- Home
- Sports
- Cricket
- అతను కోహ్లీ, రోహిత్, ధోనీ కంటే టాలెంటెడ్... పృథ్వీ షాపై షేన్ వాట్సన్ షాకింగ్ కామెంట్స్...
అతను కోహ్లీ, రోహిత్, ధోనీ కంటే టాలెంటెడ్... పృథ్వీ షాపై షేన్ వాట్సన్ షాకింగ్ కామెంట్స్...
ఐపీఎల్ 2023 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అవుతున్న టీమిండియా ప్లేయర్లలో పృథ్వీ షా ఒకడు. సీజన్ ఆరంభానికి ముందు పృథ్వీ షా, ఈసారి ఆరెంజ్ క్యాప్ గెలుస్తాడని నమ్మకంగా చెప్పాడు ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్. సీజన్ మొదలయ్యాక అతని పర్ఫామెన్స్ చూసి పాంటింగ్‌తో పాటు ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు...

ఐపీఎల్ 2023 సీజన్‌లో 5 మ్యాచులు ఆడిన పృథ్వీ షా 34 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 15 పరుగులు. అంటే మిగిలిన నాలుగు మ్యాచుల్లో కలిపి పృథ్వీ షా చేసింది 19 పరుగులే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు పృథ్వీ షా..
(PTI Photo/Vijay Verma)(PTI04_01_2023_000337B)
అంత అట్టర్ ఫ్లాప్ అయినా పృథ్వీ షాకి అండగా నిలుస్తోంది ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ స్టాఫ్. తాజాగా ఢిల్లీ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్, పృథ్వీ షా గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘పృథ్వీ షా 20 ఓవర్ల పాటు కూర్చొని, ఇంపాక్ట్ ప్లేయర్‌గా టీమ్‌లోకి వచ్చాడు..
Image credit: PTI
మ్యాచ్‌లో ముందునుంచి ఉండి ఉంటే క్రీజులో ఫీల్డింగ్ చేస్తూ, అటు ఇటు పరుగెడుతూ యాక్టీవ్‌గా ఉండేవాడు. పృథ్వీ షా స్కిల్స్ ఏ భారత బ్యాటర్‌కీ తక్కువేమీ కాదు. తొలి టెస్టులోనే పృథ్వీ షా టాలెంట్ ఏంటో అందరూ చూశారు. అతను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు..
పృథ్వీ షా ఇలా ఆడితే అవుట్ అవుతా అని భయపడడు. తప్పులు చేయడానికి కంగారు పడడు. ఏ బౌలర్‌నైనా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆడేందుుక సిద్ధంగా ఉంటాడు. పృథ్వీ షా లాంటి ప్లేయర్లు, ఉరికే అలా చెట్టు మీద నుంచి ఊడి పడడు.
నా ఉద్దేశంలో పృథ్వీ షా తన సహజ శైలికి భిన్నంగా, కాస్త జాగ్రత్తగా చూసుకుని ఆడాలని అనుకుంటే ఎక్కడో ఉండేవాడు. అయితే అది పృథ్వీ షా కాదు. నా ఉద్దేశంలో పృథ్వీ షా టాలెంట్ విషయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ వంటి లెజెండ్స్‌కి తక్కువేమీ కాదు...’ అంటూ కామెంట్ చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్..
‘నేను చూసిన బెస్ట్ ప్లేయర్లలో పృథ్వీషా ఒకడు. గత ఏడాది కూడా అతనితో చాలాసార్లు మాట్లాడాను. పృథ్వీషా అందరిలా కాదు, అతనో డిఫరెంట్ ప్లేయర్. మామూలుగా ఏ ప్లేయర్ అయినా ఫెయిల్ అయితే ఇంకా ఎక్కువగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తాడు. కానీ పృథ్వీషా ఫెయిల్ అయితే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఇష్టపడడు. అదే పరుగులు చేసినప్పుడు చాలా సమయం నెట్స్‌లో గడుపుతాడు...
పృథ్వీషాను అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. మంచి టెక్నిక్ ఉన్న బ్యాట్స్‌మెన్ అయినా నిర్లక్ష్యపు బ్యాటింగ్ వల్ల అది బయటికి రావడం లేదు... గత సీజన్‌లో నాలుగైదు మ్యాచుల్లో పృథ్వీషా పది పరుగుల లోపే అవుట్ అయ్యాడు.
నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తే, ఎక్కడ లోపం జరుగుతుందో తెలుసుకోవచ్చిని అతనికి చెప్పాను. అతను నా వైపు చూసి... ‘లేదు, నేను ఈరోజు బ్యాటింగ్ చేయడం లేదు’ అని చెప్పాడు... ఆ మాట విని నేను ఆశ్చర్యపోయాను. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో నాకు అర్థం కాలేదు.
కానీ ఇప్పుడు అతను చాలా మారిపోయినట్టు కనిపిస్తున్నాడు. కొన్ని నెలలుగా చాలా హార్డ్ వర్క్ చేశాడు.. బద్ధకాన్ని వదిలించుకుంటే పృథ్వీషా, భవిష్యత్తులో సూపర్ స్టార్ అవుతాడు...
నేను నా కెరీర్‌లో చూసిన అత్యుత్తమ టాలెంటెడ్ ప్లేయర్లలో పృథ్వీషా కూడా ఒకడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ట్యూన్‌లోకి వస్తే పరుగుల ప్రవాహం సృష్టిస్తాడు...’ అంటూ కామెంట్ చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్...