- Home
- Sports
- Cricket
- సాయిబాబా దయతో ఇన్‌స్టా ప్రొఫైల్ పిక్ తీసేసిన పృథ్వీ షా... ఇక నిబ్బా వేషాలు మానుకోవా! అంటూ...
సాయిబాబా దయతో ఇన్‌స్టా ప్రొఫైల్ పిక్ తీసేసిన పృథ్వీ షా... ఇక నిబ్బా వేషాలు మానుకోవా! అంటూ...
ఐపీఎల్ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్లాప్ షో కొనసాగుతూ వస్తోంది. 2020 సీజన్‌లో ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్, 2021 సీజన్‌లో ప్లేఆఫ్స్ ఆడింది. 2022 సీజన్‌లో ఐదో స్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్, ఈసారి ఆఖరి స్థానంలో నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి...

Shreyas Iyer-Rishabh Pant
2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని మొట్టమొదటిసారి ఫైనల్ చేర్చిన శ్రేయాస్ అయ్యర్‌ని కెప్టెన్సీ నుంచి తొలగించినప్పటి నుంచి ఆ టీమ్ పర్ఫామెన్స్ దిగజారుతూ వస్తోంది.. ఫస్ట్ ఫేజ్‌లో అయ్యర్ గాయపడడంతో రిషబ్ పంత్‌కి కెప్టెన్సీ అప్పగించిన ఢిల్లీ టీమ్ మేనేజ్‌మెంట్, అతని కెప్టెన్సీ నచ్చడంతో అయ్యర్ వచ్చినా పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగించింది...
రిషబ్ పంత్ కెప్టెన్సీలో 2021 సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్, ఫైనల్ మాత్రం చేరుకోలేకపోయింది. 2022 సీజన్‌లో ఐదో స్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్, ఈసారి ప్లేఆఫ్స్ చేరుకుంటే అది ప్రపంచ వింతే అవుతుంది. మొదటి ఐదు మ్యాచుల్లో నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్‌ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఒకటి రెండూ కాదు, అన్నీ...
Image credit: PTI
ఢిల్లీ క్యాపిటల్స్‌లో అక్షర్ పటేల్ తప్ప మరో బ్యాటర్ టీ20 స్టైల్‌లో ఆడడం లేదు. డేవిడ్ వార్నర్, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం, వన్డే వరల్డ్ కప్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నట్టు టెస్టు బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆన్రీచ్ నోకియా తప్ప మరో బౌలర్ ఆశించిన పర్ఫామెన్స్ ఇవ్వడం లేదు...
మరీ ముఖ్యంగా రిషబ్ పంత్ గైర్హజరీలో ఢిల్లీ భారాన్ని మోస్తాడనుకున్న పృథ్వీ షా ఫెయిల్యూర్, టీమ్‌ని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్‌లా మారిన పృథ్వీ షా, ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. పరుగులేమీ చేయకుండా రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు.
టీమిండియాలో చోటు రాకపోతే ‘సాయిబాబా అంతా చూస్తున్నాడు’ అంటూ పోస్టులు పెట్టే పృథ్వీ షా, ఆర్‌సీబీతో మ్యాచ్ తర్వాత ఇన్‌స్టా ప్రొఫైల్ పిక్‌ని తీసేశాడు. అండర్ 19 వరల్డ్ కప్ టీమ్‌కి కెప్టెన్సీ చేసిన పృథ్వీ షా వయసు ఎదిగినా, ఇంకా మానసికంగా అక్కడే ఉండిపోయాడని చాలామంది కామెంట్లు పెడుతున్నారు...
PTI Photo/Vijay Verma)(PTI04_01_2023_000337B)
టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న వ్యక్తి, టీనేజ్ నిబ్బాలా ప్రొఫైల్ పిక్స్ తీసేయడం, కొటేషన్స్ పోస్ట్ చేయడం మానుకోవాలని, ఇకనైనా కాస్త మెచ్యూర్డ్‌గా ఆలోచించాలని హితవు చేస్తున్నారు. మెంటల్‌గా మెచ్యూరిటీ సాధిస్తే, అతని ఆటలోనూ పరిణితి దానంతట అదే వస్తుందని కామెంట్లు పెడుతున్నారు..
మరికొందరు మాత్రం రిషబ్ పంత్ టీమ్‌కి దూరం కావడంతో తనకే కెప్టెన్సీ దక్కుతుందని పృథ్వీ షా భావించాడని, అతనికి కనీసం వైస్ కెప్టెన్సీ కూడా ఇవ్వకపోవడంతో మనస్థాపం చెంది కావాలని ఇలా ఆడుతున్నాడని కామెంట్లు పెడుతున్నారు..