MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • గ్రీన్, శుబ్‌మన్ గిల్... ముంబై కోసం బాగా బ్యాటింగ్ చేశారు! టెండూల్కర్ ట్వీట్... కాబోయే అల్లుడి ఆటకు..

గ్రీన్, శుబ్‌మన్ గిల్... ముంబై కోసం బాగా బ్యాటింగ్ చేశారు! టెండూల్కర్ ట్వీట్... కాబోయే అల్లుడి ఆటకు..

ఐపీఎల్ 2023 సీజన్‌‌ని వరుస పరాజయాలతో ప్రారంభించిన ముంబై ఇండియన్స్, ఊహించని విధంగా ప్లేఆఫ్స్ చేరింది. గత సీజన్‌లో ఆఖరి స్థానంలో నిలిచిన రోహిత్ టీమ్, ఈ సారి ప్లేఆఫ్స్ చేరిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది..

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 22 2023, 12:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Image credit: PTI

Image credit: PTI

జస్ప్రిత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్ లేకపోయినా ట్రెంట్ బౌల్ట్, క్వింటన్ డి కాక్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వేరే టీమ్స్ తరుపున ఆడుతున్నా... కిరన్ పోలార్డ, ఐపీఎల్ నుంచి తప్పుకున్నా.. ముంబై ఇండియన్స్ బేస్ ప్రైజ్ కుర్రాళ్లతో ప్లేఆఫ్స్‌కి దూసుకొచ్చింది..
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కామెరూన్ గ్రీన్ సెంచరీతో చెలరేగిపోయాడు. దీంతో 201 పరుగుల భారీ లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలో ఛేదించి అవతల పడేసింది ముంబై ఇండియన్స్...

38
Image credit: PTI

Image credit: PTI

ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ఆర్‌సీబీపై 6 వికెట్ల తేడాతో విజయం అందుకోవడంతో 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్, రెండు సీజన్ల గ్యాప్ తర్వాత ప్లేఆఫ్స్ ఆడనుంది..

48
(PTI Photo/Shailendra Bhojak)(PTI05_21_2023_000439B)

(PTI Photo/Shailendra Bhojak)(PTI05_21_2023_000439B)

ఆర్‌సీబీపై 52 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 104 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు ముంబై ఇండియన్స్ ఐకాన్ సచిన్ టెండూల్కర్...

58
Virat Kohli-Shubman Gill

Virat Kohli-Shubman Gill

‘కామెరూన్ గ్రీన్, శుబ్‌మన్ గిల్ ఇద్దరూ ముంబై ఇండియన్స్ కూడా చక్కగా బ్యాటింగ్ చేశారు...  (ఫన్నీ ఎమోజీ) విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదాడు. ఒక్కొక్కరికీ ఒక్కో పద్ధతి ఉంటుంది, ఎవరి క్లాస్ వారిదే.. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌లో చేరడం సంతోషంగా ఉంది. గో ముంబై...’ అంటూ ట్వీట్ చేశాడు సచిన్ టెండూల్కర్...

68

సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్, శుబ్‌మన్ గిల్ మధ్య సీక్రెట్ ప్రేమాయణం సాగుతోందని ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ఇద్దరూ సీక్రెట్‌లో హాలీడేస్‌కి వెళ్లినట్టు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోల ద్వారా తేలింది...

78

దీంతో ముంబై ఇండియన్స్‌ని ప్లేఆఫ్స్ చేర్చి శుబ్‌మన్ గిల్, మామ సచిన్ టెండూల్కర్‌ని ఫుల్లుగా ఇంప్రెస్ చేసేశాడని, త్వరలో ఈ గిల్లుడు, మాస్టర్‌కి అల్లుడు కావడం గ్యారెంటీ అని సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి..
 

88

అయితే సారా టెండూల్కర్‌తో బ్రేకప్ చేసుకున్న శుబ్‌మన్ గిల్, సారా ఆలీ ఖాన్‌తో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నాడు. ఈ ఇద్దరూ డేటింగ్‌లో కూడా ఉన్నారని టాక్. దీంతో శుబ్‌మన్ గిల్, సైఫ్ ఆలీ ఖాన్ అల్లుడిగా మారతాడా, సచిన్‌కి అల్లుడిగా వెళ్తాడా? అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది.. 

About the Author

CR
Chinthakindhi Ramu
శుభ్‌మన్ గిల్

Latest Videos
Recommended Stories
Recommended image1
KKR vs GT: ఉతికి ఆరేసిన కేకేఆర్‌.. ఈడెన్ గార్డెన్స్‌లో పరుగుల తుఫాన్
Recommended image2
IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ దెబ్బ.. పంత్, అక్షర్, రహానేలకు దిమ్మతిరిగే షాక్ !
Recommended image3
Tilak Varma: అవమానించిన చోటే గెలిచాడు.. ఇది కదా తెలుగోడి రివేంజ్ అంటే! అర్ష్‌దీప్‌ను చితక్కొట్టిన తిలక్ వర్మ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved