- Home
- Sports
- Cricket
- కేకేఆర్‌కి మరో దెబ్బ! ఐపీఎల్ 2023 నుంచి తప్పుకున్న షకీబ్ అల్ హసన్.. కెప్టెన్సీ ఇవ్వలేదని అలిగి...
కేకేఆర్‌కి మరో దెబ్బ! ఐపీఎల్ 2023 నుంచి తప్పుకున్న షకీబ్ అల్ హసన్.. కెప్టెన్సీ ఇవ్వలేదని అలిగి...
ఐపీఎల్ 2023 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి మరో ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్, కెప్టెన్ షకీబ్ అల్ హసన్, 2023 ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు. ఐర్లాండ్‌తో ఏప్రిల్ 4 నుంచి 8 వరకూ సాగే ఏకైక టెస్టు మ్యాచ్‌కి ప్రకటించిన బంగ్లాదేశ్ జట్టులో షకీబ్ అల్ హసన్‌కి చోటు దక్కింది..

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడుతున్న బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ ఇప్పటికే ఇండియాకి చేరుకున్నాడు. ఐపీఎల్ ఆడాలనుకునే ప్లేయర్లను ఐర్లాండ్‌తో టెస్టు నుంచి తప్పిస్తామని బంగ్లా క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ నజ్ముల్ హాసన్ తెలియచేశాడు..
Shakib Al Hasan
అయితే షకీబ్ అల్ హసన్, ఐపీఎల్ 2023 సీజన్ ఆడకూడదని నిర్ణయించుకోవడం వల్లే అతన్ని ఈ టెస్టుకి ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. కేకేఆర్ తరుపున ఆడుతున్న లిటన్ దాస్ కూడా ఐర్లాండ్‌తో టెస్టుకి ఎంపియ్యాడు. లిటన్ దాస్‌ని ఐపీఎల్ 2023 మినీ వేలంలో రూ.50 లక్షలకు కొనుగోలు చేసిన కేకేఆర్, షకీబ్ అల్ హసన్‌ని రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది..
షకీబ్ అల్ హసన్, ఐపీఎల్ 2023 సీజన్ నుంచి తప్పుకోవడానికి వ్యక్తిగత జీవితంలోని గొడవలు, అంతర్జాతీయ కమ్మిట్‌మెంట్స్ కారణంగా చూపించినా.. కెప్టెన్సీ విషయంలో మనస్తాపం చెందక వల్లే అతను ఇండియాకి రావడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి..
శ్రేయాస్ అయ్యర్ గాయంతో ఐపీఎల్ 2023 సీజన్‌కి అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో యంగ్ బ్యాటర్ నితీశ్ రాణాకి కెప్టెన్సీ అప్పగించింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. అయ్యర్ గైర్హజరీలో కేకేఆర్ కెప్టెన్సీ ఆశించిన షకీబ్ అల్ హసన్, నితీశ్ రాణా లాంటి కుర్రాడికి కెప్టెన్సీ ఇవ్వడాన్ని అవమానంగా భావించి, ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడని కథనాలు వినిపిస్తున్నాయి..
లిటన్ దాస్, ఐపీఎల్ కోసం వస్తాడా? రాడా? అనే విషయం ఇంకా తెలియరాలేదు. అతను వస్తే, ఐర్లాండ్‌తో టెస్టు ముగిసిన తర్వాత వచ్చే వారంలో ఇండియాకి రావచ్చు. ఇప్పటికే శ్రేయాస్ అయ్యర్ గాయంతో ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆడతాడో లేదో తెలియని పరిస్థితి.. అయ్యర్, ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడని వార్తలు వస్తున్నా, కేకేఆర్ మాత్రం తమ కెప్టెన్ తిరిగి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
Image credit: PTI
ఐపీఎల్ 2023 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 7 పరుగుల తేడాతో ఓడింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. తన తర్వాతి మ్యాచ్‌ని ఏప్రిల్ 6న కోల్‌కత్తాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది కేకేఆర్...