- Home
- Sports
- Cricket
- మయాంక్, పూరన్, లూకీ ఫర్గూసన్, విలియంసన్, బ్రావో, పోలార్డ్... ఐపీఎల్ 2023లో రిటైన్ కాని స్టార్లు వీరే...
మయాంక్, పూరన్, లూకీ ఫర్గూసన్, విలియంసన్, బ్రావో, పోలార్డ్... ఐపీఎల్ 2023లో రిటైన్ కాని స్టార్లు వీరే...
ఐపీఎల్ 2023 రిటెన్షన్ గడువు పూర్తయ్యింది. 10 ఫ్రాంఛైజీలు అట్టి పెట్టుకున్న ప్లేయర్లను, 2023 మినీ వేలానికి విడుదల చేసిన ప్లేయర్ల లిస్టును ఖరారు చేశాయి. 2022 మెగా వేలంలో భారీ ధర దక్కించుకున్న ప్లేయర్లు చాలామంది, 2023 మినీ వేలంలో పాల్గొనబోతున్నారు. 2022 సీజన్‌లో కెప్టెన్లుగా వ్యవహరించినవారు కూడా రిటెన్షన్‌లో చోటు దక్కించుకోకపోవడం విశేషం...

మయాంక్ అగర్వాల్: 2018 నుంచి పంజాబ్ కింగ్స్ జట్టులో కీలక సభ్యుడిగా ఉంటూ వచ్చిన మయాంక్ అగర్వాల్, 2022 సీజన్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. రూ.12 కోట్లకు మయాంక్ అగర్వాల్‌ని అట్టిపెట్టుకున్న పంజాబ్, కెప్టెన్సీ భారంతో అతను సరిగ్గా ఆడలేకపోవడంతో 2023 మినీ వేలానికి విడుదల చేసింది...
కేన్ విలియంసన్: ఐపీఎల్ 2022 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.14 కోట్లతో కేన్ విలియంసన్‌ని రిటైన్ చేసుకుంది. అయితే 2022లో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ఫెయిల్ అయిన కేన్ విలియంసన్‌ని వేలానికి విడుదల చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. కేన్ మామ బయటికి వెళ్లడంతో కొత్త కెప్టెన్ వేటలో పడింది ఆరెంజ్ ఆర్మీ...
నికోలస్ పూరన్: ఐపీఎల్ 2022 మెగా వేలంలో వెస్టిండీస్ వైట్ బాల్ కెప్టెన్ నికోలస్ పూరన్‌ని రూ.10.75 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే అతను సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో పూరన్‌ని కూడా వేలానికి వదిలేసింది ఆరెంజ్ ఆర్మీ...
ఆలెక్స్ హేల్స్: టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు అలెక్స్ హేల్స్. 6 మ్యాచుల్లో 147.22 స్ట్రైయిక్ రేటుతో 212 పరుగులు చేశాడు. అయితే అలెక్స్ హేల్స్‌ని అట్టిపెట్టుకోవడానికి ఇష్టపడలేదు కేకేఆర్...
లూకీ ఫర్గూసన్: ఐపీఎల్ 2021 సీజన్‌లో కేకేఆర్ ఫైనల్ చేరడానికి లూకీ ఫర్గూసన్ కూడా ఓ కారణం. అందుకే అతన్ని రూ.10 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్. అయితే లూకీ ఫర్గూసన్ 13 మ్యాచుల్లో 12 వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో అతన్ని మినీ వేలానికి వదలేసింది ఐపీఎల్ 2022 ఛాంపియన్ టీమ్...
డ్వేన్ బ్రావో: చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో, 2023 మినీ వేలంలో పాల్గొనబోతున్నాడు. 2022 మెగా వేలంలో రూ.4.4 కోట్లకు బ్రావోని దక్కించుకున్న సీఎస్‌కే, అతన్ని అట్టి పెట్టుకోవడానికి ఇష్టపడలేదు..
ప్యాట్ కమ్మిన్స్: ఐపీఎల్ 2020 వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్లలో ప్యాట్ కమ్మిన్స్ ఒకడు. 2020 వేలంలో రూ.15.5 కోట్లకు కమ్మిన్స్‌ని కొన్న కేకేఆర్, 2022 మెగా వేలంలో అతన్ని రూ.7.25 కోట్లకు తిరిగి దక్కించుకుంది. బ్యాటుతో ఓ మ్యాచ్‌ని గెలిపించిన కమ్మిన్స్‌ని 2023 మినీ వేలానికి విడుదల చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్.
Image credit: PTI
శార్దూల్ ఠాకూర్: ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.10 కోట్ల 75 లక్షల భారీ ధర దక్కించుకున్న శార్దూల్ ఠాకూర్‌ని వదిలించుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఐపీఎల్ 2021 సీజన్‌లో 21 వికెట్లు తీసి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన శార్దూల్ ఠాకూర్.. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున 15 వికెట్లు తీసినా, 9.79 ఎకానమీతో పరుగులు సమర్పించాడు. బ్యాటుతో 10 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌కి వచ్చిన శార్దూల్ ఠాకూర్, 120 పరుగులు చేశాడు..
Pollard
12 సీజన్లుగా ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతున్న కిరన్ పోలార్డ్‌ని ఆ జట్టు రిటైన్ చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి విడుదల చేసింది. పోలార్డ్‌ని ముంబై ఇండియన్స్ విడుదల చేయగానే అతను ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. దీంతో కిరన్ పోలార్డ్‌ని బ్యాటింగ్ కోచ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది ముంబై ఇండియన్స్. నాటకీయ పరిణామల మధ్య పోలార్డ్ మళ్లీ ముంబైలోకే వచ్చాడు...
వీరితో పాటు జేమ్స్ నీశమ్, డార్ల్ మిచెల్, రస్సీ వాన్ దేర్ దుస్సేన్, నాథన్ కౌంటర్‌నైల్, ఆడమ్ మిల్నే, ఆండ్రూ టై, ఎవిన్ లూయిస్ వంటి ప్లేయర్లు కూడా రిటెన్షన్ దక్కించుకోలేకపోయారు. ఈ స్టార్ ఆటగాళ్లు అంతా ఐపీఎల్ 2023 మినీ వేలంలో పాల్గొనబోతున్నారు..