- Home
- Sports
- Cricket
- జోఫ్రా ఆర్చర్ ఆడతాడా లేదా? ముంబై ఇండియన్స్‌కి తీరని కష్టాలు... ఇలాంటి బౌలింగ్‌తో...
జోఫ్రా ఆర్చర్ ఆడతాడా లేదా? ముంబై ఇండియన్స్‌కి తీరని కష్టాలు... ఇలాంటి బౌలింగ్‌తో...
ఐపీఎల్‌లో ఐదు టైటిల్స్ గెలిచిన ఏకైక టీమ్ ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆరుసార్లు ప్లేఆఫ్స్ చేరితే, ఐదు సార్లు టైటిల్ గెలిచింది ముంబై ఇండియన్స్. అయితే 2021 నుంచి ముంబై ఇండియన్స్ పరిస్థితి దారుణంగా తయారైంది...

Archer-Mumbai Indians
2021 సీజన్‌లో నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడంతో ఐదో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్ చేరలేకపోయిన ముంబై ఇండియన్స్, గత సీజన్‌లో డిజాస్టర్ రిజల్ట్ రాబట్టింది. వరుసగా 8 మ్యాచుల్లో ఓడిన ముంబై ఇండియన్స్, 14 మ్యాచుల్లో 4 విజయాలు మాత్రమే అందుకుని, 10 పరాజయాలతో ఆఖరి స్థానంలో నిలిచింది...
PTI Photo/Ravi Choudhary)(PTI04_11_2023_000366B)
ట్రెంట్ బౌల్ట్, క్వింటన్ డి కాక్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జయంత్ యాదవ్ వంటి ప్లేయర్లు వేరే ఫ్రాంఛైజీలకు వెళ్లిపోవడంతో వీక్ అయిపోయిన ముంబై ఇండియన్స్ టీమ్, 2023 సీజన్‌లోనూ వరుసగా రెండు మ్యాచుల్లో ఓడింది...
PTI Photo/Ravi Choudhary)(PTI04_11_2023_000353B)
ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచి విజయాన్ని అందుకుంది ముంబై ఇండియన్స్. అయితే మిగిలిన టీమ్స్ అన్నీ ఢిల్లీ టీమ్‌ని ఓ ఆటాడుకుంటూ చిత్తు చిత్తుగా ఓడిస్తుంటే, అలాంటి టీమ్‌పై గెలవడానికి కూడా ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఎదురుచూసింది ముంబై ఇండియన్స్...
జస్ప్రిత్ బుమ్రా గాయపడడంతో జోఫ్రా ఆర్చర్‌పై భారీ ఆశలు పెట్టుకుంది ముంబై ఇండియన్స్. అతను ఒక్క మ్యాచ్‌కే గాయపడడంతో తీవ్ర ఇబ్బంది పడుతోంది ముంబై. ఆర్‌సీబీతో మ్యాచ్ తర్వాత రెండు మ్యాచులకు దూరమైన జోఫ్రా ఆర్చర్, కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆడతాడా? లేదా? అనేది అనుమానంగా మారింది...
Archer bowling nets
‘ప్రస్తుతానికి జోఫ్రా ఆర్చర్, మెడికల్ టీమ్ పర్యవేక్షణలోనే ఉన్నాడు. అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదని మాకు తెలుసు. అంతకుమించి అతని గాయం గురించి నాకు పెద్దగా తెలీదు...’ అంటూ కామెంట్ చేశాడు ముంబై ఇండియన్స్ బ్యాటర్ టిమ్ డేవిడ్..
ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ సెషన్స్‌లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ చేస్తూ కనిపించాడు. అయితే అతన్ని కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆడిస్తారా? లేక రిస్క్ చేయడం ఇష్టం లేక మరికొన్ని రోజులు రెస్ట్ ఇస్తారా? అనేది తెలియాలి..
నితీశ్ రాణా కెప్టెన్సీలో పెద్దగా అంచనాలు లేకుండా ఐపీఎల్ 2023 సీజన్‌ని ఆరంభించింది కోల్‌కత్తా నైట్ రైడర్స్. అయితే మొదటి నాలుగు మ్యాచుల్లో కేకేఆర్ నుంచి టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చింది. నాలుగింట్లో రెండు విజయాలు అందుకున్న కోల్‌కత్తా, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లోనూ ఆఖరి ఓవర్ వరకూ పోరాడింది..
నితీశ్ రాణా, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, ఆండ్రే రస్సెల్, సునీల్ నరైన్ వంటి భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ని పెద్దగా అనుభవం లేని ముంబై ఇండియన్స్ బౌలర్లు ఎంత వరకూ నిలువరించగలరనేది ఆసక్తికరంగా మారింది.