- Home
- Sports
- Cricket
- పంత్ లేడు, బుమ్రా రాడు, రాహుల్, అయ్యర్ కూడా పాయే! ఫామ్‌లో లేని రోహిత్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కి ముందు...
పంత్ లేడు, బుమ్రా రాడు, రాహుల్, అయ్యర్ కూడా పాయే! ఫామ్‌లో లేని రోహిత్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కి ముందు...
ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన తర్వాత ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది టీమిండియా. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియా టెస్టు ప్లేయర్లు ప్రాక్టీస్ మొదలెట్టేశారు. అయితే టీమిండియా ప్లేయర్లు మాత్రం ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నారు...

గత డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా వంటి స్టార్ ప్లేయర్లతో బరిలో దిగిన టీమిండియా, న్యూజిలాండ్ చేతుల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021 సీజన్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచిన టీమిండియా, ఫైనల్‌లో అలాంటి ప్రదర్శన ఇవ్వలేకపోయింది..
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌కి ముందు కూడా టీమిండియాకి ఏదీ కలిసి రావడం లేదు. గత ఏడాది చివర్లో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్, మరో ఏడాది పాటు క్రికెట్‌కి దూరంగా ఉండబోతున్నాడు..
Jasprit Bumrah
గత ఏడాది ఆగస్టు నుంచి వెన్నునొప్పితో బాధపడుతున్న జస్ప్రిత్ బుమ్రా కూడా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి దూరమయ్యాడు. రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా వంటి మ్యాచ్ విన్నర్లు దూరం కావడం టీమిండియాకి గట్టి ఎదురుదెబ్బే..
ఐపీఎల్ 2023 సీజన్‌లో గాయపడిన కెఎల్ రాహుల్ కూడా టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి దూరమయ్యాడు. రాహుల్ పెద్దగా ఫామ్‌లో లేకపోయినా ఇంగ్లాండ్‌లో అతనికి మంచి రికార్డు ఉంది. 2021 ఇంగ్లాండ్ టూర్‌లో సెంచరీ చేసి, టెస్టుల్లో వైస్ కెప్టెన్సీ కొట్టేసిన రాహుల్, ఫైనల్‌లో కీ ప్లేయర్‌గా మారతాడని భావించింది బీసీసీఐ...
Image credit: Getty
వీరితో పాటు శ్రేయాస్ అయ్యర్ కూడా గాయంతో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి దూరమయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ గాయం గురించి ఎలాంటి అప్‌డేట్ రావడం లేదు..
Rohit Sharma Ducks
ఒకటికి నలుగురు కీ ప్లేయర్లు దూరం కావడం మాత్రమే కాదు, కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ కూడా టీమిండియాని తీవ్రంగా కలవరబెడుతున్న విషయం...
ఐపీఎల్ 2023 సీజన్‌లో 9 మ్యాచుల్లో 184 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ఒకే ఒక్క హాఫ్ సెంచరీ బాదాడు. ఈ సీజన్‌లో రోహిత్ యావరేజ్ 20.44 మాత్రమే. వరుసగా రెండు మ్యాచుల్లో డకౌట్ అయిన రోహిత్ శర్మ, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి పూర్తి ఫిట్‌నెస్‌తో అందుబాటులో ఉంటాడా? అనేది చాలా మంది అనుమానం...
KS Bharat
ఫైనల్‌కి వికెట్ కీపర్‌గా ఎంపికైన శ్రీకర్ భరత్, ఐపీఎల్ 2023 సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. గుజరాత్ టైటాన్స్‌లో సీనియర్ వృద్ధిమాన్ సాహాని కొనసాగిస్తున్న హార్ధిక్ పాండ్యా, శ్రీకర్ భరత్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెడుతున్నారు. నేరుగా ఫైనల్‌గా ఆడాల్సి వస్తే, భరత్ నుంచి ఎలాంటి పర్ఫామెన్స్ వస్తుందో చెప్పడం కష్టం..
వీరితో పాటు ఫైనల్‌కి ఎంపికైన జయ్‌దేవ్ ఉనద్కట్ కూడా ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆర్‌సీబీతో మ్యాచ్‌కి ముందు బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. అతను ఫైనల్‌కి అందుబాటులో ఉండడం అనుమానంగానే మారింది..
విరాట్ కోహ్లీ, అజింకా రహానే ఐపీఎల్‌లో బాగా ఆడుతుంటే ఛతేశ్వర్ పూజారా కౌంటీల్లో సెంచరీల మోత మోగిస్తుండడం టీమిండియాకి కలిసొచ్చే విషయం. ఫైనల్‌కి ఎంపికైన ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ అదరగొడుతూ పర్పుల్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నారు.
Ajinkya Rahane
అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ కూడా ఐపీఎల్ 2023 సీజన్‌లో మంచి ప్రదర్శన ఇస్తున్నారు. అయితే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ఎంపికైన ఉమేశ్ యాదవ్ కూడా గాయంతో బాధపడుతున్నాడు. ఇన్ని ఇబ్బందుల మధ్య టీమిండియా, ఆస్ట్రేలియాని ఎలా ఎదుర్కుంటుందనేది ఆసక్తికరంగా మారింది.