లైవ్ వీడియోకాల్, మల్లీపుల్ స్ట్రీమ్స్, 360 డిగ్రీ కెమెరా యాంగిల్స్... ఐపీఎల్ 2023 కోసం జియో భారీ ప్లాన్స్...
ఐపీఎల్ 2023 ఓటీటీ ప్రసార హక్కులను భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసింది జియో వయాకామ్ 18. జియో కంపెనీకి ‘వూట్’ పేరుతో ఓ ఓటీటీ యాప్ ఉంది. అయితే ఐపీఎల్ ప్రసారాల కోసం ఓ సరికొత్త యాప్‌ని త్వరలో లాంఛ్ చేయబోతోంది రిలయన్స్ కంపెనీ...
గత మూడేళ్లుగా ఐపీఎల్ మ్యాచులను ఓటీటీ యాప్ ‘హాట్ స్టార్’లో ప్రసారం చేసేది స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్. అయితే 2023-27 వరకూ ఐపీఎల్ టీవీ ప్రసార హక్కులను దక్కించుకున్న స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, ఓటీటీ హక్కులను మాత్రం నిలబెట్టుకోలేకపోయింది...
ఇండియాలో ఓటీటీ ప్రసార హక్కులను రూ.23,758 కోట్ల భారీ మొత్తం చెల్లించి దక్కించుకున్న వయాకామ్18 రిలయన్స్ కంపెనీ. ఇప్పటికే జియో సిమ్ కారణంగా మొబైల్ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ మార్కెట్‌లో మెజారిటీ వాటా దక్కించుకున్న రిలయన్స్ సంస్థ, ఐపీఎల్ హక్కులను వాడుకుని, ఓటీటీ మార్కెట్‌లో కూడా జెండా పాతాలని చూస్తోంది...
డిస్నీ ప్లస్ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లెక్స్, ఆహా వంటి ఓటీటీ యాప్స్... సబ్‌స్కైబర్లను పెంచుకుని, అధిక ఆదాయం గడించేందుకు మల్టీపుల్ స్ట్రీమ్స్ సదుపాయాన్ని తొలగించాయి. దీన్ని అవకాశంగా మలుచుకున్న జియో, ఐపీఎల్‌ను మల్టీపుల్ స్ట్రీమ్స్ ఫెసిలిటీతో అందుబాటులో తేవాలని ఆలోచిస్తోందట.
Image credit: Wikimedia Commons
అంటే ఒక్కరు సబ్‌స్ట్రిప్షన్ తీసుకుంటే... ఆ ఐడీని దాదాపు 5 నుంచి 10 వరకూ వాడుకోవచ్చు. అలాగే మ్యాచ్ చూస్తూనే ఫ్రెండ్స్‌లో లైవ్ వీడియో కాల్ చేసుకునే సౌకర్యం కూడా తీసుకురానుంది జియో. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే ఒకే రూమ్‌లో కూర్చొని చూసినట్టుగా ఫ్రెండ్స్ అందరూ లైవ్ వీడియో కాల్‌లో మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు... బెట్టింగ్స్ వేసుకోవచ్చు...
Image Credit: Getty Images
అంతేకాదు... మునుపెన్నడూ లేని విధంగా పర్సనలైజ్డ్ కెమెరా యాంగిల్స్ ఆప్షన్‌ని ఐపీఎల్‌లో ప్రవేశపెట్టనుందట జియో వయాకామ్. అంటే మ్యాచ్‌ని ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్‌లో 360 డిగ్రీస్‌లో చూసేందుకు వీలయ్యేలా టెక్నాలజీని తీసుకురానుంది జియో...
ఇది నిజంగా కార్యరూపం దాల్చితే ఐపీఎల్ 2023 సీజన్ ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయం. అలాగే జియో ఎయిర్ ఫైబర్‌తో భారీ స్క్రీన్‌పై మ్యాచ్ చూసేందుకు కూడా అందుబాటులో తేబోతున్నారు. అంటే సినిమా థియేటర్‌లో మూవీ చూసినట్టుగా, స్టేడియంలో స్టాండ్స్‌లో ఉండి మ్యాచ్ చూసిన అనుభూతిని ప్రేక్షకులకు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి...
Akash ambani
‘మీరు మీ ఫ్రెండ్స్‌తో పార్టీలో ఉన్నారు. లైవ్ వీడియో కాల్స్ మాట్లాడుతున్నారు. ఇండియాలో ఎక్కడ ఉన్నా ఒకే స్టేడియంలో ఉన్నట్టుగా కలిసి మ్యాచ్ చూసే అవకాశం కల్పించేందుకు టెక్నాలజీని తీసుకురాబోతున్నాం. జియో 5జీ సర్వీసులను వాడి, ఐపీఎల్ ఫ్యాన్స్‌కి ఓ సరికొత్త అనుభూతిని అందించబోతున్నాం...’ అంటూ చెప్పుకొచ్చాడు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మెన్ ఆకాశ్ అంబానీ..