- Home
- Sports
- Cricket
- డూ ఆర్ డై మ్యాచ్‌లోనూ విరాట్ కోహ్లీ వీరోచిత సెంచరీ... ఆర్‌సీబీని ముంచిన మిడిల్ ఆర్డర్...
డూ ఆర్ డై మ్యాచ్‌లోనూ విరాట్ కోహ్లీ వీరోచిత సెంచరీ... ఆర్‌సీబీని ముంచిన మిడిల్ ఆర్డర్...
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ. క్రిస్ గేల్ చేసిన 6 సెంచరీల రికార్డు బ్రేక్ చేస్తూ, 2023 సీజన్‌లో వరుసగా రెండో సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ..

Virat Kohli
ఐపీఎల్ 2023 సీజన్ ప్లేఆఫ్స్‌కి చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ ఆర్‌సీబీ మిడిల్ ఆర్డర్ మారలేదు. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ బ్యాటింగ్ భారాన్ని మోసిన ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ త్వరగా అవుట్ అయినా విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్‌తో ఒంటరి పోరాటం చేయడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేయగలిగింది...
220+ పరుగులు చేసినా కాపాడుకోవడం కష్టంగా ఉండే చిన్నస్వామి స్టేడియంలో ఈ స్కోరు.. అదీ శుబ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా వంటి హిట్టర్లు ఉన్న గుజరాత్ టైటాన్స్‌కి ఏ మాత్రం సరిపోతుందో చూడాలి...
Image credit: PTI
తొలి వికెట్‌కి ఫాఫ్ డుప్లిసిస్, విరాట్ కోహ్లీ కలిసి 67 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఒకే సీజన్‌లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఫాఫ్ - కోహ్లీ జోడి. ఇంతకుముందు 2016 సీజన్‌లో కోహ్లీ - ఏబీడీ కలిసి 939 పరుగులు చేయగా ఆ రికార్డుని ఫాఫ్ - కోహ్లీ బ్రేక్ చేశారు...
19 బంతుల్లో 5 ఫోర్లతో 28 పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్, నూర్ అహ్మద్ బౌలింగ్‌లో రాహుల్ తెవాటియాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 5 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ని రషీద్ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు...
Image credit: PTI
3 బంతుల్లో 1 పరుగు చేసిన మహిపాల్ లోమ్రోర్, నూర్ అహ్మద్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 67/0 స్కోరుతో ఉన్న ఆర్‌సీబీ, 2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 85/3కి చేరింది. 16 బంతుల్లో 5 ఫోర్లతో 26 పరుగులు చేసిన మైకేల్ బ్రాస్‌వెల్, షమీ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
Image credit: PTI
దినేశ్ కార్తీక్, యశ్ దయాల్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో దూకుడు తగ్గించకుండా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు విరాట్ కోహ్లీ. 35 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ, 60 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు.
Image credit: PTI
2020 సీజన్‌లో శిఖర్ ధావన్, 2022 సీజన్‌లో జోస్ బట్లర్ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో రెండు సెంచరీలు చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, ఐపీఎల్‌లో ఏడో సెంచరీతో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా చరిత్ర నెలకొల్పాడు..
అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుత తరంలో 75 సెంచరీలు చేసి, అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ, ఐపీఎల్‌లోనూ అత్యధిక సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్‌గా, అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డులు నెలకొల్పడం విశేషం.
విరాట్ కోహ్లీ 61 బంతుల్లో 13 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 101 పరుగులు చేయగా అనుజ్ రావత్ 15 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేసి ఆర్‌సీబీకి 197 పరుగుల స్కోరు అందించారు. ఈ ఇద్దరూ 34 బంతుల్లో 64 పరుగుల భాగస్వామ్యం జోడించారు.