- Home
- Sports
- Cricket
- సూర్యకుమార్ యాదవ్‌కి తీవ్ర గాయం... ముంబై ఇండియన్స్‌తో పాటు టీమిండియాకి పెద్ద దెబ్బే...
సూర్యకుమార్ యాదవ్‌కి తీవ్ర గాయం... ముంబై ఇండియన్స్‌తో పాటు టీమిండియాకి పెద్ద దెబ్బే...
ఐపీఎల్ 2023 సీజన్లలో కీలక ఆటగాళ్లు గాయపడడం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్, ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడి, వన్డే వరల్డ్ కప్‌కే అనుమానంగా మారగా ఇప్పుడు ఈ లిస్టులో సూర్యకుమార్ యాదవ్ కూడా చేరాడు...

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు మ్యాచుల్లో డకౌట్ అయిన సూర్యకుమార్ యాదవ్, ఆ షాక్ నుంచి ఇంకా బయటికి రాలేదు. ఐపీఎల్ 2023 సీజన్‌లో జరిగిన మొదటి రెండు మ్యాచుల్లోనూ సూర్య రేంజ్ ఇన్నింగ్స్ రాలేదు...
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ తడబడ్డాడు. హృతీక్ షోకీన్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ కొట్టిన షాట్‌ని అంచనా వేయడంలో ఫెయిల్ అయిన సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ మిస్ చేసి, సిక్సర్ ఇచ్చేశాడు.. అయితే అతని బ్యాడ్ టైం అక్కడితో ఆగలేదు..
జాసన్ బెహ్రాన్‌డార్ఫ్ బౌలింగ్‌లో మరోసారి అక్షర్ పటేల్ కొట్టిన షాట్‌ని క్యాచ్ అందుకోవడానికి ప్రయత్నించిన సూర్యకుమార్ యాదవ్, తీవ్రంగా గాయపడ్డాడు. సూర్య చేతుల సంధుల్లో నుంచి వెళ్లిన బంతి, నేరుగా అతని నుదిటి భాగాన తగిలి బౌండరీ అవతల పడింది..
నొప్పితో విలవిలలాడిన సూర్యకుమార్ యాదవ్, ఫిజియో సాయంతో పెవిలియన్ చేరాడు. అతని గాయం గురించి అప్‌డేట్ రావాల్సి ఉంది. సిక్స్ పోతే పోయింది, ఈ మ్యాచ్ పోతే పోయింది, ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఫెయిల్ అయితే అయ్యింది. ఇవన్నీ భారత క్రికెట్‌ని పెద్దగా ప్రభావితం చేయవు. కానీ సూర్యకుమార్ యాదవ్, టీమిండియాకి కీ ప్లేయర్. టీ20ల్లో నెం.1 బ్యాటర్..
Image credit: PTI
ఇప్పటికే శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా రూపంలో ముగ్గురు కీ ప్లేయర్లను కోల్పోయిన టీమిండియా, సూర్యకుమార్ యాదవ్‌పైనే భారీ ఆశలు పెట్టుకుంది. ఐసీసీ టోర్నీలను దృష్టిలో ఉంచుకుని కీ ప్లేయర్లు గాయపడకుండా చూసుకుంటామని చెప్పిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీమ్‌లోనే సూర్య రూపంలో భారత ప్రధాన ఆటగాడు గాయపడడం విశేషం..