, బ్యాటింగ్‌లో కూడా పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయాడు వాషింగ్టన్ సుందర్. సీజన్‌లో ఇప్పటిదాకా 60 పరుగులు మాత్రమే చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు చేశాడు వాషింగ్టన్ సుందర్. ఈ సీజన్‌లో ఇదే అతని అత్యధిక స్కోరు...
Dhoni-SRH Palyers
లేక లేక ఫామ్‌లోకి వచ్చి కాస్తో కూస్తో బాగా ఆడుతున్నాడని అనుకునేలోపు గాయంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు వాషింగ్టన్ సుందర్. సుందర్ ఉన్నా, లేకున్నా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి పెద్దగా ఒరిగేదీమీ లేదు. ఎందుకంటే ఎప్పటికే 7 మ్యాచుల్లో రెండే విజయాలు అందుకున్న ఆరెంజ్ ఆర్మీ, 9వ స్థానంలో ఉంది..
Image credit: PTI
ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 7 మ్యాచుల్లో కనీసం 6 మ్యాచులు గెలవాల్సి ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 145 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిల పడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, మిగిలిన మ్యాచుల్లో అత్యద్భుత విజయాలు అందుకుని ప్లేఆఫ్స్ చేరుతుందని ఆశించడం అత్యాశే...
PTI Photo)(PTI04_24_2023_000259B)
ఫస్టాఫ్‌లో ఆఖరికి ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, సెకండ్ హాఫ్‌లో కూడా మళ్లీ ఢిల్లీతోనే ఆడనుంది. ఏప్రిల్ 29న ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది..