- Home
- Sports
- Cricket
- ఐపీఎల్‌కి డుమ్మా కొట్టి చాహాల్ భార్యతో పార్టీలకు వెళ్తున్న శ్రేయాస్ అయ్యర్... ధనశ్రీ వర్మని తిడుతూ...
ఐపీఎల్‌కి డుమ్మా కొట్టి చాహాల్ భార్యతో పార్టీలకు వెళ్తున్న శ్రేయాస్ అయ్యర్... ధనశ్రీ వర్మని తిడుతూ...
వెన్నునొప్పితో ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు శ్రేయాస్ అయ్యర్. ఐపీఎల్‌తో పాటు ఆ తర్వాత జరిగే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కూడా అయ్యర్ ఆడడం అనుమానంగానే మారింది. ఐపీఎల్ ఆడకపోయినా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాడు శ్రేయాస్ అయ్యర్..

(PTI Photo)(PTI11_17_2022_000006B)
ఫాస్ట్ బౌలర్లకు బ్యాక్ పెయిన్ అంటే అనుకోవచ్చు కానీ బ్యాటర్ ఇలాంటి గాయంతో క్రికెట్‌కి దూరం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది... సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి వంటి మాజీ క్రికెటర్లు కూడా బ్యాటర్‌కి బ్యాక్ పెయిన్ రావడం ఏంటని అనుమానాలు వ్యక్తం చేశారు...
Shreyas Iyer
అయితే తాజాగా యజ్వేంద్ర చాహాల్ భార్య ధనశ్రీ వర్మతో కలిసి ఓ ఇఫ్తార్ పార్టీకి హాజరయ్యాడు శ్రేయాస్ అయ్యర్. శ్రేయాస్ అయ్యర్ గాయంతో టీమ్ నుంచి తప్పుకున్నప్పుడే ధనశ్రీ వర్మపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆమెపై డ్యాన్సులు చేయడంపై, రీల్స్ పెట్టడంపై పెట్టిన శ్రద్ధ.. ఫిట్‌నెస్ పెట్టి ఉంటే ఈ సమస్యలు వచ్చి ఉండేవి కావని ట్రోల్ చేశారు ఫ్యాన్స్...
ఆ తర్వాత ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో ఏ పోస్టు చేసినా శ్రేయాస్ అయ్యర్ ఎక్కడ అంటూ కామెంట్లు కనిపించేవి. సోషల్ మీడియా జనాల అనుమానాలను నిజం చేస్తూ, క్రికెట్‌కి దూరమైన శ్రేయాస్ అయ్యర్.. ధనశ్రీ వర్మతో కలిసి ఇప్తార్ పార్టీలో సందడి చేశాడు...
అయ్యర్ వెన్నెముకకి సర్జరీ జరగబోతుందని వార్తలు వచ్చాయి. అతను జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లోనో, లేక ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నాడని అభిమానులు భావించారు. అయితే అతను ధనశ్రీ వర్మ ఇన్‌స్టా స్టోరీల్లో ప్రత్యక్షం కావడంతో టీమిండియా ఫ్యాన్స్ బీభత్సంగా చివాట్లు పెడుతున్నారు..
టీమ్‌లో ప్లేస్ కోసం రాహుల్ త్రిపాఠి, సంజూ శాంసన్, పృథ్వీ షా వంటి ఎందరో ప్లేయర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. వారందరినీ కాదని శ్రేయాస్ అయ్యర్‌కి వన్డే, టెస్టుల్లో అవకాశాలు కల్పించారు టీమిండియా సెలక్టర్లు. వన్డేల్లో నిలకడైన ప్రదర్శన చూపించిన శ్రేయాస్ అయ్యర్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో కీలకంగా మారతారని భావించారు..
Shreyas Iyer
అలాగే అజింకా రహానే స్థానంలో సెటిల్ అయిన శ్రేయాస్ అయ్యర్, టెస్టుల్లోనూ టీమ్‌కి కీ ప్లేయర్‌గా మారాడు. టీమిండియాకి ఫ్యూచర్ కెప్టెన్ అవుతాడనుకున్న శ్రేయాస్ అయ్యర్, ఇలా రీల్స్ కోసం, ఫన్ కోసం క్రికెట్ కెరీర్‌ని సందిగ్ధంలో పడేసుకోవడం ఏంటని నిలదీస్తున్నారు నెటిజన్లు..
మరికొందరైతే శ్రేయాస్ అయ్యర్ కారణంగా ధనశ్రీ వర్మ, యజ్వేంద్ర చాహాల్ సంసారంలో చిచ్చు వచ్చిందని, వీళ్లిద్దరూ విడివిడిగా ఉంటున్నారని, త్వరలో విడాకులు కూడా తీసుకోబోతున్నారని ప్రచారం చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే చాహాల్ స్పందించాల్సిందే..