ఆ మనీశ్ అన్నే మయాంక్ అగర్వాల్ రూపంలో మళ్లీ వచ్చాడా! శిఖర్ ధావన్‌లా ఆడతాడనుకుంటే...
ఐపీఎల్ 2023 సీజన్ మినీ వేలంలో మయాంక్ అగర్వాల్‌ని రూ.8 కోట్ల 25 లక్షల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. కొన్నేళ్లుగా సరైన సీనియర్ ఇండియన్ బ్యాటర్ లేకపోవడం, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని ఇబ్బంది పెడుతోంది. మయాంక్ ఈ లోటు తీరుస్తాడని భావించింది...

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 23 బంతుల్లో 3 ఫోర్లతో 27 పరుగులు చేసి పర్వాలేదనిపించిన మయాంక్ అగర్వాల్, లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 8 పరుగులు చేసి కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..
Image credit: PTI
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 13 బంతుల్లో 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో మయాంక్ అగర్వాల్ స్ట్రైయిక్ రేటు 100- 110+ కూడా దాటడం లేదు..
ఇంతకుముందు రూ.11 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన టీమిండియా బ్యాటర్ మనీశ్ పాండే కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఇలాగే ఆడేవాడు. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో, కేన్ విలియంసన్ వంటి ఓపెనర్లు బాగా ఆడిన తర్వాత క్రీజులోకి వచ్చే మనీశ్ పాండే.. బాల్స్ వేస్ట్ చేసి, కీలక సమయంలో అవుటై.. టీమ్‌ని కష్టాల్లో పడేసేవాడు..
వరుసగా ఫెయిల్ అవుతున్నా మనీశ్ అన్నని నాలుగు సీజన్ల పాటు టీమ్‌లో మేపి, రూ.44 కోట్లు ముట్టచెప్పిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఇక లాభం లేదని ఐపీఎల్ 2022 మెగా వేలంలో విడుదల చేసింది. అయితే మనీశ్ అన్న ఎక్కడికి పోలేదని, మయాంక్ అగర్వాల్ రూపంలో మళ్లీ ఆడుతున్నాడని ట్రోల్స్ వినిపిస్తున్నాయి..
Image credit: PTI
ఎందుకంటే ఇప్పుడు మయాంక్ అగర్వాల్ ఆట కూడా అచ్చు ఇలాగే ఉంది. అయితే మనీశ్ పాండే మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చేవాడు, మయాంక్ అగర్వాల్ మాత్రం ఓపెనర్‌గా వచ్చి పవర్ ప్లేలో బాల్స్ వేస్ట్ చేస్తున్నాడు అంతే తేడా... స్ట్రైయిక్ రేట్, ఫెయిల్యూర్ పర్ఫామెన్స్ సేమ్ టూ సేమ్..
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడిన శిఖర్ ధావన్‌లా మయాంక్ అగర్వాల్ టీమ్‌కి సీనియర్ బ్యాటర్‌లా ఉపయోగపడతాడని ఆశించింది టీమ్ మేనేజ్‌మెంట్. అయితే అతని నుంచి ఇప్పటిదాకా ఆ రేంజ్ పర్ఫామెన్స్ అయితే రాలేదు..
Mayank Agarwal
ఈ సీజన్‌లో మయాంక్ అగర్వాల్ ఫెయిల్ అయితే, అతన్ని వచ్చే ఏడాది వేలానికి విడుదల చేయడం పక్కా. మళ్లీ మయాంక్ వేరే కొత్త టీమ్ తరుపున ఆడడం కూడా ఖాయం అంటున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్. మయాంక్ అగర్వాల్ అంత నష్టం జరగకముందే తేరుకుంటే బెటర్..