MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • Cricket
  • బ్రియాన్ లారా వల్లే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఇన్ని ఓటములు? యువరాజ్ సింగ్‌ని కోచ్‌గా తేవాలంటూ...

బ్రియాన్ లారా వల్లే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఇన్ని ఓటములు? యువరాజ్ సింగ్‌ని కోచ్‌గా తేవాలంటూ...

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్‌లో ఒకటైన సన్‌రైజర్స్ హైదరాబాద్, 2021 నుంచి వరుస పరాజయాలను ఎదుర్కుంటోంది. 2021 సీజన్‌లో ఆఖరి స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్, 2022 సీజన్‌లో 8వ స్థానంలో నిలిచింది. ఈసారి ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి ఎలిమినేట్ అయ్యింది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 18 2023, 01:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

2021 సీజన్‌లో కోచ్‌గా ఉన్న ట్రేవర్ బేలిస్‌ని తప్పించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, టామ్ మూడీకి హెడ్ కోచ్‌గా బాధ్యతలు అప్పగించింది. విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా, బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Moody and Lara

Moody and Lara

లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్, స్పిన్ బౌలింగ్ కోచ్‌గా, సౌతాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్, ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు అందుకున్నారు. 2022 సీజన్‌లో వరుసగా ఐదు విజయాలు అందుకున్న సన‌రైజర్స్ హైదరాబాద్, ఆ తర్వాత వరుస ఓటములతో ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది...

38

దీంతో 2023 సీజన్ ఆరంభానికి ముందు బ్రియాన్ లారాని సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్‌గా నియమించింది టీమ్ మేనేజ్‌మెంట్. అంటే గత మూడు సీజన్లలో ఆరెంజ్ ఆర్మీకి ముగ్గురు కోచ్‌లు మారారు. అయినా ఆశించిన ఫలితం దక్కలేదు...

48

మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, అయిడిన్ మార్క్‌రమ్, హారీ బ్రూక్, అబ్దుల్ సమద్... అందరూ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఒక్క హెన్రీచ్ క్లాసిన్ ఒక్కడే ఈ సీజన్‌లో అంచనాలను మించి రాణించాడు.. 

58
srh

srh

గ్లెన్ ఫిలిప్స్‌లో ఓ మ్యాచ్‌లో ఆడించి, ఆ తర్వాతి మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడని తిరిగి కూర్చోబెట్టింది సన్‌రైజర్స్ హైదరాబాద్. పేరుకి అత్యంత పటిష్టమైన బౌలింగ్ లైనప్, బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమ్ ఆరెంజ్ ఆర్మీయే...

68
Image credit: PTI

Image credit: PTI

భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ఫజల్‌హక్ ఫరూక్, కార్తీక్ త్యాగి, మయాంక్ మార్కండే, అదిల్ రషీద్ ఇలా వరల్డ్ క్లాస్ బౌలర్లు, సన్‌రైజర్స్‌లో పుషల్కంగా ఉన్నారు. అయితే వీరి నుంచి మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌లు అయితే రావడం లేదు. నట్టూతో పాటు మిగిలిన బౌలర్లు అందరూ ధారాళంగా పరుగులు ఇస్తున్నారు..

78

రూ.13 కోట్లు పెట్టి కొన్న హారీ బ్రూక్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు కూడా ఈ సీజన్‌లో ఫ్లాప్ అయ్యారు. క్లాసిన్ ఒక్కడే కడవరకూ పోరాడుతూ ఆశలు రేపుతున్నా, సరైన సపోర్ట్ లేకపోవడంతో విజయాలు అందించలేకపోతున్నాడు..
 

88
Image Credit: Getty Images

Image Credit: Getty Images

దీంతో బ్రియాన్ లారాని హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించి, యువరాజ్ సింగ్‌కి సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు ఇవ్వాలని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. యువీ కోచ్‌గా వస్తే, దేశవాళీ కుర్రాళ్ల నుంచి అదిరిపోయే పర్పామెన్స్ రాబడతాడని అంటున్నారు హైదరాబాద్ అభిమానులు..

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved