- Home
- Sports
- Cricket
- ఓహో.. స్క్రిప్ట్ అలా ఉందా..! గంభీర్ - కోహ్లీ - మ్యాంగోస్ ఫైట్ కోసం ముంబై బలికావాల్సిందేనా..?
ఓహో.. స్క్రిప్ట్ అలా ఉందా..! గంభీర్ - కోహ్లీ - మ్యాంగోస్ ఫైట్ కోసం ముంబై బలికావాల్సిందేనా..?
IPL 2023 Playoffs: ఐపీఎల్ -16 లో భాగంగా నిన్న ఈడెన్ గార్డెన్ వేదికగా ముగిసిన కీలక పోరులో లక్నో సూపర్ జెయింట్స్.. కోల్కతా నైట్ రైడర్స్ పై ఒక్క పరుగు తేడాతో ఓడింది. కేకేఆర్ ఓటమి ముంబైనీ ముంచింది.

ఐపీఎల్ -16 మొదలై రెండు వారాలు ముగిసిన తర్వాత నుంచి ఇప్పటికీ సోషల్ మీడియాలోనే కాదు బయట జనాల్లో వినిపిస్తున్న కామెంట్ ‘ఇదంతా స్క్రిప్టే..’, ఎవరు గెలిచేది ఎవరు ఓడేది ముందే డిసైడ్ చేస్తారు అన్న వాదన బలంగా ఉంది. దీనికి తగ్గట్టుగానే లాస్ట్ ఓవర్ థ్రిల్లర్స్, ఆఖరి బంతికి విజయాలు.. అబ్బో.. ఇది ఓ సగటు టాలీవుడ్ మాస్ మసాలా ఫ్యామిలీ యాక్షన్ డ్రామా సినిమా కంటే మించి సాగుతోంది.
గత సీజన్ ఐపీఎల్ అట్టర్ ఫ్లాఫ్ కావడంతో ఈ ఏడాది ఎలాగైనా కోటానుకోట్లు పెట్టి ప్రసారహక్కులను సొంతం చేసుకున్న సంస్థల జేబులు నింపేందుకే నిర్వాహకులు ఇలా చేస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి. దీనికి తోడు ఏదైనా రెండు జట్ల మధ్య ఆటగాళ్లు చిన్న మాట అనుకున్నా దానిని గోరంతది కొండంత చేసి చూపించడం.. ఆ రెండు జట్ల మధ్య వార్ డిక్లేర్ చేయడంలో బ్రాడ్‌కాస్టర్లు ఆరితేరారు.
ఇక మైదానంలో దూకుడుగా ఉండటంలో తన తర్వాతే ఎవరైనా అన్నట్టుగా వ్యవహరించే కోహ్లీ.. ఈ నెల 1న లక్నో తో మ్యాచ్ లో భాగంగా కోహ్లీ - గంభీర్, నవీన్ ఉల్ హక్ లతో గొడవ పడటంతో ఆ తర్వాత ఆర్సీబీ ఆడిన మ్యాచ్ లకు వ్యూస్ అమాంతం పెరిగాయి. సోషల్ మీడియాలో ఈ ముగ్గురి మధ్య జరిగిన చర్చతో ఇది పీక్స్ కు చేరింది. ఈ మసాలా ఏదో బాగుందని.. ఇదే జోష్ ను ప్లేఆఫ్స్ కు కూడా జతచేస్తే లీగ్ చివరివరకూ హైప్ ను మెయింటెన్ చేయొచ్చని నిర్వాహకులు, బ్రాడ్కాస్టర్లు కుట్ర పన్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇందులో భాగంగానే ప్లేఆఫ్స్ రేసులో ముందున్న ముంబై ఇండియన్స్.. లక్నోతో మ్యాచ్ లో ఓడటం.. అసలు ఎప్పుడెలా ఆడుతుందో తెలియని ఆర్సీబీ కూడా వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి ప్లేఆఫ్స్ రేసులో నిలవడంతో ప్లేఆఫ్స్ లో ఎలిమినేటర్ మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్యే జరుగుతుందని.. జరిగేలా స్క్రిప్ట్ రాశారన్న వాదనలూ ఉన్నాయి.
గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్న కోహ్లీ.. మరోసారి లక్నో (గంభీర్, నవీన్) తో పోటీ పడితే అప్పుడు ఆ మ్యాచ్ కు వ్యూయర్షిప్ కావాల్సినంత రాబట్టొచ్చు. ఈ మధ్య లక్నో బౌలర్ నవీన్ ఉల్ హక్ ఆగడాలు కూడా శ్రుతి మించుతుండటంతో.. చాలా మంది కోహ్లీ అభిమానులు.. ‘ఎలిమినేటర్ లో నీకుందిరా.. నీకుంది..’అని కామెంట్స్ చేస్తుండటం ఈ వాదనకు మరింత బలాన్ని చేకూర్చుతున్నది.
Image credit: PTI
ఇదే స్క్రిప్ట్ లో ఉంటే మాత్రం నేడు ముంబై - హైదరాబాద్ మ్యాచ్ నామ్‌కే వాస్తే నే కానుంది. ఎంత చెత్తగా ఆడినా హైదరాబాద్ 80 పరుగుల తేడాతో ఓడిపోవాలంటే కష్టమే. ముంబై బౌలింగ్ కూడా ఆ స్థాయిలో లేదు. ఇక సొంతగడ్డపై ఆర్సీబీ బెబ్బులి. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ అంటేనే కేజీఎఫ్ (కోహ్లీ, మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్) లకు పూనకం వచ్చినట్టు ఆడుతున్నారు. ఇక్కడ గెలవడం ఆర్సీబీకి పెద్ద కష్టమేమీ కాదు. చూద్దాం.. మరి ఏం జరుగుతుందో..!