- Home
- Sports
- Cricket
- మామిడి పండ్లు బాగున్నాయ్ ఫ్రెండ్స్... కోహ్లీ అవుట్ కాగానే నవీన్ వుల్ హక్ పోస్ట్...
మామిడి పండ్లు బాగున్నాయ్ ఫ్రెండ్స్... కోహ్లీ అవుట్ కాగానే నవీన్ వుల్ హక్ పోస్ట్...
ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, నవీన్ వుల్ హక్ మధ్య జరిగిన గొడవ... సోషల్ మీడియాలో రచ్చ లేపింది. ఈ మ్యాచ్ జరిగిన వారం దాటినా ఎవ్వరూ మరిచిపోలేదు...
- FB
- TW
- Linkdin
Follow Us

Virat Kohli-Naveen Ul Haq Fight
ఈ మ్యాచ్‌లో నవీన్ వుల్ హక్, గౌతమ్ గంభీర్‌లతో తీవ్ర వాగ్వాదానికి దిగిన విరాట్ కోహ్లీ, కాస్త హద్దు మీరి ప్రవర్తించాడు. నవీన్ వుల్ హక్‌ని ‘నువ్వు నా కాలి బూటుకి అంటిన దుమ్ముతో సమానం’ అనే అర్థం వచ్చేలా చేసిన సైగలు పెను దుమారం రేకెత్తించాయి..
ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న బీసీసీఐ, ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాల్సిందిగా విరాట్ కోహ్లీని ఆదేశించిందని, అతనిపై క్రమశిక్షణా ఉల్లంఘన చర్యలు తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి..
ఈ మ్యాచ్ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ని ఫాలో అయిన విరాట్ కోహ్లీ, ఎప్పుడూ లేనట్టుగా వృద్ధిమాన్ సాహా ఇన్నింగ్స్‌ని, రషీద్ ఖాన్ పట్టిన క్యాచ్‌ని అభినందిస్తూ ఇన్‌స్టాలో స్టోరీ పెట్టాడు..
virat kohli
తాజాగా నవీన్ వుల్ హక్ కూడా ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ని ఫాలో అవుతున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 4 బంతులాడి 1 పరుగుకే అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా డీఆర్‌ఎస్ తీసుకున్న ముంబైకి ఫలితం దక్కింది..
విరాట్ కోహ్లీ అవుటైన తర్వాత అనుజ్ రావత్ కూడా 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఆర్‌సీబీ. విరాట్ అవుటైన తర్వాత మ్యాచ్ చూస్తూ మామిడి పండ్లు తింటున్న ఫోటోను ఇన్‌స్టాలో స్టోరీగా పెట్టిన నవీన్ వుల్ హక్, ‘స్వీట్ మ్యాంగోస్’ అంటూ కాప్షన్ జోడించాడు..
అంతర్జాతీయ క్రికెటర్‌గా ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న నవీన్ వుల్ హక్, విరాట్ కోహ్లీతో గొడవని ఇంత పర్సనల్‌గా తీసుకోవడం అతని కెరీర్‌కి మంచిది కాదని అంటున్నారు టీమిండియా అభిమానులు..