- Home
- Sports
- Cricket
- 3981 రోజుల తర్వాత ఐపీఎల్‌లో రీఎంట్రీ... హర్‌ప్రీత్ సింగ్ భాటియా సరికొత్త రికార్డు..
3981 రోజుల తర్వాత ఐపీఎల్‌లో రీఎంట్రీ... హర్‌ప్రీత్ సింగ్ భాటియా సరికొత్త రికార్డు..
ఐపీఎల్ 2023 సీజన్‌కి కమ్‌బ్యాక్ ఇయర్ అనే పేరు కరెక్టుగా సెట్ అవుతుంది. ఏళ్లుగా ఫెయిల్ అవుతున్న అజింకా రహానే, విజయ్ శంకర్ వంటి ప్లేయర్లు ఈసారి బాగా రాణించడమే కాదు, పదేళ్ల క్రితం ఐపీఎల్‌కి దూరమైన ప్లేయర్లు, ఈసారి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకుంటున్నారు...

(PTI Photo/Kamal Kishore)(PTI04_15_2023_000333B)
హర్‌ప్రీత్ సింగ్ భాటియా: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన హర్‌ప్రీత్ సింగ్ భాటియా, 2010 అండర్19 వరల్డ్ కప్‌లో ఆడాడు. 2010లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ తరుపున 5 మ్యాచులు ఆడి 4 ఇన్నింగ్స్‌ల్లో 42 పరుగులు చేసిన హర్‌ప్రీత్ సింగ్, 2011లో పూణే వారియర్స్, 2017లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్‌లోకి వెళ్లినా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు.
ఎట్టకేలకు 3981 రోజుల తర్వాత పంజాబ్ కింగ్స్ తరుపున ఐపీఎల్ రీఎంట్రీ ఇచ్చాడు హర్‌ప్రీత్ సింగ్ భాటియా... నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన హర్‌ప్రీత్ సింగ్ భాటియా, 22 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
Image credit: PTI
మాథ్యూ వేడ్: ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్, ఐపీఎల్ 2022 సీజన్‌లో టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. అంతకుముందు అప్పుడెప్పుడో 2011 సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (క్యాపిటల్స్) తరుపున ఆడిన మాథ్యూ వేడ్, 3962 రోజుల తర్వాత ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇవ్వడమే కాకుండా టైటిల్ కూడా గెలిచాడు...
Wayne Parnell
వేర్న్ పార్నెల్: సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ వేర్న్ పార్నెల్ ప్రస్తుతం ఆర్‌సీబీ టీమ్ తరుపున ఆడుతున్నాడు. 2011లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన వేర్న్ పార్నెల్, 2014లో చివరిగా ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఐపీఎల్ ఆడాడు. 9 సీజన్ల తర్వాత 3242 రోజుల తర్వాత ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇచ్చాడు వేర్న్ పార్నెల్...
రిలే రూసో: ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో ఉన్న రిలే రూసో, పాక్ సూపర్ లీగ్‌లో సంచలన ప్రదర్శన నమోదు చేసి సెంచరీలు కూడా బాదాడు. 2015లో ఆర్‌సీబీ తరుపున ఆఖరిగా ఐపీఎల్ ఆడిన రిలే రూసో, 2899 రోజుల తర్వాత తిరిగి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చోటు దక్కించుకోవడం విశేషం..
కోలిన్ ఇన్‌గ్రామ్: సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ కోలిన్ ఇన్‌గ్రామ్, ఐపీఎల్‌లో రెండే రెండు సీజన్లు ఆడాడు. అయితే ఈ రెండు సీజన్ల మధ్య 8 ఏళ్ల గ్యాప్ ఉంది. 2011లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఐపీఎల్ ఆడిన కోలిన్ ఇన్‌గ్రామ్, మళ్లీ 2019లో సరిగ్గా 2019 రోజుల తర్వాత ఢిల్లీ తరుపున రీఎంట్రీ ఇచ్చాడు..