MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • రోహిత్ శర్మ కాదు.. నో హిట్ శర్మ : టీమిండియా కెప్టెన్‌పై చిక్కా గరంగరం

రోహిత్ శర్మ కాదు.. నో హిట్ శర్మ : టీమిండియా కెప్టెన్‌పై చిక్కా గరంగరం

IPL 2023:  టీమిండియా  సారథి  రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్, 1983 వరల్డ్ కప్ విన్నర్  కృష్ణమచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

2 Min read
Author : Srinivas M
Published : May 07 2023, 07:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఐపీఎల్ - 16లో వరుసగా సున్నాలు చుడుతున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్  రోహిత్ శర్మ పై  టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వరుసగా  సున్నాలు చుడుతూ  ఐపీఎల్ లో 16  డకౌట్లు అయి చెత్త రికార్డు నమోదు చేసుకున్న  హిట్‌మ్యాన్ పై శ్రీకాంత్ (చిక్కా) పై విమర్శలు గుప్పించాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ముంబై - చెన్నై  మధ్య  శనివారం వాంఖెడే వేదికగా ముగిసిన  మ్యాచ్ లో రోహిత్ డకౌట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో    శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘రోహిత్ శర్మ  కాదు. నో హిట్ శర్మ..’అని అన్నాడు.  అంతేగాక  అతడిని తన జట్టులో అయితే తీసుకోనని  కామెంట్ చేశాడు. 

37

‘రోహిత్ ను అందరూ హిట్ మ్యాన్ అంటారు. కానీ నా దృష్టిలో అతడు  నో హిట్ శర్మ. నేనే గనక  ముంబై సారథిని అయితే   అతడిని  ప్లేయింగ్ లెవన్ లో తీసుకోనే తీసుకోను..’అని  ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ కామెంట్స్ పై రోహిత్ ఫ్యాన్స్ కూడా శ్రీకాంత్ కు  ధీటుగానే బదులిస్తున్నారు. 

47

ఆటగాళ్ల కెరీర్ లో  ఒడిదొడుకులు  సర్వసాధారణమేనని, శ్రీకాంత్ తన కెరీర్ మొత్తం   వంద శాతం  సగటుతో రాణించాడా..? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క సీజన్ లో విఫలమైనంత మాత్రానా  ఐపీఎల్ లో ఆరు వేల పరుగులు  చేసిన ఆటగాడిని ఇలా అవమానించడం తగదని  కామెంట్స్ చేస్తున్నారు. 

57

కాగా ఈ సీజన్ లో పంజాబ్ తో మ్యాచ్ లో  డకౌట్ అయిన  రోహిత్.. చెన్నైతో మ్యాచ్ లో కూడా సున్నా చుట్టాడు.  తద్వారా ఐపీఎల్ లో అత్యధిక సార్లు డకౌట్ అయిన  ఆటగాడిగా నిలిచాడు. చెన్నైతో మ్యాచ్ లో డకౌట్ అవడం రోహిత్ కు 16వ సారి. అంతేగాక  ఈ సీజన్ లో పది మ్యాచ్ లలో  184 పరుగులు చేశాడు.  ఇందులో ఒక్క అర్థ సెంచరీ మాత్రమే ఉంది. 

67

గతంలో ఈ రికార్డు దినేశ్ కార్తీక్, మన్‌దీప్ సింగ్,  సునీల్ నరైన్  లు 15 సార్లు డకౌట్ అయిన వారిగా ఉన్నారు.  ఈ రికార్డును  పంజాబ్ తో మ్యాచ్ లో సమం చేసిన  రోహిత్.. చెన్నైతో మ్యాచ్  లో అధిగమించాడు. 

77

కాగా రోహిత్ తో పాటు ముంబై బ్యాటర్ల వైఫల్యంతో  ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో  8 వికెట్లు కోల్పోయి  139 పరుగులే చేసింది.    నెహల్ వధేరా.. 61 పరుగులతో టాప్ స్కోరర్.  లక్ష్యాన్ని చెన్నై.. 17.4 ఓవర్లలో  4 వికెట్లు మాత్రమే కోల్పోయి  ఛేదించింది.  డెవాన్ కాన్వే (44), రుతురాజ్ గైక్వాడ్ (30) రాణించారు. 

About the Author

SM
Srinivas M
రోహిత్ శర్మ
Latest Videos
Recommended Stories
Recommended image1
Cricketers Retirement : రహానే ట్రైలర్ మాత్రమే, సినిమా మిగిలే ఉంది.. రిటైర్మెంట్ కు సిద్దమైన టాప్ 5 క్రికెటర్లు వీళ్లే
Recommended image2
Ajinkya Rahane Net Worth: అజింక్య రహానే కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా? లగ్జరీ కార్లు, బిజినెస్ సీక్రెట్స్ ఇవే
Recommended image3
Rahane Retirement : క్యాప్ నంబర్ 278, సైనింగ్ ఆఫ్.. టీమిండియాకు గుడ్ బై చెబుతూ అజింక్యా రహానే ఎమోషనల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved