అప్పుడు కియారా అద్వానీ, ఇప్పుడు తమన్నా భాటియా... లక్ అంటే ఈ కుర్రాడిదే బాసూ...
ఐపీఎల్ 2023 సీజన్ ఘనంగా మొదలైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆరంభ వేడుకల్లో బాలీవుడ్ సింగర్ అర్‌జిత్ సింగ్‌తో పాటు హీరోయిన్లు తమన్నా భాటియా, రష్మికా మంధాన డ్యాన్స్ పర్ఫామెన్స్‌లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.. అటు బాలీవుడ్‌లో, ఇటు సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న తమన్నా తన లుక్స్‌తో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది...

ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభ వేడుకల్లో తన ట్రేడ్ మార్క్‌గా మారిపోయిన ‘సామీ సామీ’ సాంగ్‌తో పాటు ‘శ్రీవల్లీ...’ పాటలకు డ్యాన్స్ చేసిన రష్మిక మంధాన, ఆస్కార్ విన్నింగ్ ‘నాటు-నాటు’ డ్యాన్స్‌కి స్టెప్పులు వేసింది..
తన డ్యాన్స్ పర్ఫామెన్స్ కంటే ముందు మైక్ పట్టుకుని, అభిమానులతో కాసేపు మాట్లాడింది రష్మిక మంధాన. అయితే రష్మిక మంధాన కంటే ‘మిల్కీ బ్యూటీ’ తమన్నా భాటియా గ్లామర్‌కే స్టేడియం ఊగిపోయింది...
అయితే ఇక్కడే ఓ కుర్రాడు, సోషల్ మీడియా అటెన్షన్ దక్కించుకున్నాడు. దీనికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. నెల రోజుల క్రితం ప్రారంభమైన మొట్టమొదటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆరంభ వేడుకల్లో హీరోయిన్ కియారా అద్వానీ డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చింది...
కియారా అద్వానీ డ్యాన్స్ పర్ఫామెన్స్ సమయంలో ఆమెను తన చేతులతో లిఫ్ట్ చేసిన కుర్రాడే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఆరంభ వేడుకల్లో తమన్నా భాటియాను భుజాలపై ఎత్తుకున్నాడు..
Image credit: PTI
నెల రోజుల గ్యాప్‌లో ఇద్దరు స్టార్, సూపర్ హాట్ హీరోయిన్లతో కనిపించడమే కాకుండా వారితో డ్యాన్స్ చేసి, వారిని ఎత్తుకునే అదృష్టం కొట్టేసిన కుర్రాడిని సోషల్ మీడియాలో ‘మోస్ట్ లక్కీ పర్సన్’ గా మీమ్స్‌లో చోటు దక్కించుకున్నాడు..
ఐపీఎల్ 2023 సీజన్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ని 5 వికెట్ల తేడాతో ఓడించింది. 19వ ఓవర్ వరకూ మ్యాచ్‌పై పట్టు సాధించిన సీఎస్‌కే, టైటాన్స్‌ని ఓడించేలా కనిపించింది...
Image credit: PTI
అయితే 9 బంతుల్లో 18 పరుగులు కావాల్సిన దశలో రషీద్ ఖాన్ వరుసగా ఓ 6, 4 బాదడంతో మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆఖరి ఓవర్‌లో ఓ 6, 4 బాదిన రాహుల్ తెవాటియా మ్యాచ్‌ని ముగించేశాడు..