- Home
- Sports
- Cricket
- నా వల్లే రాహుల్ ద్రావిడ్‌కి అంత కోపం వచ్చింది... ముంబై ఇండియన్స్ మాజీ ప్లేయర్ ఆదిత్య తారే..
నా వల్లే రాహుల్ ద్రావిడ్‌కి అంత కోపం వచ్చింది... ముంబై ఇండియన్స్ మాజీ ప్లేయర్ ఆదిత్య తారే..
టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ చాలా కూల్ అండ్ కామ్. రాహుల్ ద్రావిడ్‌కి కోపం వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అయితే ఐపీఎల్ 2014 సీజన్‌లో ద్రావిడ్ కోపాన్ని జనాలు చూశారు...

ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఫైనల్ లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టే, ప్లేఆఫ్స్‌కి వెళ్తుంది, ఓడిన జట్టు ఎలిమినేట్ అవుతుంది...
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్, 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్సర్ బాదిన ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ ఆదిత్య తారే, ముంబై ఇండియన్స్‌కి అదిరిపోయే విజయాన్ని అందించాడు...
Rahul Dravid
ఆదిత్య తారే సిక్సర్ కొట్టిన సమయంలో రాజస్థాన్ రాయల్స్ డగౌట్‌లో కూర్చున్న, ఆర్ఆర్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తన క్యాప్ తీసి నేలకేసి కొట్టి, అరుస్తూ లోపలికి వెళ్లిపోయాడు. ఈ సంఘటన మీడియాలో వార్తగా మారింది...
‘నేను సిక్సర్ కొట్టిన తర్వాత రాహుల్ ద్రావిడ్ కోపంగా అలా చేశాడని నాకు తెలీదు. నేను నా టీమ్ గెలిచిందని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నా. అయితే ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్‌కి నీ వల్ల కోపం వచ్చింది అని నా టీమ్ మేట్స్ అందరూ చెప్పారు...
IPL, Rahul Dravid,
ఆఖరి బంతికి ముందు రాజస్థాన్ రాయల్స్ డగౌట్ హ్యాపీగా కనిపించింది. ఎందుకంటే స్కోర్లు లెవెల్ కావడంతో నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో వాళ్లు సంతోషంగా కనిపించారు. అయితే ఆఖరి బంతికి బౌండరీ వస్తే మేం ప్లేఆఫ్స్ చేరవచ్చని తెలిసింది...
Image credit: PTI
నేను వెంటనే సిక్సర్ కొట్టాను. ఫోర్ కొడితే సరిపోతుంది కానీ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక సిక్సర్ బాదాను. ఇది ద్రావిడ్ సర్‌కి కోపాన్ని తెప్పించింది...’ అంటూ కామెంట్ చేశాడు ముంబై ఇండియన్స్ మాజీ వికెట్ కీపర్ ఆదిత్య తారే...
అయితే ప్లేఆఫ్స్ వెళ్లిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడింది. పంజాబ్ కింగ్స్‌ని ఓడించిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రెండోసారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకుంది...