MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • Cricket
  • వృద్ధిమాన్ సాహాని కాదని ఇషాన్ కిషన్‌ని సెలక్ట్ చేయడానికి కారణం ఇదేనా... కోహ్లీ తర్వాత అతన్నే...

వృద్ధిమాన్ సాహాని కాదని ఇషాన్ కిషన్‌ని సెలక్ట్ చేయడానికి కారణం ఇదేనా... కోహ్లీ తర్వాత అతన్నే...

ఐపీఎల్‌లో బాగా ఆడితే చాలు, టీమిండియాకి సెలక్ట్ అయిపోవచ్చు. ఇప్పుడు దేశవాళీ టోర్నీల్లో ప్రదర్శన, టీమిండియా సెలక్షన్‌కి ఏ మాత్రం కొలమానం కాదు. దేశవాళీ టోర్నీల్లో దుమ్మురేపుతూ రికార్డుల మోత మోగిస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌ని, సెలక్టర్లు మరోసారి పట్టించుకోకపోవడంతో ఐపీఎల్ ఒక్కటే మెయిన్‌గా మారిందని తేలిపోయింది.. 

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 09 2023, 05:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
PTI Photo) (PTI04_27_2023_000372B)

PTI Photo) (PTI04_27_2023_000372B)

ఐపీఎల్ 2023 సీజన్‌లో అనుకోకుండా తుది జట్టులోకి వచ్చిన అజింకా రహానే, చెన్నై సూపర్ కింగ్స్‌కి మ్యాచ్ విన్నర్‌గా మారాడు. రెండు సూపర్ ఫాస్ట్ హాఫ్ సెంచరీలతో, టెస్టు టీమ్‌లోకి ఘనంగా రీఎంట్రీ ఇచ్చాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Wriddhiman Saha-Ishan Kishan

Wriddhiman Saha-Ishan Kishan

అయితే ఐపీఎల్ 2023 సీజన్‌లో బాగా ఆడుతున్న వృద్ధిమాన్ సాహాని కూడా సెలక్టర్లు పట్టించుకోకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. 11 మ్యాచుల్లో 27.3 యావరేజ్‌తో 137.9 స్ట్రైయిక్ రేటుతో 273 పరుగులు చేశాడు వృద్ధిమాన్ సాహా...

39

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 43 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహా, గుజరాత్ టైటాన్స్ 227 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్‌పై విరాట్ కోహ్లీ కూడా స్పందించడం హాట్ టాపిక్ అయ్యింది..

49
PTI Photo) (PTI05_07_2023_000160B)

PTI Photo) (PTI05_07_2023_000160B)

ఈ ఇన్నింగ్స్ తర్వాత వృద్ధిమాన్ సాహాకి మరోసారి భారత టెస్టు టీమ్‌లో ఛాన్స్ రావొచ్చని భావించారంతా. అయితే సెలక్టర్లు మాత్రం సాహాని పట్టించుకోలేదు. దీనికి కారణం న్యూజిలాండ్‌తో సిరీస్ తర్వాత వృద్ధిమాన్ సాహా, ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే, ఇషాంత్ శర్మలను పక్కనబట్టేసింది బీసీసీఐ...

59
PTI Photo/Kunal Patil)(PTI03_31_2023_000264B)

PTI Photo/Kunal Patil)(PTI03_31_2023_000264B)

వీరిలో ఛతేశ్వర్ పూజారా, కౌంటీ ఛాంపియన్‌షిప్ 2022లో 1000+ పరుగులు చేసి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వగా, అజింకా రహానే రీఎంట్రీకి ఐపీఎల్ 2023 సీజన్ పర్ఫామెన్స్‌తో పాటు రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో అతను నమోదు చేసిన గణాంకాలు కూడా ఓ కారణం..

69

వృద్ధిమాన్ సాహా, వ్యక్తిగత కారణాలతో రంజీ ట్రోఫీలో ఆడడానికి ఇష్టపడలేదు. ఈ సమయంలో బెంగాల్ క్రికెట్ బోర్డు పెద్దలకీ, వృద్ధిమాన్ సాహాకి మధ్య చిన్నపాటి గొడవలు కూడా జరిగాయి. అదీకాకుండా శ్రీలంకతో సిరీస్ సమయంలో బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీపై నోరు జారాడు సాహా...

79
Wriddhiman Saha

Wriddhiman Saha

టీమ్‌లో తనకి ఎప్పుడూ చోటు ఉంటుందని మాట ఇచ్చిన బీసీసీఐ (మాజీ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఇప్పుడు మాట తప్పారని, న్యూజిలాండ్‌తో సిరీస్‌లో హాఫ్ సెంచరీ చేసినా కూడా తనని ఎందుకు తప్పించారో తెలియడం లేదని కామెంట్లు చేశాడు వృద్ధిమాన్ సాహా...

89
Wriddhiman Saha

Wriddhiman Saha

టీమ్‌లో చోటు లేకపోయేసరికి బీసీసీఐపై, సెలక్టర్లపై సాహా చేసిన కామెంట్లను సీరియస్‌గా తీసుకున్న బోర్డు పెద్దలు, అతనికి భారత జట్టులో తిరిగి చోటు ఇవ్వకూడదని గట్టిగా ఫిక్స్ అయినట్టు సమాచారం.

99

కెఎల్ రాహుల్ గాయం తర్వాత రిప్లేస్‌మెంట్ ప్లేయర్ ఎంపిక కోసం జరిగిన మీటింగ్‌లో వృద్ధిమాన్ సాహా పేరు చర్చకు కూడా రాలేదని ఓ బీసీసీఐ అధికారి తెలియచేశాడు... అంటే సాహాని తిరిగి సెలక్ట్ చేయాలనే ఆలోచన కూడా బోర్డు సభ్యులకు లేదని తెలుస్తోంది.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved