MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Akash Madhwal: ఆకాశ్ దెబ్బకు రికార్డుల విలవిల.. మధ్వాల్ మెరుపులతో ముంబైకి సూపర్ విక్టరీ

Akash Madhwal: ఆకాశ్ దెబ్బకు రికార్డుల విలవిల.. మధ్వాల్ మెరుపులతో ముంబైకి సూపర్ విక్టరీ

IPL 2023, LSG vs MI Eliminator:  ఐపీఎల్ -16 ఎలిమినేటర్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్  - ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో లక్నోకు షాకిచ్చాడు ఆకాశ్ మధ్వాల్.. 

2 Min read
Author : Srinivas M
Published : May 25 2023, 10:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ముంబై ఇండియన్స్ యువ పేసర్  ఆకాశ్ మధ్వాల్  డ్రీమ్ స్పెల్ తో  ఆ జట్టు.. లక్నో సూపర్ జెయింట్స్ కు షాక్ తప్పలేదు.  3.3 ఓవర్లే వేసిన ఆకాశ్.. ఐదు పరుగులే ఇచ్చి ఐదు వికెట్లతో చెలరేగాడు.  తద్వారా  మధ్వాల్  ఐపీఎల్ లో ఎన్నో ఏండ్ల నుంచి తుప్పు బట్టిన పలు రికార్డుల దుమ్ము దులిపాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మధ్వాల్ దెబ్బకు 68-2 తో పటిష్ట స్థితిలో నిలిచిన లక్నో.. 101 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో  రోహిత్ శర్మ బంతిని ఇచ్చిన ప్రతీ ఓవర్లో  మధ్వాల్ వికెట్ తీసి ముంబైకి బ్రేక్  ఇచ్చాడు.   ప్రేరక్ మన్కడ్, అయుష్ బదోని, నికోలస్ పూరన్ వంటి  స్టార్ బ్యాటర్లతో పాటు  రవి బిష్ణోయ్, మోహ్సిన్ ఖాన్ లు కూడా  మధ్వాల్ బౌలింగ్ లోనే వెనుదిరిగారు. 

36

ఈ క్రమంలో  మధ్వాల్ పలు రికార్డులను బ్రేక్ చేశాడు. ప్లేఆఫ్స్ లో మధ్వాల్  చేసిన ప్రదర్శనే  (5-5) అత్యుత్తమం. అంతకుముందు   2010లో డెక్కన్ ఛార్జర్స్ తో పోరులో చెన్నై బౌలర్ బొలింగర్.. 4 వికెట్లు తీసి 13 పరుగులు ఇచ్చాడు.  2020లో  బుమ్రా.. క్వాలిఫయర్ 1 లో  ఢిల్లీ క్యాపిటల్స్ పై 4 ఓవర్లలో 14 పరుగులిచ్చి  నాలుగు వికెట్లు పడగొట్టాడు. 

46

లక్నో - ముంబైతో మ్యాచ్ లో   ఐదు వికెట్లు తీసిన మధ్వాల్.. 2009 లో రాజస్తాన్ రాయల్స్ పై అనిల్ కుంబ్లే (ఆర్సీబీ) తీసిన  5-5  రికార్డును సమం చేశాడు.  ఐపీఎల్ లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన.. అల్జారీ జోసెఫ్  (6-12) పేరిట ఉంది.  ఆ తర్వాత సోహైల్ తన్వీర్  (6-14), ఆడమ్ జంపా (6-19) ల పేరిట ఉంది.   

56

ముంబై ఇండియన్స్ తరఫున కూడా అత్యుత్తమ గణాంకాలు నమోదుచేసిన బౌలర్ గా  మధ్వాల్ నిలిచాడు. ఆ జట్టు తరఫున  గతంలో  అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన  బుమ్రా (5-10) పేరిట ఉండేది.   2013లో మలింగ.. ఢిల్లీ డేర్ డెవిల్స్ పై  5-13  ప్రదర్శన నమోదుచేశాడు. ఇప్పుడు ఈ రెండు రికార్డులను మధ్వాల్ బ్రేక్ చేశాడు. 

66

ఇక అన్‌క్యాప్డ్ ప్లేయర్ గా ఉండి ఐపీఎల్ లో  ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన బౌలర్లలో  మధ్వాల్.. అంకిత్ రాజ్‌పుత్ (5-14) రికార్డును బ్రేక్ చేశాడు. అంకిత్ తర్వాత  వరుణ్ చక్రవర్తి (5-20), ఉమ్రాన్ మాలిక్ (5-25) లు ఈ జాబితాలో  చోటు దక్కించుకున్నారు.  

About the Author

SM
Srinivas M
Latest Videos
Recommended Stories
Recommended image1
Ajinkya Rahane: అజింక్య రహానేకు బీసీసీఐ నెలనెలా పెన్షన్.. ఎంత వస్తుందో తెలుసా?
Recommended image2
Hardik Pandya New Look : హార్దిక్ పాండ్యా కొత్త లుక్ అదిరిందిగా
Recommended image3
Hardik Pandya: ధోనీతో పాండ్యా సీక్రెట్ మీటింగ్? ముంబైకి షాకిచ్చి చెన్నైలోకి హార్దిక్ మాస్ ఎంట్రీ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved