- Home
- Sports
- Cricket
- IPL 2023 సీజన్ ఆరంభానికి ముందే మొదలైన ఆర్‌సీబీ బ్యాడ్‌టైం... గాయంతో సగం సీజన్ నుంచి...
IPL 2023 సీజన్ ఆరంభానికి ముందే మొదలైన ఆర్‌సీబీ బ్యాడ్‌టైం... గాయంతో సగం సీజన్ నుంచి...
WPL లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస ఓటములతో ప్లేఆఫ్స్ నుంచి తప్పుకుంది. జట్టు నిండా స్టార్ ప్లేయర్లతో టైటిల్ ఫెవరెట్ టీమ్‌గా డబ్ల్యూపీఎల్ మొదటి సీజన్ మొదలెట్టిన ఆర్‌సీబీ, వరుస పరాజయాలతో తీవ్రంగా నిరాశపరిచింది. డబ్ల్యూపీఎల్‌తో మొదలైన బ్యాడ్‌లక్, ఐపీఎల్‌లోనూ కొనసాగుతుందని ఫ్యాన్స్ ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు..

ప్రతీ ఐపీఎల్ సీజన్‌ని భారీ అంచనాలతో మొదలెట్టడం, ఈసారి టైటిల్ ఎలాగైనా గెలుస్తామని ధీమా వ్యక్తం చేయడం... లీగ్ మొదలయ్యాక వరుస పరాజయాలతో అభిమానులను తీవ్రంగా నిరాశపరచడం... 15 ఏళ్లుగా ఆనవాయితీగా జరుగుతూ వస్తోంది...
Josh Hazlewood
ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభానికి ముందు కూడా ఆర్‌సీబీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వస్తాడా? రాడా? అని అనుమానాలు రేపిన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హజల్‌వుడ్, సగం సీజన్‌కి దూరమయ్యాడు...
Josh Hazlewood
ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆర్‌సీబీ ఆడే మొదటి 7 మ్యాచుల్లో జోష్ హజల్‌వుడ్ ఆడడం లేదని ఖరారైపోయింది.. సౌతాఫ్రికాతో సిరీస్‌లో గాయపడిన జోష్ హజల్‌వుడ్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో ఆడలేదు. ఆ తర్వాత ఇండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా పాల్గొనలేదు...
అదృష్టానికి ఆమడదూరంలో ఉండే ఆర్‌సీబీ, గాయాల విషయంలోనూ మిగిలిన టీమ్‌ల కంటే ముందు వరుసలో ఉంది. ఏకంగా ముగ్గురు ఆర్‌సీబీ ప్లేయర్లు గాయాలతో బాధపడుతున్నారు. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ ఇప్పటికే గాయంతో ఐపీఎల్ 2023 నుంచి తప్పుకున్నాడు...ఐపీఎల్ 2022లో సెంచరీ చేసిన యంగ్ బ్యాటర్ రజత్ పటిదార్, గాయంతో బాధపడుతున్నాడు.
‘ప్రణాళిక ప్రకారం నా ఆరోగ్య పరిస్థితి మెరగవుతోంది. ఏప్రిల్ 14 వరకూ నేను పూర్తి ఫిట్‌గా ఉంటాను. అప్పటి దాకా జరిగే మ్యాచుల్లో నేను ఆడడం లేదు. అవసరమైతే మరో వారం రోజులు తీసుకుని బరిలో దిగుతాను...
Josh Hazlewood
టీ20ల్లో వర్క్‌లోడ్ ఎక్కువగా పడుతుంది. ఫాస్ట్ బౌలర్లపై ఈ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. నాకు పూర్తి పేస్ అందుకోవడానికి ఒకటి లేదా రెండు సెషన్ల ప్రాక్టీస్ సరిపోతుంది. టెస్టులు, వన్డేలతో పోలిస్తే టీ20ల్లో వేసే 24 బంతులు కూడా పూర్తి పేస్‌తో వేయాల్సి ఉంటుంది. అది చాలా కష్టమైన విషయం...’ అంటూ కామెంట్ చేశాడు జోష్ హజల్‌వుడ్..
2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన జోష్ హజల్‌వుడ్‌ని, ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.7 కోట్ల 75 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. గత సీజన్‌లో 12 మ్యాచులు ఆడిన హజల్‌వుడ్ 20 వికెట్లు తీశాడు.