- Home
- Sports
- Cricket
- సంజూ శాంసన్‌కి అంత పొగరు పనికి రాదు! నేనిలాగే ఆడతానంటే... శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు...
సంజూ శాంసన్‌కి అంత పొగరు పనికి రాదు! నేనిలాగే ఆడతానంటే... శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు...
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఫైనల్ చేరిన రాజస్థాన్ రాయల్స్, 2023 సీజన్‌లో 14 మ్యాచుల్లో 7 విజయాలతో ఐదో స్థానంలో నిలిచింది. ఐపీఎల్ 2023 సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన సంజూ శాంసన్, 362 పరుగులు చేశాడు...
- FB
- TW
- Linkdin
Follow Us
)
Sanju Samson
మొదటి రెండు మ్యాచుల్లో 55, 42 పరుగులు చేసి ఆకట్టుకున్న సంజూ శాంసన్, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో డకౌట్లు అయ్యాడు. ఈ సీజన్‌లో 3 హాఫ్ సెంచరీలు చేసిన సంజూ శాంసన్, గత ఏడాది కంటే మెరుగైన యావరేజ్‌తో పరుగులు చేసి ఫ్యాన్స్‌ని మాత్రం మెప్పించలేకపోయాడు..
Sreesanth-Sanju
‘నేను సంజూ శాంసన్‌ని బాగా సపోర్ట్ చేస్తా, ఎందుకంటే అతను నా కెప్టెన్సీలో అండర్14 టీమ్‌లో ఆడాడు. గత నాలుగైదు ఏళ్లుగా క్రికెటర్‌గా సంజూ శాంసన్‌ని గమనిస్తూ వస్తున్నా...
ఐపీఎల్‌లో ఆడితే మాత్రమే సరిపోదు, దేశవాళీ టోర్నీలు, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కూడా బాగా ఆడాలని నేను చెబుతూ వస్తున్నా. నిలకడైన ప్రదర్శన ఇచ్చి ఉంటే ఇప్పటికి అతను టీమిండియాకి కీ ప్లేయర్ అయ్యేవాడు...
Sanju and Buttler
సంజూ శాంసన్ కంటే వెనక వచ్చిన ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ ఇద్దరూ కూడా అతని కంటే ముందున్నారు. పంత్ ఇప్పుడు టీమ్‌లో లేకపోయినా కోలుకున్నాక కమ్‌బ్యాక్ ఇస్తాడు. నాకు తెలిసి రిషబ్ పంత్ మరో ఆరేడు నెలల్లో టీమిండియాలోకి మళ్లీ వచ్చేస్తాడు...
ఈ ఐపీఎల్‌లో సంజూ శాంసన్ రెండు మూడు మ్యాచుల్లో ఉట్టిగానే అవుటైపోయాడు. ఓ మ్యాచ్‌లో సంజూ శాంసన్ డకౌట్ అయిన తర్వాత సునీల్ గవాస్కర్ సర్, అతనికి ఎంతో విలువైన సలహా ఇచ్చారు.
‘‘నువ్వు కనీసం 10 బాల్స్ ఆడుకో. వికెట్‌కి అర్థం చేసుకో. నీలో చాలా టాలెంట్ ఉందని అందరికీ తెలుసు.. 12 బంతుల్లో పరుగులేమీ చేయకపోయినా, 25 బంతుల్లో 50 పరుగులు చేయగలవు...’’ అని గవాస్కర్ సర్, సంజూతో అన్నాడు. దానికి సంజూ నేరుగా... ‘లేదు, అలా ఆడడం నా స్టైల్ కాదు’ అని చెప్పేశాడు. ఆ మాటలను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా...
Sanju Samson
ఓ క్రికెటర్‌గా ఎదగాలంటే సీనియర్ల మాటలకు విలువ ఇవ్వాలి, వారి సలహాలు సాదరంగా స్వీకరించాలి. వాటిని అనుసరించాలా? వద్దా? అనేది తర్వాత..
కనీసం చెప్పేటప్పుడైనా శ్రద్ధగా విని, గౌరవపూర్వకంగా సరేనని అనాలి... కానీ సంజూ శాంసన్ పొగరుగా సమాధానం చెప్పడం విని షాక్ అయ్యా. అతని మైడ్‌సెట్ మారితే కానీ, సక్సెస్ కాలేడు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్..